- Home
- Life
- ఎక్కడి మొదటిరాత్రి? ఎవరికి ఫస్ట్ నైట్? : అమ్మాయిలు చెప్పే ఈ ఓయో స్టోరీలకే మార్కెట్లో డిమాండ్
ఎక్కడి మొదటిరాత్రి? ఎవరికి ఫస్ట్ నైట్? : అమ్మాయిలు చెప్పే ఈ ఓయో స్టోరీలకే మార్కెట్లో డిమాండ్
సోషల్ మీడియాలో కొత్త ట్రెండ్ మొదలయ్యింది. అందమైన అమ్మాయిలు పచ్చిగా మాట్లాడుతున్న ఏఐ వీడియోల ప్రవాహం బాగా పెరిగిపోయింది.''శోభనం అనండి. మొదటి రాత్రి అనొద్దు. ఎవరికి మొదటి రాత్రి ? ఎక్కడి పస్ట్ నైట్?" అంటూ సాగే మాటలకు కొందరు సొంగకారుస్తున్నారు

సొంగ కారులు !
ఇప్పుడు నడుస్తోంది... క్లిక్ జర్నలిజపు యుగం !
ఎన్ని వ్యూస్ వస్తే అంత డబ్బులు .
తిట్టినా ఫరవాలేదు .. ఎన్ని కామెంట్స్ వస్తే అన్ని వ్యూస్.
డబ్బు కోసం అడ్డదారులు తొక్కడం ఇప్పుడు కామన్ .
ప్రభుత్వ ఉద్యోగులు , రాజకీయనాయకులు , రీల్స్ గాళ్ళు.. ఇదే దారిలో .
బతక నేర్పే విషయాలు చెబితే చూసేవారు తక్కువ .
ఎంత మసాలా దట్టిస్తే అన్ని వ్యూస్.
మన దేశంలో సొంగ కార్చే పురుషుల సంఖ్య ఎక్కువ .
ఒక మహిళ ... ఆ... విషయాల గురించి మాట్లాడితే... " కిక్కు రా !" అని ఫీల్ అయ్యేవారు ఎక్కువ.
దీనితో ఇలాంటి విషయాలు మాట్లాడే మహిళలు తయారయ్యారు .
మార్కెట్ డిమాండ్ మరి .
శోభనం అనండి.. మొదటి రాత్రి అనొద్దు
ఎంతయినా మన దేశంలో .. కట్టుబాట్లు విలువలకు .. ఇంకా ఎంతో కొంత గౌరవం ఉంది.
మరీ బరి తెగించి మాట్లాడడానికి సిద్ధంగా ఉండే మహిళలు తక్కువ.
" ఈ కాలం అబ్బాయిలు... వేస్ట్ సరుకు .. ఓయో హోటల్ కు పోదాము అంటారు . తీరా అక్కడ రెండు నిముషాలకే నీరు కారిపోయి .. బిర్యాని తింటూ... టీవీ చూస్తూ గడుపుతారు "
" నేను... నా బాయ్ ఫ్రెండ్ మంచోడు అనుకొన్నా. మొన్న ఇంకోడితో ఓయో హోటల్ కు పోయా . అక్కడ నా బాయ్ ఫ్రెండ్ కూడా ఇంకో అమ్మాయితో దొరికాడు. దొంగ చచ్చినోడు !"
" శోభనం అనండి. మొదటి రాత్రి అనొద్దు . ఎవరికి మొదటి రాత్రి ? ఎక్కడి మొదటి రాత్రి ?"
ఈ మాటలు ఒక మహిళ అంటే నరాలు జివ్వున లాగించేసుకొనే సొంగ కారులు బాగా ఉన్న సమాజం మనది .
మహిళ ఫేక్ ... మాటలు ఫేక్.. వీడియో ఫేక్.. బకరాలు మాత్రం నిజం!
మరీ ఇంత బరి తెగించి ఒక మహిళ మాట్లాడడం కష్టం .
మాట్లాడినా ... ఆ మహిళ అందంగా కనిపిస్తుంది అని గ్యారెంటీ లేదు .
అందమయిన మహిళ ఇలా మాట్లాడితే .. చాలా మందికి ఫుల్ బాటిల్ కొట్టినంత కిక్కు .
ఆమె తన కోసమే చూస్తోంది .. తనలాంటి మొగోడె ఆమెకు సరైనోడు అనుకొని ఆడ్రెనాలిన్ పెంచుకొనే వారు ఎక్కువ
దీనితో ఫేక్ గాళ్ళు కృతిమ మేధతో ఇలాంటి వీడియో లు సృష్టిస్తున్నారు .
మహిళ ఫేక్ ...
మాటలు ఫేక్ .
వీడియో ఫేక్ .
బకరాలు మాత్రం నిజం !
ఆ మసాలా మాటలు రాసింది ఎవరో ఫామిలీ ప్యాక్ అంకుల్ గాడు.
"వామ్మో ఈ కాలం అమ్మాయిల్లో ఎంత మసాలా? ఎంత బరితెగింపు?!!! " అంటూ తెగ చూసి ఎక్సయిట్ అయిపొయ్యే సొంగకారులు కోకొల్లలు .
వెరసి కలిసి డీప్ ఫేక్ వీడియోస్ వైరల్ .
మోసగాడికి డబ్బులే డబ్బులు .
మోసపోయేది డిజిటల్ ఏజ్ నిరక్షరాస్యులే
ప్రపంచం లో లేని...
కల్పిత వ్యక్తి ..
కల్పిత మాటలు .
.దీన్ని చూసి తాము ఉత్తి పుణ్యానికి ఆవేశ పడిపోతున్నామని
... తెలుసుకోలేని
... డిజిటల్ ఏజ్ నిరక్షరాస్యులు ..
సగటు మగాడిలోని సొంగ కార్చే తత్త్వం అనంతం .
ఇది మోసగాళ్లకు బంగారు గని .
సొంగ కార్చే తత్త్వం ఏ స్థాయిలో ఉంటుంది అని చెప్పడానికి ఒక ఉదాహరణ .
మాధాపూర్ ఏం రెడ్ లైట్ ఏరియా కాదు
"మాధాపూర్ లో కో లివింగ్ హాస్టల్స్ ఉంటాయి " అని వార్త .
దీన్ని చదవగానే... "ఆహా.. మనం మాదాపూర్ కు పోవాలి .. కోలివింగ్ హాస్టల్ లో చేరాలి . రూమ్ ... అందులో కింగ్ సైజు బెడ్ .. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పని చేస్తున్న అమ్మాయి . ఆహా .. ఓహో .. ఏమి నా భాగ్యము ! జస్ట్ పండగ చేసుకోవడమే " అంటూ సొంగ కార్పుడు .
"ఒరేయ్ నీ పిండం పిల్లులకు పెట్టా!
నీ దరిద్రం సంత కెళ్ళా!
అది రెడ్ లైట్ ఏరియా కాదురా !
ఒక అమ్మాయి అబ్బాయి ఇష్టపడితే .. వాళ్ళు పెళ్లి చేసుకోకుండా లివ్ ఇన్ పార్టనర్స్ గా ఉంటారు.
సరే అదొక దరిద్రం.
దానికి సంబంధించి సవాలక్ష సమస్యలు .
అది వేరే టాపిక్ .
లివ్ ఇన్ జంటల కోసం రూమ్స్ .
అవే కోలివింగ్ హాస్టల్స్ .
అంతే కానీ నువ్వు లగెత్తు కెళ్ళిపోతే అక్కడ నువ్వు ఊహించిన సీన్స్ ఏమీ ఉండవు.."
అని ఎవరూ చెప్పరు .
తొలిచూపులోనే ఓయో రూంకి...
ఇంకో విషయం.
"ఈ కాలం అమ్మాయిలు బాగా బోల్డ్ అయిపోయారు . ఒకప్పటిలా సైట్ కొట్టడాలు .. ప్రేమ లేఖలు.. నెలల తరబడి వెయిటింగ్ ఏమీ ఉండదు . నేరుగా పాయింట్ లోకి వచ్చేయడమే జస్ట్ పది మిముషాల్లో ఓయో కు తీసుకెళ్లి పోవచ్చు " అని రీల్స్ గాళ్ళు .. గొట్టం గాళ్ళు { యు ట్యూబ్ } ప్రచారం చేస్తున్నారు
వాస్తవం ఏమిటంటేఇలా నేరుగా ఓయో హోటల్స్ కు నడిచే వారిలో సింహభాగం హనీ ట్రాప్ పార్టీలు .
సొంతంగా ఆపరేట్ చేసేవారు కొందరు ..
ఒక డాన్ నిర్వహణలో సొంగకారులను ఇరికించి అటుపై పీల్చి పిప్పి చేసేరకాలు మిగతావారు .
అయిదు నిముషాల ఓయో హోటల్ కక్కుర్తి కి .. అటుపై ఆస్తులు పోతాయి .
జైల్లో... బైలో తెలియని స్థితి లో బతకాలి .
ఒక అమ్మాయి తన మనసుకు నచ్చినవాడితోనే ముందడుగు వేస్తుంది .
అందం.. ఆకర్షణ ... భద్రత.. ఇలా ఎన్నో చూసుకుంటుంది .
ఇటీవల కాలం లో ... ఉద్యోగం కోసమో... చేస్తున్న ఉద్యోగంలో భద్రత / పదోన్నతి లాంటి వాటి కోసం రాజీ పడే మహిళలు కాస్త ఎక్కువయిన మాట వాస్తవం .
కానీ అదే సమయం లో ... పిచ్చి రీల్స్ చూసి... ఈ కాలం అమ్మాయిలు అందరూ అదే యావలో ఉన్నారు అని సొంగ కార్చి ..
సొంగ కార్చుకోవడం దాక .. అయితే ఒక ఎత్తు..
ఇంకో అడుగు ముందుకు వేస్తె ..
బతుకు పాకిస్థాన్ !
నేటి చట్టం ఆడవారి చుట్టం .
{ సాధారణ మహిళలు దాన్ని ఉపయోగించుకోలేక పోతున్నారు . ప్రొఫెషనల్ హనీ ట్రాప్ బ్లాక్ మైలర్స్ కు చట్టాన్ని ఎలా ఉపయోగించుకోవాలో బాగా తెలుసు } .
తస్మాత్ జాగ్రత్త .

