Fact check: బొద్దింకపాలు ఆరోగ్యానికి మంచివా.? ఆవు పాల కంటే ఎక్కువ పోషకాలు ఉంటాయా.?
బొద్దింక ఈ పేరు వినగానే అసహ్యకరంగా అనిపించడం ఖాయం. వంటింట్లో తిరుగుతూ ఆహార పదార్థాలపై వాలుతూ నానా రచ్చ చేస్తుంటాయి. అందుకే బొద్దింకలను తరిమికొట్టేందుకు రకరకాల కెమికల్స్ ఉపయోగిస్తుంటాం. అయితే బొద్దింక పాలు ఆరోగ్యానికి చాలా మంచివనే ఓ వార్త వైరల్ అవుతోంది. ఇంతకీ ఇందులో ఎంత వరకు నిజం ఉందో ఇప్పుడు తెలుసుకుందాం..
- FB
- TW
- Linkdin
Follow Us
)
Cockroach milk
ఈ వార్త చదివిన వెంటనే వచ్చే సందేహం అసలు బొద్దింకలు పాలు ఇస్తాయా.? నిజమే బొద్దింకలు పాలు ఇస్తాయి. అయితే ఇవి నిజమైన పాలు కావు. పసిఫిక్ బీటిల్ (డిప్లోప్టెరా పంక్టాటా) అనే జాతికి చెందిన బొద్దింకలు దాని పిల్లలకు ఆహారం ఇవ్వడానికి పోషకాలు అధికంగా ఉండే "పాలు లాంటి" పదార్థాన్ని ఉత్పత్తి చేస్తాయని పరిశోధకులు కనుగొన్నారు. వీటినే బొద్దింక పాలుగా చెబుతున్నారు. కొన్ని అధ్యయనాలు ఈ పాలలో ముఖ్యమైన అమైనో ఆమ్లాలు, కొవ్వులు, చక్కెరలతో నిండిన ప్రోటీన్ స్ఫటికాలు ఉన్నాయని అధ్యయనంలో తేలింది.
అయితే ఈ బొద్దింక పాలు ఆవు పాల కంటే నాలుగు రెట్లు ఎక్కువ పోషకాలను అందించే అవకాశం ఉందని పరిశోధనలు సూచిస్తున్నాయి. కానీ బొద్దింక పాలను సేకరించడం ప్రాక్టికల్‌గా అంత సులభమైన విషయం కాదు అలాగే బొద్దింకలు పాలను ఎక్కువవ ఉత్పత్తి చేయలేవు. అందుకే బొద్దింక పాలు ఇప్పటి వరకు వాణిజ్యపరంగా అందుబాటులో లేవు. కానీ సోషల్ మీడియా వేదికగా వీటికి సంబంధించి కొన్ని తప్పుడు వార్తలు తెగ ప్రచారం అవుతున్నాయి.
భవిష్యత్తులో బొద్దింక పాలు సంప్రదాయ పాలతో భర్తీ అవుతాయా అన్న దానిపై శాస్త్రీయంగా ఎలాంటి ఏకాభిప్రాయం లేదు. బొద్దింక పాలు సూపర్‌ఫుడ్‌గా మారనున్నాయని ప్రచారం జరుగుతున్నా సంప్రదాయ ఆవు, గేదె పాలకు ప్రత్యామ్నాయంగా మారనున్నాయని అని చెప్పేందుకు మాత్రం ఇంకా పరిశోధనలు జరగాల్సి ఉందని నిపుణులు అంటున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఆవు, గేదె వంటి పోషకాలు అధికంగా ఉన్న పాలను తీసుకోవడమే సురక్షితం.
ఇది కూడా చదవండి: ఆటో కి 3 చక్రాలు ఎందుకు ఉంటాయి, 4 చక్రాలు ఉంటే నష్టం ఏంటి? మూడు చక్రాలవల్ల ఉపయోగాలు తెలుసా?
ఇవీ నిజాలు..
బొద్దింక పాల గురించి కొన్ని తప్పుడు ప్రచారాలు జరుగుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో బొద్దింక పాలు అంటూ ఎలాంటివి లేవు. ఇది పచ్చి పాల మాదిరిగా లభించదు. బొద్దింక పాలు ప్రోటీన్ క్రిస్టల్స్ రూపంలో ఉంటుంది. బొద్దింక పాలపై మరిన్ని పరిశోధనలు జరుగుతున్నాయి.
నోట్: పైన తెలిపిన విషయాలను ప్రాథమిక సమాచారంగానే భావించాలి. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.