MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Toxic Movie First Review
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Face Serum: ముఖం మీద ముడతలు, గీతలు తగ్గించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

Face Serum: ముఖం మీద ముడతలు, గీతలు తగ్గించే ఫేస్ సీరమ్.. ఇంట్లోనే ఇలా తయారు చేసుకోండి

Face Serum: ముఖంపై ముడతలు, గీతలు కనిపిస్తే అందంగా కనిపించరు. వాటిని తగ్గించుకునేందుకు ఖరీదైన సౌందర్య ఉత్పత్తులను వాడాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఫేస్ సీరమ్ తయారు చేసుకుంటే ఆ ముడతలు, గీతలు పోతాయి.

2 Min read
Author : Haritha Chappa
Published : Jun 01 2026, 10:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఇంట్లోనే ఫేస్ సీరమ్ తయారీ
Image Credit : Getty

ఇంట్లోనే ఫేస్ సీరమ్ తయారీ

ముఖంపై కనిపించే వృద్ధాప్య లక్షణాలను తగ్గించుకోవడానికి చాలా మంది ముఖానికి ఫేస్ సీరమ్ వాడుతూ ఉంటారు. అయితే వీటి ఖరీదు ఎక్కువగా ఉంటుంది. అలాంటి ఖరీదైన సీరమ్‌లను వాడే కన్నా ఇంట్లోనే దాన్ని తయారు చేసుకోవచ్చు. ఇది ముఖంపై ఉన్న సన్నని గీతలు, ముడతలు వంటివి పోయేలా చేస్తుంది. నిద్రలేమి, ఎండలో ఎక్కువగా తిరగడం, తీవ్రమైన ఒత్తిడి, చర్మాన్ని సంరక్షించుకో పోవడం వల్ల చర్మం కాంతిహీనం గా మారుతుంది. దీనివల్లే ముడతలు ముఖంపై ఎక్కువ అవుతాయి. ఫేస్ సీరమ్ తయారుచేసి ప్రతిరోజు ముఖానికి రాసుకుంటే కొన్ని రోజుల్లోనే మీ చర్మం కొత్త మెరుపుతో అందంగా కనిపిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఫేస్ సీరమ్ తయారీకి ఏం కావాలి?
Image Credit : Getty

ఫేస్ సీరమ్ తయారీకి ఏం కావాలి?

ఇంట్లోనే ఫేస్ సీరమ్ తయారు చేయడానికి బియ్యం నీరు, కలబంద, విటమిన్ ఈ క్యాప్సూల్స్ కావాలి. ఈ మూడు కూడా చర్మాన్ని కాంతివంతంగా మారుస్తాయి. అందుకోసం రెండు టీ స్పూన్ల బియ్యం నీరు, రెండు టీ స్పూన్ల కలబంద జెల్, రెండు విటమిన్ ఈ క్యాప్సూల్స్ తీసుకోండి. బియ్యం నీటి కోసం ముందుగా రెండు టేబుల్ స్పూన్ల బియ్యాన్ని అరకప్పు నీటిలో అరగంట పాటు నానబెట్టండి. తర్వాత బియ్యాన్ని చేతులతో నొక్కుతూ కడగండి. దాన్ని వడకట్టి ఆ నీటిని తీసుకోండి.

Related Articles

Related image1
Cooling Paint: ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు
Related image2
Rahu Effects: రాహువు దెబ్బకు ఆగస్టు వరకు విలవిలలాడే 4 రాశులు ఇవే
34
ఇలా నిల్వచేసుకోండి
Image Credit : Getty

ఇలా నిల్వచేసుకోండి

ఇప్పుడు శుభ్రమైన గిన్నెను తీసుకుని అందులో రెండు టీ స్పూన్ల బియ్యం నీళ్లు, రెండు టీ స్పూన్ల కలబంద జెల్ వేసి బాగా గిలక్కొట్టాలి. ఇప్పుడు విటమిన్ ఇ క్యాప్సూల్ ను కత్తిరించి దానిలోని నూనె మిశ్రమాన్ని కూడా ఇందులో కలపాలి. బాగా కలిపిన తర్వాత సీరమ్ సిద్ధమైనట్టే. ఎక్కువ మొత్తంలో కావాలంటే ఎక్కువ పదార్థాలను వేసి తయారు చేసుకోవచ్చు. దీన్ని ఒక గాజు సీసాలో నిల్వ చేసుకోవాలి.

44
సీరమ్ ఎలా వాడాలి?
Image Credit : Getty

సీరమ్ ఎలా వాడాలి?

ఇంట్లో తయారు చేసిన ఈ సీరమ్ ముఖానికి రాసుకోవడం వల్ల మంచి అందాన్ని పొందవచ్చు. రాత్రి పడుకోబోయే ముందు ముఖం శుభ్రంగా కడగాలి. తర్వాత ఈ సీరం ముఖానికి పట్టించి రాత్రంతా అలా వదిలేయాలి. ఉదయం లేచాక శుభ్రమైన నీటితో కడుక్కుంటే సరిపోతుంది. ఇలా మీరు రెండు వారాలు చేసి చూడండి.. మీ చర్మం లో మార్పు స్పష్టంగా కనిపిస్తుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
సౌందర్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
ఈ మొక్కలు ఇంట్లో ఉంటే అప్పులపాలవుతారు
Recommended image2
Wall Stickers: గోడపై అంటుకున్న స్టిక్కర్లను పెయింట్ పోకుండా ఇలా ఈజీగా తీసేయండి!
Recommended image3
Sleep Problems: నిద్రలో పదేపదే మెలకువ వస్తోందా? ఈ 5 విషయాలు చెక్ చేసుకోండి!
Related Stories
Recommended image1
Cooling Paint: ఈ కొత్తరకం కూలింగ్ పెయింట్ వేస్తే ఇల్లు కూల్.. ఏసీ అవసరమే ఉండదు
Recommended image2
Rahu Effects: రాహువు దెబ్బకు ఆగస్టు వరకు విలవిలలాడే 4 రాశులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved