MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Parenting: ప్రతి తల్లీ.. తన కూతురికి చెప్పాల్సిన 6 మాటలు ఇవి, బతకడం నేర్పుతాయి..!

Parenting: ప్రతి తల్లీ.. తన కూతురికి చెప్పాల్సిన 6 మాటలు ఇవి, బతకడం నేర్పుతాయి..!

Parenting: ప్రతి తల్లి తన కూతురికి వంట చేయడం, ఇంట్లో పనులు చేయడం నేర్పించినా.. నేర్పించకపోయినా జీవితానికి కావాల్సిన కొన్ని విషయాలు మాత్రం కచ్చితంగా చెప్పాలి. ఎలాంటి సమాజంలో అయినా వారు బతకగలుగుతారు.

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 01 2026, 04:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
తల్లి నేర్పాల్సిన పాఠాలు..
Image Credit : Chat GPt

తల్లి నేర్పాల్సిన పాఠాలు..

ఇంట్లో ఎదుగుతున్న కూతురు ఉందంటే... బంగారం చేయించాలి, చిన్న వయసు నుంచే ఇంటి పనులు, వంట పనులు నేర్పించాలి అనుకుంటారు. అప్పుడే పెళ్లి తర్వాత అత్తారింట్లో ఇబ్బంది పడకుండా ఉంటుంది అనుకుంటారు. కానీ, కూతురికి ఈ పనులు నేర్పించకపోయినా.. ప్రతి తల్లి కచ్చితంగా కొన్ని మాటలు చెప్పాలి. అవి ఏంటి? ఆ మాటలు వారికి ఎలా ఉపయోగపడతాయి అని తెలుసుకుందాం...

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.నిన్ను నువ్వు గౌరవించుకో...
Image Credit : Getty

1.నిన్ను నువ్వు గౌరవించుకో...

సమాజంలో అమ్మాయిలను గౌరవించాలి అని అందరూ చెబుతారు. కానీ, అంతకన్నా ముందు.. ప్రతి అమ్మాయి తనను తాను గౌరవించుకోవాలి. ఈ విషయాన్ని తల్లే స్వయంగా నేర్పించాలి. ‘ ప్రపంచం నిన్ను ఎలా చూడాలి అనేది, ముందుగా నువ్వు నిన్ను ఎలా చూసుకుంటావో దానిపైనే ఆధారపడి ఉంటుంది. నీ ఆలోచనలు, నీ ఎమోషన్స్ చాలా ముఖ్యమైనవి అని గుర్తించాలి. ఎవరి కోసం నీ ఆత్మ గౌరవాన్ని కోల్పోవద్దు’ అని చెప్పాలి.

2.‘నో’ చెప్పడం తప్పు కాదు..

ఎవరైనా ఏదైనా నీకు ఇష్టం లేని పని చేయమని ఒత్తిడి చేసినప్పుడు ‘ నో’ చెప్పడంలో ఎలాంటి తప్పు లేదు. నీకు నచ్చింది నువ్వు ధైర్యంగా చెప్పడంలో కొంచెం కూడా మొహమాట పడకూడదు. అని కూడా చిన్నతనం నుంచే నేర్పించాలి.

3.నిజమైన ఆస్తి ఇదే..

నగలు, డబ్బు ఈ రోజు ఉండచ్చు. రేపు ఉండకపోవచ్చు. కానీ, విద్య, నైపుణ్యాలు జీవితాంతం నీతో ఉంటాయి. కొత్త విషయాలు నేర్చుకోవడం ఎప్పుడూ ఆపొద్దు. అవే నీకు ఆత్మవిశ్వాసాన్ని, స్వతంత్రతను ఇస్తాయి.

Related Articles

Related image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Related image2
Chillies: కారం కారంగా తినే మిరపకాయ మనది కాదా? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది..!
33
4.ఉద్యోగం చేస్తే సరిపోదు..
Image Credit : Getty

4.ఉద్యోగం చేస్తే సరిపోదు..

డబ్బు సంపాదించడానికి ఉద్యోగం చేస్తే సరిపోదు. జీవితంలో ఆర్థికంగా ఎదగాలి. దాని కోసం డబ్బు సంపాదిస్తే సరిపోదు. డబ్బు ఎలా ఖర్చు చేయాలి? ఎలా పొదుపు చేయాలి? ఎక్కడ పెట్టుబడి పెట్టాలి అనే విషయాలు కూడా తెలుసుకోవాలి. ఆర్థిక స్వాంతంత్రత కచ్చితంగా నేర్చుకోవాలి.

5.తప్పులు చేయడానికి భయపడకూడదు..

జీవితంలో ఆడపిల్ల తప్పు చేయకూడదు అని మన సమాజం ఎక్కువగా నమ్ముతుంది. కానీ, జీవితంలో అందరూ తప్పులు చేస్తారు. కానీ అదే తప్పు నుంచి పాఠం నేర్చుకొని ముందుకు వెళ్లడమే అసలైన విజయం అని కచ్చితంగా చెప్పాలి.

6.నీ ఆనందాన్ని పక్కన పెట్టకూడదు..

ఇతరులను సంతోషపెట్టడం మంచిదే. కానీ అందుకోసం నీ ఆరోగ్యం, నీ కలలు, నీ సంతోషాన్ని ఎప్పుడూ త్యాగం చేయొద్దు. నిన్ను నువ్వు ప్రేమించుకోవడం కూడా జీవితంలో ఒక ముఖ్యమైన విలువ.

తల్లులు గుర్తించుకోవాల్సిన మరో ముఖ్యమైన విషయం...

కూతుళ్లు ఎక్కువగా విన్నదానికంటే చూసిందే ఎక్కువగా నేర్చుకుంటారు. కాబట్టి గౌరవం, నిజాయితీ, కష్టపడే తత్వం, ఆత్మవిశ్వాసం వంటి విలువలను మాటల్లో చెప్పడంతో పాటు, మీ ప్రవర్తనలో కూడా చూపించడం చాలా ముఖ్యం. ప్రతి అమ్మ తన కూతురికి జీవితంలో అన్ని సమస్యలకు సిద్ధమైన సమాధానాలు ఇవ్వలేకపోవచ్చు. కానీ సరైన విలువలు, ఆత్మగౌరవం, ధైర్యం, స్వతంత్ర ఆలోచనను నేర్పగలిగితే, ఆమె ఎలాంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోగలదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిన్నారుల సంరక్షణ
Latest Videos
Recommended Stories
Recommended image1
Blouse Designs: మగువల మనసు దోచే స్టైలిష్ బ్యాక్ డిజైన్ బ్లౌజులు
Recommended image2
Anklet Designs:ఈ కాలం అమ్మాయిల మోస్ట్ ఫేవరేట్ గోల్డెన్ పట్టీల డిజైన్లు
Recommended image3
Frocks For Kids: చిన్నారుల కోసం క్యూట్ ఫ్రాక్స్.. ఎంత బాగున్నాయో!
Related Stories
Recommended image1
Parenting: మగ పిల్లలకు తల్లి చెప్పాల్సిన 7 లైఫ్ లెసెన్స్.. జీవితాన్నే మార్చేస్తాయి..!
Recommended image2
Chillies: కారం కారంగా తినే మిరపకాయ మనది కాదా? దీని వెనక పెద్ద చరిత్రే ఉంది..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved