బరువైన వెండి మెట్టెలు ధరించడం ఇష్టం లేనివాళ్లు… ఈ సింగిల్ స్టోన్ మెట్టెలు ఎంచుకోండి. సాలిడ్ సిల్వర్ డిటైలింగ్ తోపాటు చిన్న చిన్న రాళ్లు అద్భుతమైన అందాన్ని ఇస్తాయి.
మీ పాదాల అందాన్ని రెట్టింపు చేసే ఈ చిక్ ఫ్లవర్ ఫుట్ రింగ్ మెట్టెలను ఎంచుకోండి. ఇవి 1000 రూపాయల వరకు లభిస్తాయి. ఈ డిజైన్లు మువ్వల పట్టీలతో కలిపి వేసుకుంటే వర్సటైల్ లుక్ వస్తుంది.
మీకు హెవీ వర్క్ ఇష్టమైతే, మీ కలెక్షన్‌లో ఈ రాజస్థానీ సిల్వర్ ఫుట్ రింగ్‌ను తప్పకుండా చేర్చుకోండి. ఇందులో పారదర్శకమైన రాళ్లతో పాటు అంచులలో అద్దాల డిటైలింగ్ ఉంది.
ఆఫీసులకు వెళ్లే మహిళలకు ఈ బ్యాండ్ ఫుట్ రింగ్ కూడా ఒక మంచి ఎంపిక. ఇవి సాలిడ్, అడ్జస్టబుల్ రకాల్లో లభిస్తాయి. వెండి చెక్కడాలపై మీనాకారీ రాళ్లు ఉండటంతో పాదాలకు అందాన్ని తెస్తాయి.
ఇప్పటివరకు ఉన్నవాటిలో ఇది చాలా డీసెంట్ డిజైన్. ఇది ఓపెన్ డిజైన్‌తో పాటు ఫ్లోరల్ వర్క్‌తో వస్తుంది. మీరు ఫ్యాషనబుల్ లుక్ ఇష్టపడితే, దీన్ని ఎంచుకోండి.
రోజువారీ వాడకానికి సిల్వర్-ఆక్సిడైజ్డ్ ఫుట్ రింగ్‌ను ఎంచుకోవచ్చు. ఇందులో సాలిడ్ వర్క్‌తో పాటు మధ్యలో గులాబీ రంగు రాయి ఉంటుంది. బ్లాక్ బోర్డర్ డిటైలింగ్ ఒక ఫ్యూజన్ లుక్‌ను ఇస్తుంది.
నిండుగా కనిపించే లుక్ ఇష్టపడే మహిళల కోసం ఈ మెట్టెలు చాలా బాగుంటాయి ఇందులో సాలిడ్ డిజైన్, మీనాకారీ రాళ్లతో పాటు వేలాడే పూసలు ఉన్నాయి. చాలా డిఫరెంట్ గా కనిపిస్తాయి