Kitchen Hacks: టీ జల్లెడ నల్లగా మారిందా? చిటికెలో కొత్తదానిలా మార్చేయచ్చు
Kitchen Hacks: టీ జల్లెడ నల్లగా మారిందని.. దానిని పారేసి, కొత్తది కొంటున్నారా? ఇక నుంచి ఆ అవసరం లేదు. పాతదాన్నే రెండు నిమిషాల్లో కొత్తదానిలా మార్చేయవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం.. రేస్తారు.

టీ జల్లెడ..
భారతదేశంలో దాదాపు ప్రతి ఇంట్లో టీ చేస్తూ ఉంటారు. ఇది చాలా సర్వసాధారణం. ఈ టీ వడపోయడానికి మనమంతా టీ జల్లెడ వాడుతూ ఉంటాం. అయితే.. ఎక్కువ కాలం వాడటం వల్ల.. టీ జల్లెడలో టీ పొడి ఇరుక్కుపోతుంది. కాలక్రమేనా టీ పొడి మందపాటి పొరలా పేరుకుపోతుంది. క్రమంగా దాని రంధ్రాలను మూసేస్తుంది. అప్పుడు టీ వడపోయడం కష్టమౌతుంది. వెంటనే చాలా మంది దాని స్థానంలో కొత్తది కొనుగోలు చేస్తారు.
సింపుల్ గా శుభ్రం చేయవచ్చు..
టీ జల్లెడ శుభ్రం చేయడం కష్టం కాబట్టి.. కొత్తది కొనుగోలు చేస్తున్నాం అని చాలా మంది చెబుతుంటారు. కానీ.. కొన్ని సింపుల్ చిట్కాలతో.. పాత టీ జల్లెడను కొత్త దానిలా మార్చుకోవచ్చు. దీని కోసం పెద్దగా కష్టపడాల్సిన అవసరం లేదు. ఎక్కువ ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు.
ఎలా శుభ్రం చేయాలి?
కొన్నిసార్లు మురికి ఎంత మొండిగా పేరుకుపోతుందంటే సబ్బు, స్క్రబ్బర్‌లు కూడా పనిచేయవు. ముఖ్యంగా స్టీల్, ప్లాస్టిక్ జల్లెడలో టీ పొడి చిక్కుకున్నప్పుడు. కానీ సరైన ఇంటి చిట్కాలతో నిమిషాల్లో జల్లెడ మెరుపును తిరిగి పొందవచ్చు.
బేకింగ్ సోడా…
టీ జల్లెడను శుభ్రం చేయడానికి బేకింగ్ సోడా, వెనిగర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఒక గిన్నెలో నీటిని మరిగించి, దానికి వెనిగర్, బేకింగ్ సోడా, కొద్దిగా గిన్నెలు కడిగే లిక్విడ్ కలపాలి. ఇప్పుడు మురికి జల్లెడను ఈ వేడి నీటిలో ఉంచి కొన్ని నిమిషాలు వదిలేయాలి. ఇది పేరుకుపోయిన మురికిని వదులు చేస్తుంది.
టూత్ బ్రష్‌తో శుభ్రం చేయండి
కొంత సమయం తర్వాత, జల్లెడను బయటకు తీసి పాత టూత్ బ్రష్‌తో మెల్లగా రుద్దండి. పాత టీ పొడి సులభంగా బయటకు రావడం, మూసుకుపోయిన రంధ్రాలు తెరుచుకోవడం మీరు గమనించవచ్చు.
మీ టీ జల్లెడ స్టీల్‌తో చేసినదైతే, దానిని కొన్ని నిమిషాలు తక్కువ మంట మీద వేడి చేయండి. అది చల్లారిన తర్వాత, స్క్రబ్బర్‌తో శుభ్రం చేయండి. ఇలా చేస్తే నిమిషాల్లో టీ జల్లెడ కొత్తదానిలా మెరుస్తూ కనపడుతుంది.

