- Home
- Life
- వర్షంలో వేడి వేడి బజ్జీలు, బోండాలు, పకోడీలను తింటున్నారా? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే
వర్షంలో వేడి వేడి బజ్జీలు, బోండాలు, పకోడీలను తింటున్నారా? అయితే ఈ విషయాలను మీరు ఖచ్చితంగా తెలుసుకోవాల్సిందే
వర్షంలో అలా బయటకు వెళ్లి వేడి వేడి బజ్జీలను, పకోడీలను లేదా బోండాలను తింటుంటే వచ్చే ఆ మజాయే వేరబ్బా.. వర్షంలో ఇవి ఎంత టేస్టీగా అనిపిస్తాయో కదూ.. కానీ ఇవి మీ పాణానికి ఏ మాత్రం మంచివి కావు..

చిటపట చినుకులు పడుతూ ఉండే.. వేడి వేడి మసాలా బోండాలో లేదా వేడి వేడి పకోడో లేదా మిర్చి బజ్జో తింటే అదిరిపోతుంది కదూ.. వర్షాకాలం (rainy season)లో దాదాపుగా అందరూ వీటిని టేస్ట్ చేస్తారు. వీలు దొరికనప్పుడల్లా.. బయటకెళ్లి నూనెలో బాగా వేయించిన ఆహారాలను లాగించేస్తుంటారు.
కానీ ఇవి ఏ రకంగా మన ఆరోగ్యానికి మంచి చేస్తాయన్న సంగతి ఎంత మంది ఆలోచించారూ. అసలు వీటిని తినడం సురక్షితమేనా? వీటిని తింటే ఎలాంటి రోగాలొస్తయి అన్న సంగతి ఎప్పుడన్నా ఆలోచించారా? ఈ సీజన్ లో వీటిని తినడం ఏ మాత్రం ఆరోగ్యానికి మంచిది కాదని ఆరోగ్య నిపుణులు (Health professionals)హెచ్చరిస్తున్నారు.
ఎందుకంటే ఆయిలీ ఫుడ్స్ మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావు. వీటిని తినడం వల్ల జీర్ణ సమస్యలు (Digestive problems)తలెత్తుతాయి. గ్యాస్ (Gas), ఎసిడిటీ (Acidity) వంటి సమస్యల బారిన పడాల్సి వస్తది. అంతేకాదు ఈ ఫుడ్స్ ను తింటే మీరు ఎంత ప్రయత్నం చేసినా బరువు తగ్గను గాక తగ్గరు. వీటివల్ల రోగ నిరోధక శక్తికి కూడా ఆటంకం కలుగుతుంది.
ఈ సీజన్ లో రోగ నిరోధక శక్తి (Immunity), వ్యాధి నిరోధకాలు (Antibiotics)చాలా అవసరం. ఇవి మెరుగ్గా ఉంటేనే మీరు ఎలాంటి రోగాల బారిన పడే అవకాశం ఉండదు. రోగ నిరోధక శక్తి తగ్గితే ఎన్నో అనారోగ్య సమస్యల బారిని పడాల్సి వస్తది. అందుకే ఇలాంటి ఆహారాలకు బదులుగా మన ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలనే తినాలని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. అవేంటంటే..
పాలు (the milk), చక్కెర (Sugar)ఎక్కువగా ఉండే టీ కి బదులుగా రెగ్యులర్ గా గ్రీన్ టీ (Green tea)లేదా లెమన్ గ్రాస్ టీ (Lemon grass tea)ని తాగడం అలవాటు చేసుకోండి. సమోసాలు, వేయించి చిప్స్ వంటి Stuffed snacks ను తినడం మానేయండి. వీటికి బదులుగా ఇంట్లో తయారుచేసిన పాప్ కార్న్ ను తినండి. ఇవి వర్షాకాలంలో మీ ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ముఖ్యంగా ఆయిలీ ఫుడ్స్ ను తినే బదులు పండ్లను తినండి.
ఈ సీజన్ లో మీ ఆరోగ్యాన్ని మెరుగ్గా ఉంచే కొన్ని ఆహారాలు
jamun
వర్షాకాలంలో మాత్రమే ఈ పండ్లు లభిస్తాయి. ఇవి మన ఆరోగ్యానికి ఎంతో మంచి చేస్తాయి. ఆయుర్వేదంలో కూడా ఈ పండుకు గొప్ప స్థానం ఉంది. వీటిని తినడం వల్ల కడుపు నొప్పి (Stomach ache), గుండె జబ్బులు (Heart diseases), ప్రేగు సమస్యలు (Bowel problems), ఆస్తమా, డయేరియా వంటి ఎన్నో సమస్యలు తగ్గిపోతాయి. ఇవి మూత్రపిండాల నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో కూడా సహాయపడుతుంది. దీనిలో పుష్కలంగా ఉండే ఫైబర్ (Fiber) జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుంతుంది.
ఉసిరి (amla)
ఉసిరి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ఈ సీజన్ లో తీసుకోవడం వల్ల రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే బుుతుసంబంధ వ్యాధులను కూడా దూరం చేస్తుంది. అంతేకాదు ఈ ఉసిరి కడుపు నొప్పిని కూడా తగ్గించగలదు. దీనిలో యాంటీ ఆక్సిడెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఉసిరిని ప్రతిరోజూ తినే వారు ఎనర్జిటిక్ గా, చురుగ్గా ఉంటారు.