ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండటానికి వీటిని తప్పకుండా తినండి
మన ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండేనే మనం అన్ని విధాలా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కొన్ని రకాల ఆహారాలు మన ఊపిరితిత్తులను ఆరోగ్యంగా ఉంచుతాయి. అవేంటంటే..
శ్వాసకోశ వ్యాధులు
ప్రస్తుతం కాలంలో చాలా మంది శ్వాసకోశ వ్యాధులతో బాధపడుతున్నారు. ఈ సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. వాతావరణ కాలుష్యం పాటుగా ఎన్నో కారకాలు ఇందుకు కారణమవుతాయి.
సిగరెట్లు
సిగరెట్ పొగ మన ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఈ పొగను పీల్చడం, వాయు కాలుష్యం వల్ల ఊపిరితిత్తుల వ్యాధులు వస్తాయి.
హెల్తీ ఫుడ్స్
ఆరోగ్యకరమైన ఆహారాలు మనల్ని ఎన్నో రోగాల బారి నుంచి కాపాడుతాయి. రోజూ హెల్తీ పుడ్స్ ను తింటే ఊపిరితిత్తులు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. అవేంటంటే..
కర్కుమిన్
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇది ఎన్నో రోగాల ముప్పును తప్పిస్తుంది. ఈ కర్కుమిన్ మన ఊపిరితిత్తుల పనితీరును మెరుగుపరచడానికి కూడా సహాయపడుతుంది.
బ్రోకలీ
బ్రోకలీలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఈ కూరగాయను తినడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ప్రమాదం తగ్గుతుందని నిపుణులు అంటున్నారు.
వెల్లుల్లి
వెల్లుల్లిలో ఎన్నో ఔషదగుణాలుంటాయి. వీటిని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల శ్వాసకోశ ఇన్ఫెక్షన్లు దూరమవుతాయి.
అల్లం
అల్లాన్ని ఉపయోగించి ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గించుకోవచ్చు. అల్లం ఎన్నో శ్వాసకోశ వ్యాధులను నివారించడానికి సహాయపడుతుంది.