MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Pakistan Economic Crisis
Epic First Semester BO Collections
Megastar Chiranjeevi
Bigg Boss Telugu 10
Srikanth Daughter Medha Meka
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • Water Tank Cleaning: ట్యాంకులో దిగకుండా, నిమిషాల్లో వాటర్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

Water Tank Cleaning: ట్యాంకులో దిగకుండా, నిమిషాల్లో వాటర్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో తెలుసా?

Water Tank Cleaning: వాటర్ ట్యాంక్ కడగడం కష్టంగా ఉందా? అయితే, ట్యాంక్ లో దిగి కడగాల్సిన అవసరం లేకుండా నిమిషాల్లో వాటర్ ట్యాంక్ ఎలా క్లీన్ చేయాలో ఇప్పుడు చూద్దాం...

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 21 2026, 01:02 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Water Tank
Image Credit : AI

Water Tank

వాటర్ ట్యాంక్ క్లీన్ చేయడం చాలా పెద్ద పని. అంత సులువు కాదు. దీనికి చాలా సమయం పడుతుంది. ఈ ట్యాంక్ క్లీన్ చేయడానికి.. ట్యాంక్ లోకి దిగి.. దానిని శుభ్రం చేయాల్సి ఉంటుంది. అంతేకాదు, ట్యాంకులోని మురికి కారణంగా.. ఇన్ఫెక్షన్లు సోకే ప్రమాదం కూడా ఉంది. కానీ, ఈ సమస్యలు ఏమీ లేకుండా కేవలం కొన్ని నిమిషాల్లో వాటర్ ట్యాంక్ ని శుభ్రం చేయచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం..

వాటర్ ట్యాంకర్ క్లీన్ చేయడానికి మార్కెట్లో చాలా రకాల స్మార్ట్ గ్యాడ్జెట్స్ అడుగుపెట్టాయి. అలాంటి వాటితో.. వాటర్ ట్యాంకర్ ని చాలా ఈజీగా శుభ్రం చేయవచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
టెలిస్కోపిక్ వాటర్ ట్యాంక్ క్లీనర్..
Image Credit : AI

టెలిస్కోపిక్ వాటర్ ట్యాంక్ క్లీనర్..

టెలిస్కోపిక్ వాటర్ ట్యాంక్ క్లీనర్ తో నిమిషాల్లో ట్యాంక్ క్లీన్ చేయచ్చు. దీనికి బ్రష్ ఉంటుంది. దాని సహాయంతో.. ట్యాంక్ లోపల గోడలపై పేరుకుపోయిన నాచు, బురద, మురికిని చాలా సులభంగా తొలగించొచ్చు. దీని కోసం.. మీరు ట్యాంక్ లోపలికి దిగాల్సిన అవసరం లేదు.

33
సబ్మెర్సిబుల్ వాటర్ పంప్...
Image Credit : AI

సబ్మెర్సిబుల్ వాటర్ పంప్...

ట్యాంక్ శుభ్రం చేయానికి ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ట్యాంక్ శుభ్రం చేయడానికి ముందు మురికి నీటిని బయటకు తీయడం చాలా ముఖ్యం. దీనికి సబ్మెర్సిబుల్ వాటర్ పంప్ సహాయపడుతుంది. ఈ పంప్ ట్యాంక్ లో నిలిచి ఉన్న నీటిని వేగంగా బయటకు తీస్తుంది. దీని వల్ల శుభ్రపరిచే పని మరింత సులభం అవుతుంది దీనిని చిన్న, పెద్ద వాటర్ ట్యాంకులకు ఉపయోగపడుతుంది.

వీటి వల్ల ప్రయోజనం..

ఈ స్మార్ట్ పరికరాల వల్ల కలిగే వాటర్ ట్యాంక్ ని శుభ్రం చేయడం చాలా సులభం. ఎక్కువ శ్రమ పట్టదు. గంటల తరబడి పట్టే పనిని.. చాలా తక్కువ సమయంలోనే పూర్తి చేయవచ్చు. ట్యాంక్ లోపలికి దిగాల్సిన అవసరం లేదు. ఇన్ఫెక్షన్ల సమస్య కూడా ఉండదు.

అయితే, వాటర్ ట్యాంక్ క్లీనర్ కొనుగోలు చేసేటప్పుడు, మీరు దాని రాడ్ పొడవు, హోస్ పైపు నాణ్యత , బ్రష్ దృఢత్వాన్ని తప్పకుండా తనిఖీ చేయాలి.

సబ్మెర్సిబుల్ పంపు కొనుగోలు చేసేటప్పుడు, మీరు దాని సామర్థ్యం, ​​నీటి విడుదల వేగం , విద్యుత్ వినియోగంపై శ్రద్ధ వహించాలి.

భద్రతా మార్గదర్శకాలు: సబ్మెర్సిబుల్ పంపు విద్యుత్తుతో పనిచేస్తుంది కాబట్టి, దానిని నీటిలో ఉపయోగిస్తున్నప్పుడు విద్యుత్ లీకేజీ జరగకుండా చూసుకోవడం ముఖ్యం. మంచి నాణ్యత గల బ్రాండెడ్ వైర్లు , భద్రతా స్విచ్‌లను (GFCI/ELCB) ఉపయోగించడం తప్పనిసరి. ట్యాంక్‌ను శుభ్రపరిచిన తర్వాత, క్లీనర్ బ్రష్, పంపును శుభ్రమైన నీటిలో కడిగి, ఆరబెట్టి, నిల్వ చేయాలి. ఇలా చేస్తే ఎక్కువ రోజులు మన్నికగా ఉంటాయి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
PopCorn: మొక్కజొన్న గింజ వేడి చేయగానే.. పాప్ కార్న్ గా ఎలా మారుతుంది..?
Recommended image2
Gold Earrings: డైలీవేర్‌కి ఈ కమ్మలు సూపర్‌గా ఉంటాయి.. ట్రై చేయండి!
Recommended image3
నీళ్లు తాగిన వెంటనే పరిగెత్తితే క‌డుపులో ఒక‌వైపు నొప్పి ఎందుకు వస్తుంది? దీనికి కార‌ణం ఏంటంటే?
Related Stories
Recommended image1
Leafy Greens: ఆకుకూరలను తూకంతో ఎందుకు అమ్మరు?కట్టలు కట్టి అమ్మడం వెనక రీజన్ ఏంటి?
Recommended image2
Premium Rice: ఈ బియ్యం కేజీ రూ.15వేలు, ఈ కేజీ బియ్యంతో ఇంట్లోకి 3 నెలల సరుకులు కొనచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved