MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Dalda: డాల్డాని దేనితో తయారు చేస్తారు..? నెయ్యికీ, డాల్డాకీ ఉన్న తేడా ఏంటి..?

Dalda: డాల్డాని దేనితో తయారు చేస్తారు..? నెయ్యికీ, డాల్డాకీ ఉన్న తేడా ఏంటి..?

Dalda: ఒకప్పుడు చాలా రకాల వంటకాల్లో డాల్డా వాడేవారు. కానీ, ఈ డాల్డా ఎందుకు తినకూడదు..? అసలు, దీనిని దేనితో తయారు చేస్తారు? ఇప్పుడు దీనిని వంటల్లో ఎందుకు వాడట్లేదు..?

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 02 2026, 11:05 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
డాల్డా తింటున్నారా?
Image Credit : chat gpt

డాల్డా తింటున్నారా?

ఒకప్పుడు పెళ్లిళ్లు, పేరంటాల్లోనూ, బేకరీ వంటకాల్లోనూ, పరోటా చేస్తున్నప్పుడు గుమగుమలాడే వాసన వచ్చేది. వీటన్నింటి తయారీలోనూ డాల్డా వాడేవారు. నెయ్యి కొనే స్థోమత లేని పేద, మధ్య తరగతి ప్రజలకు తక్కువ ధరలోనే నెయ్యి రుచిని, సువాసనను అందించే ప్రత్యామ్నాయంగా... మార్కెట్లో డాల్డా లభించేది. దీనితో చేసిన వంట చాలా సువాసనతోనూ, కమ్మగానూ ఉండేది. చాలా మంది దీనిని రెగ్యులర్ గా వాడేవారు. కానీ, డాల్డా వాడకం ఆరోగ్యానికి మంచిది కాదని తర్వాతర్వాత తెలిసొచ్చింది. దీంతో, దీని వాడకం కూడా తగ్గిపోయింది. అసలు, డాల్డా తినొద్దని డాక్టర్లు ఎందుకు చెబుతున్నారు? అసలు.. దీనిని ఎలా తయారు చేస్తారు? దీనిని తినడం వల్ల కలిగే నష్టాలు ఏంటి?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
డాల్డా ని దేనితో తయారు చేస్తారు..?
Image Credit : Asianet News

డాల్డా ని దేనితో తయారు చేస్తారు..?

డాల్డా మనకు చూడటానికి నెయ్యిలానే ఉంటుంది. కానీ, దీనిని మన నెయ్యి లాగా పాలతో తయారు చేయరు. దీనిని వెజిటేబుల్ గీ అని కూడా పిలుస్తారు. ఒక రసాయన ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ముందుగా పామాయిల్, సోయా బీన్, ప్రొద్దుతిరుగుడు వంటి చౌకైన కూరగాయల నూనెలను తీసుకుంటారు. ఆ నూనెలకు నికెల్ అనే లోహాన్ని ఉపయోగించి హైడ్రోజన్ వాయిను పంపుతారు. దీని వల్ల ద్రవ రూపంలో ఉన్న నూనె.. చిక్కగా మారి పసుపు రంగులోకి మారుతుంది. నెయ్యిలాగా గడ్డలాగా మారుతుంది. అందుకే, మనకు అది చూడటానికి అచ్చం నెయ్యిలానే ఉంటుంది. వాసన కూడా అలానే వస్తుంది.

డాల్డాను ఎందుకు తినకూడదు?

డాల్డా తయారీ ప్రక్రియలో సహజమైన నూనెల్లో ఉండే మంచి గుణాలు నశించడమే కాకుండా, శరీరానికి తీవ్ర హాని చేసే ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా తయారవుతాయి. డాల్డాను వేడి చేసినప్పుడు ఇవి మరిన్ని ప్రమాదకర రసాయనాలుగా మారుతాయి. అందుకే ఆరోగ్య నిపుణులు, వైద్యులు డాల్డాను ఆహారంలో వాడకూడదని ఖచ్చితంగా హెచ్చరిస్తారు.

33
డాల్డా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..
Image Credit : Getty

డాల్డా తినడం వల్ల వచ్చే ఆరోగ్య సమస్యలు..

గుండె జబ్బుల ప్రమాదం: డాల్డాలో ఉండే ట్రాన్స్ ఫ్యాట్స్ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ (LDL)ను విపరీతంగా పెంచి, మంచి కొలెస్ట్రాల్ (HDL)ను తగ్గిస్తాయి. దీనివల్ల రక్తనాళాల్లో కొవ్వు పేరుకుపోయి హార్ట్ ఎటాక్ (గుండెపోటు), స్ట్రోక్ వస్తాయి.

అధిక బరువు (ఓబెసిటీ): డాల్డాను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల జీవక్రియ మందగించి, శరీరంలో అనవసరమైన కొవ్వు పేరుకుపోయి అధిక బరువు పెరిగిపోతారు.

టైప్-2 డయాబెటిస్: ట్రాన్స్ ఫ్యాట్స్ ఇన్సులిన్ నిరోధకతను పెంచుతాయి, దీనివల్ల రక్తం కాకుండా చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

ఫ్యాటీ లివర్ : నాసిరకం కొవ్వులను కరిగించడం కాలేయానికి భారంగా మారి 'ఫ్యాటీ లివర్' సమస్యకు దారితీస్తుంది.

జీర్ణక్రియ సమస్యలు: డాల్డా త్వరగా జీర్ణం కాదు. దీనివల్ల గ్యాస్ట్రిక్, కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు వస్తాయి.

క్యాన్సర్ ప్రమాదం: డాల్డాను మళ్లీ మళ్లీ వేడి చేసి వాడటం వల్ల అందులో కార్సినోజెన్లు అంటే క్యాన్సర్ కలిగించే కారకాలు తయారవుతాయి.

అందుకే డాల్డా తినకూడదని డాక్టర్లు చెబుతుంటారు. ఈ డాల్డాను ఇప్పటికీ చాలా మంది బయట మార్కెట్ లో వాడుతూనే ఉన్నారు. బయటి బేకరీ వస్తువులు, పరోటాలు, సమోసాలు, స్వీట్లలో డాల్డాను ఎక్కువగా వాడుతూ ఉంటారు. అందుకే, బయటే కొనే ఆహారాల జోలికి వెళ్లకపోవడమే మంచిది. ఇంట్లోనే స్వచ్చమైన నెయ్యితో చేసిన ఆహారాలను తీసుకోవడం ఉత్తమం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Gold & Metal Rates

Loading rates…

All cities ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Fridge Cleaning: ఈ పదార్థంతో తుడిచారంటే పాత ఫ్రిజ్ కూడా కొత్తదానిలా మెరిసిపోతుంది
Recommended image2
Stylish Kurtis: డైలీవేర్ కి అదిరిపోయే కుర్తీలు.. వీటి ధర కూడా తక్కువే!
Recommended image3
Blouse Designs: అన్ని రకాల చీరలకు మ్యాచ్ అయ్యే బ్లాక్ బ్లౌజ్ డిజైన్లు
Related Stories
Recommended image1
Maida: మైదా పిండిని దేనితో తయారు చేస్తారు? గోధుమ పిండికీ, మైదా పిండికీ తేడా ఏంటి?
Recommended image2
Ghee Vs Butter: నెయ్యి, బటర్ రెండింటికి తేడా ఏంటి? రెండింటిలో ఏది ఆరోగ్యానికి ఎక్కువ మంచిది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved