MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Kitchen Hacks: ఈ 2 ఉంటే చాలు.. నల్లగా మారిన గ్యాస్ స్టవ్ బర్నర్ లు కొత్తగా మారిపోతాయ్!

Kitchen Hacks: ఈ 2 ఉంటే చాలు.. నల్లగా మారిన గ్యాస్ స్టవ్ బర్నర్ లు కొత్తగా మారిపోతాయ్!

Kitchen Hacks: వంట చేసేటప్పుడు పాలు, పప్పు, కూరలు పొంగి గ్యాస్ స్టవ్ మీద పడటం సహజమే. దానివల్ల బర్నర్స్ పై మురికి పేరుకుపోయి నల్లగా మారుతాయి. అయితే పెద్దగా కష్టపడకుండానే వాటిని ఈ రెండు పదార్థాలతో ఈజీగా క్లీన్ చేయవచ్చు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : Nov 02 2026, 02:05 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15
బర్నర్స్ ని ఎలా శుభ్రం చేయాలంటే?
Image Credit : Asianet News

బర్నర్స్ ని ఎలా శుభ్రం చేయాలంటే?

వంటగదిలో రోజూ వాడే గ్యాస్ స్టవ్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. పాలు పొంగడం, నూనె తుంపర్లు పడటం వల్ల బర్నర్‌పై మురికి పేరుకుపోతుంది. వంటయ్యాక వెంటనే తుడవకపోతే, ఆ వేడికి జిడ్డు గట్టిపడి నల్లగా మారుతుంది. దీనివల్ల బర్నర్ రంధ్రాలు మూసుకుపోయి మంట సరిగ్గా రాదు. మంట బ్లూ కలర్ లో కాకుండా పసుపు లేదా ఆరెంజ్ కలర్ వస్తుంటే, గిన్నెల అడుగున మసి పడుతుంటే దాన్ని సాధారణ సమస్యగా వదిలేయకూడదు. గ్యాస్ సరిగ్గా రానప్పుడు కార్బన్ మోనాక్సైడ్ లాంటి ప్రమాదకరమైన వాయువులు విడుదలయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి, బర్నర్‌ను శుభ్రంగా ఉంచుకోవడం మన భద్రతకు ఎంతో అవసరం. మరి ఏ పదార్థాలతో వీటిని ఈజీగా క్లీన్ చేయొచ్చో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25
బేకింగ్ సోడాతో ఇలా క్లీన్ చేస్తే..
Image Credit : Chat GPT

బేకింగ్ సోడాతో ఇలా క్లీన్ చేస్తే..

ఇంట్లో ఉండే బేకింగ్ సోడాతో బర్నర్లపై ఉన్న జిడ్డును, నల్లటి మురికిని ఈజీగా వదిలించవచ్చు. దీనికోసం 3 టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా, కొద్దిగా నీళ్లు, పాత టూత్ బ్రెష్, ఒక శుభ్రమైన క్లాత్ తీసుకోవాలి. ముందుగా స్టవ్ ఆపేసి, సిలిండర్ రెగ్యులేటర్ కట్టేసి స్టవ్ పూర్తిగా చల్లారనివ్వాలి. ఆ తర్వాత బర్నర్ క్యాప్‌లను మాత్రమే విడిగా తీయాలి. బేకింగ్ సోడాలో కొద్దిగా నీళ్లు కలిపి పేస్ట్‌లా చేసి, బర్నర్ క్యాప్‌ల బయటి వైపు ఉన్న నల్లటి మరకలపై రాయాలి. ఒక 15-20 నిమిషాల పాటు అలాగే వదిలేయాలి. ఆ తర్వాత బ్రెష్‌తో మెల్లగా రుద్ది, నీళ్లతో కడిగి పూర్తిగా ఆరబెట్టాలి. అంతే అవి కొత్త వాటిలా మెరిసిపోతాయి.

35
డిష్ వాష్ లిక్విడ్ తో కూడా..
Image Credit : Instagram

డిష్ వాష్ లిక్విడ్ తో కూడా..

బర్నర్ లపై ఉన్న నూనె, ఆహారపు మరకలను పోగొట్టడానికి డిష్ వాష్ లిక్విడ్ కూడా బాగా పనిచేస్తుంది. గోరువెచ్చని నీళ్లు, కొన్ని చుక్కల డిష్ వాష్ లిక్విడ్, ఒక సాఫ్ట్ స్పాంజ్ ఉంటే చాలు. ఒక గిన్నెలో గోరువెచ్చని నీళ్లు తీసుకుని అందులో కొద్దిగా డిష్ వాష్ లిక్విడ్ కలపాలి. అందులో బర్నర్ లను వేసి 15 నుంచి 20 నిమిషాల పాటు నానబెట్టాలి. తర్వాత స్పాంజ్‌తో మురికిని రుద్ది, శుభ్రమైన నీటితో కడిగేయాలి. ఆ తర్వాత తడి లేకుండా పూర్తిగా ఆరిన తర్వాతే వాటిని మళ్లీ స్టవ్‌కు బిగించాలి.

45
రోజూ వంట చేశాక ఇలా చేస్తే?
Image Credit : Chat GPT

రోజూ వంట చేశాక ఇలా చేస్తే?

వంట పూర్తయ్యాక స్టవ్ చల్లారాక తడి గుడ్డతో నూనె, ఆహారపు మరకలను తుడిచేయడం మంచి అలవాటు. పాలు, పప్పు లాంటివి పొంగి బర్నర్‌లోకి వెళ్లకుండా చూసుకోవాలి. బర్నర్ రంధ్రాల్లో మురికి పేరుకుపోతే సూది లేదా సన్నటి కడ్డీతో గట్టిగా పొడిచి క్లీన్ చేయడానికి ట్రై చేయకూడదు. దీనివల్ల రంధ్రాల సైజు మారిపోయి బర్నర్ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే, గ్యాస్ పైపులు లేదా లోపలి భాగాలను విడదీసి శుభ్రం చేయడం ఏమాత్రం సురక్షితం కాదు. స్టవ్ వెలిగించే ముందు బర్నర్ క్యాప్‌లు సరిగ్గా కూర్చున్నాయో లేదో చెక్ చేసుకోవాలి.

55
వీటిని నిర్లక్ష్యం చేయొద్దు
Image Credit : others

వీటిని నిర్లక్ష్యం చేయొద్దు

బర్నర్‌ను క్లీన్ చేసిన తర్వాత కూడా మంట పసుపు లేదా ఆరెంజ్ రంగులో వస్తుంటే, గిన్నెల అడుగున మసి పడుతుంటే లేదా గ్యాస్ మండుతున్నప్పుడు వింత వాసన వస్తుంటే అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు. వెంటనే సంబంధిత నిపుణులను పిలిపించి చెక్ చేయించాలి.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
చిట్కాలు మరియు ఉపాయాలు
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 
5th T20 • NZ vs IND 2026
Result
NZNZ
195/3
INDIND
191/8
NZ beat IND by 7 wickets
Schedule ›
1st ODI • NZ vs IND 2026
NZNZ
Wed, 4 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
4th T20 • NZ vs IND 2026
Result
NZNZ
259/7
INDIND
172/9
NZ beat IND by 87 runs
Schedule ›
3rd TEST • SA vs AUS
Result
SASA
329 & 387
AUSAUS
429 & 111
SA won by 176 runs
Schedule ›
3rd T20 • NZ vs IND 2026
Result
NZNZ
198/3
INDIND
199/4
IND won by 6 wickets
Schedule ›
2nd T20 • NZ vs IND 2026
Result
NZNZ
180/5
INDIND
181/6
IND won by 4 wkts
Schedule ›
2nd ODI • NZ vs IND 2026
NZNZ
Sat, 7 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
3rd ODI • NZ vs IND 2026
NZNZ
Tue, 10 Nov, 2026
INDIND
07:30 am
Match yet to begin.
Schedule ›
Latest Videos
Recommended Stories
Recommended image1
Falgu River: ఎండిపోయిన నది, తవ్వితే మాత్రం.. అమృతం లాంటి నీళ్లు.. సీతమ్మ శాపం పెట్టిన ఈ నది గురించి తెలుసా?
Recommended image2
Fridge Cleaning: ఈ పదార్థంతో తుడిచారంటే పాత ఫ్రిజ్ కూడా కొత్తదానిలా మెరిసిపోతుంది
Recommended image3
Dalda: డాల్డాని దేనితో తయారు చేస్తారు..? నెయ్యికీ, డాల్డాకీ ఉన్న తేడా ఏంటి..?
Related Stories
Recommended image1
Cashew Capital: మన దేశపు జీడిపప్పు రాజధాని ఏదో తెలుసా? ఇక్కడి నుంచే ప్రపంచ దేశాలకు ఎగుమతి!
Recommended image2
Floating Market: మన దేశంలో నీటిపై తేలియాడే మార్కెట్ ఎక్కడుందో తెలుసా? ఇక్కడ పడవల్లోనే వ్యాపారం!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved