MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Summer Travel: వేసవిలో పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్లొద్దు.. ఎండలు తట్టుకోలేరు

Summer Travel: వేసవిలో పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్లొద్దు.. ఎండలు తట్టుకోలేరు

Summer Travel: వేసవి సెలవుల్లో ఎక్కడికైనా టూర్ వెళ్లేందుకు ప్లాన్ చేస్తాయి కొన్ని కుటుంబాలు. కానీ ఇండియాలో కొన్ని ప్రదేశాలకు వేసవిలో వెళ్తే ఆ ట్రిప్ ఆనందానికి బదులు నరకంలా అనిపిస్తుంది. వేసవిలో ఏమాత్రం వెళ్లకూడని  ప్రదేశాలు ఉన్నాయి. అవి ఇవే.

2 Min read
Author : Haritha Chappa
Published : May 12 2026, 08:23 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
 జైసల్మేర్, రాజస్థాన్
Image Credit : Getty

జైసల్మేర్, రాజస్థాన్

రాజస్థాన్‌లోని జైసల్మేర్‌ కోటలతో నిండి ఉంటుంది. చూసేందుకు ఎంతో అందంగా ఉంటుంది. ఏదో పురాతన రాజ్యానికి వెళ్లినట్టు అనిపిస్తుంది. కానీ ఇక్కడ ఇసుక వేసవిలో నిప్పుల కుంపటిలా మారుతుంది. ఇక్కడ ఉష్ణోగ్రతలు 45°C దాటుతాయి. పగటిపూట బయటకు వెళ్లడం చాలా కష్టం. ఒంటె సవారీ, కోటల సందర్శన వంటివి ఎంజాయ్ చేయలేరు. ఈ ఎడారి నగరం అందాలను చూడాలంటే చలికాలమే సరైన సమయం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
జనంతో కిక్కిరిసిన సిమ్లా
Image Credit : Getty

జనంతో కిక్కిరిసిన సిమ్లా

వేసవిలో చల్లగా ఉండే ప్రాంతాలకు వెళ్లాలని ఎంతో మంది అనుకుంటారు. అందులో సిమ్లా మొదటి స్థానంలో నిలుస్తుంది.  కానీ వేసవిలో సిమ్లా వెళ్లితే  మీకు విపరీతంగా జనాలు కనిపిస్తారు. నిత్యం ట్రాఫిక్ జామ్‌లే.  హోటల్ ధరలు వేసవిలో అధికంగా పెంచుతారు.  ప్రశాంతత కోసం వెళ్లిన ఖర్చు విపరీతంగా పెరుగుతుంది. ఆఫ్-సీజన్‌లో వెళ్తేనే సిమ్లాను పూర్తిగా ఆస్వాదించగలరు.

Related Articles

Related image1
AC Water: ఏసీ నీళ్లను పారబోయకుండా.. ఇన్ని రకాలుగా ఉపయోగించుకోండి
Related image2
Rice bag: వంటింట్లోని మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి.. మీ అదృష్టమే మారిపోతుంది
34
కళ్లు చెదిరే ఎండలో ఆగ్రా
Image Credit : Getty

కళ్లు చెదిరే ఎండలో ఆగ్రా

తాజ్‌మహల్ తెల్లని పాలరాతి అందాలు చూడాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది.  వేసవి ఎండలో దాని మెరుపు మరింతగా కనిపిస్తుంది. కానీ అక్కడి ఎండలకు కాసేపు కూడా మీరు తాజ్ మహల్ చూడలేరు. అక్కడ తాజ్ మహల్ చూసేందుకు టిక్కెట్ల కోసం ఎక్కువసేపు క్యూలో నిలబడటం ఆరోగ్యానికి మంచిది కాదు. ఈ ప్రేమ చిహ్నాన్ని చూడటానికి అక్టోబర్ నుంచి మార్చి మధ్య ప్లాన్ చేసుకోండి. 

ఇక ఢిల్లీని కూడా వేసవిలో చూడకూడదు.  అక్కడి వడగాడ్పులు చాలా ప్రమాదకరమైనవి. రోడ్ల మీద నడవడం నిప్పుల మీద నడిచినట్లే ఉంటుంది. వేసవిలో ఢిల్లీ ప్రయాణం అంటే కేవలం షాపింగ్ మాల్స్‌కే పరిమితం కావాలి. చారిత్రక కట్టడాలను సందర్శించడానికి ఇది సరైన సమయం కాదు.

44
పచ్చదనం లేని కేరళ
Image Credit : Getty

పచ్చదనం లేని కేరళ

కేరళ అనగానే పచ్చదనమే గుర్తొస్తుంది. కానీ పాలక్కాడ్ వంటి మైదాన ప్రాంతాల్లో వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ఉంటాయి. చెరువులు, సరస్సులు ఎండిపోతాయి.  కాబట్టి మీరు తీసే ఫోటోలు మీరు ఊహించినంత అందంగా రావు. వర్షాకాలం తర్వాత వెళ్లడమే మంచిది.

అలాగే వేసవిలో ఎలాంటి సఫారీ ప్రాంతాలకు వెళ్లకపోవడమే మంచిది. వన్యప్రాణులను చూడటానికి ఇది మంచి సమయం కాదు. మండుటెండలో ఓపెన్ జీప్‌లో 4 గంటలు ప్రయాణించడం చాలా కష్టం. ఎండకు జంతువులు కూడా దాక్కుంటాయి.  కాబట్టి మీకు కనిపించవు.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ప్రయాణం
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్

Latest Videos
Recommended Stories
Recommended image1
Stone Necklace Designs: ప్లెయిన్ కాదు.. ఇలా స్టోన్ నక్లెస్ ట్రై చేయండి
Recommended image2
Polki Pearl Necklace: చీరల మీదకు ఇలాంటి ముత్యాల నక్లెస్ ఒక్కటి చాలు
Recommended image3
Anxiety: గాభరా, ఆందోళనను తగ్గించే 8 ఆహారాలు ఇవిగో
Related Stories
Recommended image1
AC Water: ఏసీ నీళ్లను పారబోయకుండా.. ఇన్ని రకాలుగా ఉపయోగించుకోండి
Recommended image2
Rice bag: వంటింట్లోని మీ బియ్యం డబ్బాలో ఈ వస్తువును పెట్టండి.. మీ అదృష్టమే మారిపోతుంది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved