MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
IMD Weather Update
Today's Rasi Phalalu
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
Ameer Log Movie Review
WTC Qualification Scenario
Sowcar Janaki
Agnipariksha Season 2
Telangana Air Pollution
Indian Diaspora in USA
Telangana Cinema Ticket Prices
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
  • Home
  • Life
  • Shaving: షేవింగ్ చేస్తే ముఖంపై జుట్టు మరింత ఒత్తుగా, మందంగా పెరుగుతుందా?

Shaving: షేవింగ్ చేస్తే ముఖంపై జుట్టు మరింత ఒత్తుగా, మందంగా పెరుగుతుందా?

Shaving: ముఖంపై వెంట్రుకలు తొలగించడానికి షేవింగ్ చేస్తున్నారా? షేవింగ్ చేస్తే.. జుట్టు ఒత్తుగా పెరిగిపోతుందేమో అని భయపడుతున్నారా? అసలు నిజమేంటి? అసలు షేవింగ్ చేయచ్చా? చేయకూడదా?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 22 2026, 04:09 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ముఖంపై వెంట్రుకలు ఎలా తొలగించాలి?
Image Credit : Freepik

ముఖంపై వెంట్రుకలు ఎలా తొలగించాలి?

ఈ రోజుల్లో చాలా మంది అమ్మాయిలు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఫేషియల్ హెయిర్ ఒకటి. ఆ హెయిర్ ని తొలగించడానికి చాలా మంది చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ముఖంపై ఉన్న అవాంఛిత రోమాలను తొలగించుకోవడానికి షేవింగ్ (Facial Shaving) చేసుకుంటే జుట్టు మునుపటి కంటే చాలా మందంగా, నల్లగా , ఒత్తుగా పెరుగుతుందని చాలామంది నమ్ముతారు. అయితే, ఇందులో నిజమెంత? సైన్స్ దీని గురించి ఏం చెబుతోంది? వివరంగా తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
అసలు నిజం ఏమిటి?
Image Credit : Getty

అసలు నిజం ఏమిటి?

సాధారణంగా షేవింగ్ చేయడం వల్ల జుట్టు వేగంగా పెరగదు, అలాగని మందంగా లేదా ఒత్తుగా కూడా మారదు. ఇది కేవలం ఒక భ్రమ మాత్రమే.

రేజర్ ఉపయోగించి షేవ్ చేసినప్పుడు, అది చర్మం ఉపరితలం పైన ఉన్న జుట్టును మాత్రమే కట్ చేస్తుంది. వెంట్రుక చివర భాగం సహజంగా సన్నగా, కోలగా ఉంటుంది. కానీ రేజర్ కట్ చేసినప్పుడు ఆ చివర భాగం చతురస్రాకారంలో మొండిగా మారుతుంది.

ఆ తర్వాత జుట్టు తిరిగి పెరుగుతున్నప్పుడు, ఆ మొండి చివరల వల్ల చూడటానికి , తాకడానికి జుట్టు కాస్త మందంగా, గరుకుగా ఉన్నట్లు అనిపిస్తుంది. అంతేకానీ, షేవింగ్ వల్ల జుట్టు వేగంగా పెరగదు.

జుట్టు మందంగా ఎప్పుడు పెరుగుతుంది?

జీన్స్ (Genetics): మీ వంశపారంపర్యంగా వచ్చే జన్యువులు.

హార్మోన్లు (Hormones): శరీరంలో ఉండే హార్మోన్ల హెచ్చుతగ్గులు.

ఈ రెండింటిని షేవింగ్ ఏమాత్రం మార్చలేదు. చర్మం లోపల ఉన్న హెయిర్ ఫోలికల్స్‌ను రేజర్ తాకదు కాబట్టి, జుట్టు అసలు స్వభావం ఎప్పటికీ మారదు.

Related Articles

Related image1
Kitchen Hacks: కూరలో ఉప్పు ఎక్కువైందా? నిమిషాల్లో కూరను రుచిగా మార్చేయండి..!
Related image2
Kids Smart Watch: ఈ ఒక్క వాచ్ చేతికి ఉంటే చాలు, మీ పిల్లలు ఎక్కడున్నా సేఫ్..!
33
ఫేషియల్ షేవింగ్ చేసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:
Image Credit : Getty

ఫేషియల్ షేవింగ్ చేసుకునేటప్పుడు పాటించాల్సిన జాగ్రత్తలు:

షేవింగ్ వల్ల జుట్టు ఒత్తుగా పెరగకపోయినా, చర్మం పాడవకుండా ఉండటానికి ఈ క్రింది జాగ్రత్తలు తీసుకోవడం అవసరం:

క్లీన్ రేజర్ వాడటం: ముఖం కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఫేషియల్ రేజర్‌లను మాత్రమే వాడాలి. అది పరిశుభ్రంగా ఉందో లేదో చూసుకోవాలి.

షావింగ్ జెల్ లేదా అలోవెరా: డ్రై షేవింగ్ (పొడి చర్మంపై షేవ్ చేయడం) వల్ల కట్స్ పడే ప్రమాదం ఉంది. కాబట్టి కలబంద జెల్ లేదా మాయిశ్చరైజర్ రాసి షేవ్ చేయాలి.

సరైన దిశ: జుట్టు పెరుగుతున్న దిశలోనే సున్నితంగా షేవ్ చేయాలి.

ఆఫ్టర్ షేర్ కేర్: షేవింగ్ పూర్తయిన తర్వాత చర్మానికి మంచి మాయిశ్చరైజర్ రాసి హైడ్రేట్ చేయాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Mineral Water: రోజూ మినరల్ వాటర్ తాగితే శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా..?
Recommended image2
Earrings: 1 గ్రాము బరువులో అదిరిపోయే ఇయర్ రింగ్స్, డైలీవేర్ కి బెస్ట్
Recommended image3
Golden Bangles: పండగల వేళ.. మీ చేతుల అందాన్ని పెంచే గాజుల డిజైన్లు
Related Stories
Recommended image1
Kitchen Hacks: కూరలో ఉప్పు ఎక్కువైందా? నిమిషాల్లో కూరను రుచిగా మార్చేయండి..!
Recommended image2
Kids Smart Watch: ఈ ఒక్క వాచ్ చేతికి ఉంటే చాలు, మీ పిల్లలు ఎక్కడున్నా సేఫ్..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved