MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Guava Seeds: జామకాయ గింజలను తింటే నిజంగానే కడుపునొప్పి వస్తుందా? ఎవరు తినకూడదు?

Guava Seeds: జామకాయ గింజలను తింటే నిజంగానే కడుపునొప్పి వస్తుందా? ఎవరు తినకూడదు?

Guava Seeds: జామకాయ పేదవాడి పండు. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కానీ జామకాయలోని గింజలను తింటే కడుపునొప్పి వస్తుందని చెబుతారు. ఇది ఎంతవరకు నిజమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు. 

2 Min read
Author : Haritha Chappa
Published : Feb 08 2026, 10:21 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
జామ ఎందుకు తినాలి?
Image Credit : Getty

జామ ఎందుకు తినాలి?

జామకాయ ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు, ఫైబర్ అధికంగా ఉంటాయి. అందుకే జామకాయను తొక్కతో పాటు తినాలని చెబుతారు. అలాగే గింజలను కూడా తినాలని చెబుతారు వైద్య నిపుణులు. అయితే జామకాయ గింజలు తింటే కడుపునొప్పి వస్తుంది అనే మాట ప్రజల్లో బాగా నాటుకుపోయింది. ముఖ్యంగా పిల్లలు, వృద్దులు గింజలు మింగితే జీర్ణం కావని పొట్టనొప్పి వచ్చేస్తుందని అంటారు. ఇది ఎంతవరకు నిజమో వైద్య నిపుణులు వివరిస్తున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
గింజలతో నష్టమేమీ లేదు
Image Credit : Getty

గింజలతో నష్టమేమీ లేదు

జామకాయ గింజలు గట్టిగానే ఉంటాయి. అవి జీర్ణం కావడానికి కొంత సమయం పడుతుంది అనేది నిజమే. అయితే జామకాయలు తినడం వల్లే కడుపునొప్పి వస్తుంది అనేది పూర్తిగా అపోహ. జామకాయ గింజలను మరీ అతిగా తింటే జీర్ణ క్రియపై కాస్త ఒత్తిడి పడుతుంది. వాటిని వీలైనంతవరకూ నమిలి మింగితే ఎలాంటి సమస్య ఉండదు. కొందరికి విపరీతమైన అజీర్ణం సమస్యలు, కడుపుబ్బరం సమస్యలు ఉంటాయి. అలాంటివారు ఈ జామకాయ గింజలను తినడం వల్ల కాస్త ఇబ్బంది పడతారు. అంతే తప్ప జామకాయ గింజలను తినడం వల్ల అజీర్ణ సమస్యలు, కడుపునొప్పి, కడుపు ఉబ్బరం వంటివి రావు. జామకాయ తినేటప్పుడు గింజలను కూడా బాగా నమిలి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుందని వైద్యులు వివరిస్తున్నారు.

Related Articles

Related image1
Birth date: ఈ తేదీలలో పుట్టిన జీవిత భాగస్వామితో బతకడం నరకంతో సమానం
Related image2
Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
34
వీరు తినకూడదు
Image Credit : Getty

వీరు తినకూడదు

జామకాయ గింజలు చాలా తక్కువ మందిలో మాత్రమే సమస్యలకు కారణం అవుతాయి. అలాంటివారికి మలబద్ధకం లేదా పేగుల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది. చిన్నపిల్లలకు జామకాయ ఇచ్చేటప్పుడు కోసి గింజలు తక్కువగా ఉండేలా చూసి ఇస్తే ఎలాంటి సమస్య ఉండదు. ఇప్పటికే పేగు సంబంధిత సమస్యలతో బాధపడుతున్న వారు, ఆపరేషన్ చేయించుకున్న వారు మాత్రం గింజలు లేకుండా జామకాయను తింటే త్వరగా జీర్ణం అవుతుంది.

44
రెండు కన్నా వద్దు
Image Credit : Getty

రెండు కన్నా వద్దు

ఇక మొత్తంగా చెప్పాలంటే జామకాయ గింజలు కడుపునొప్పికి పూర్తిగా కారణం కాదు. బాగా నమిలి తింటే ఎలాంటి సమస్యలు రావు. పైగా జామకాయ గింజల్లో కూడా మన శరీరానికి అవసరమైన పోషకాలు ఉంటాయి. జామకాయలో ఉండే ఫైబర్ జీర్ణక్రియకు సహాయపడుతుంది. ఏ ఆహారాన్నయినా మితిమీరి తింటే ఇబ్బందులు వస్తాయి. కాబట్టి రోజుకు రెండు జామకాయలకు మించి తినకపోవడమే మంచిది. తగినంత నీరు తాగడం, వ్యాయామం చేయడం వంటివి జీర్ణక్రియ సవ్యంగా జరిగేలా చేస్తాయి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Birth date: ఈ తేదీలలో పుట్టిన జీవిత భాగస్వామితో బతకడం నరకంతో సమానం
Recommended image2
Name Astrology: A అక్షరంతో మొదలయ్యే పేరు గల వ్యక్తుల బలాలు, బలహీనతలు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved