జీడిపప్పు తింటే ఒంట్లో కొలెస్ట్రాల్ పెరుగుతుందా?
జీడిపప్పులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల కడుపు ఎక్కువ సేపు నిండుగా ఉంటుంది. అందుకే బరువు తగ్గాలనుకునే వాళ్లు జీడిపప్పులను తప్పకుండా తినాలని చెప్తుంటారు.
cashew
గింజలు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలు మేలు చేస్తాయి. అందుకే వీటిని సూపర్ ఫుడ్ అంటారు. వాల్ నట్స్, పిస్తా వంటి గింజలు బరువు తగ్గడానికి సహాయపడే ఆహారాలుగా పరిగణించబడుతున్నప్పటికీ.. చాలా మంది జీడిపప్పు బరువు తగ్గడానికి అంత మంచిది కాదని అనుకుంటుంటారు. అది నిజమా?కాదా? జీడిపప్పు బరువు పెరగడానికి దారితీస్తుందా? వంటి విషయాలపై నిపుణులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం..
cashew
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. జీడిపప్పులో ఉప్పును వేయకుండా, వేయించిన లేదా సాదా జీడిపప్పును తినేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. అయితే జీడిపప్పును మోతాదులో తింటే బరువు పెరిగే ఛాన్స్ అసలే ఉండదు. అయితే కొవ్వు కంటెంట్ ఎక్కువగా ఉండే గింజలు శరీరంలో కొవ్వును పెంచుతాయని చాలా మంది అనుకుంటుంటారు. అయితే జీడిపప్పులో కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడే ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన అధ్యయనం ప్రకారం.. జీడిపప్పును రోజంతా మోతాదుకు మించి తినడం మంచిది కాదు.
cashew
జీడిపప్పులో ప్రోటీన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మీ కడుపును ఎక్కువ సేపు నిండుగా ఉంచడానికి సహాయపడుతుంది. జీడిపప్పులో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుుది. ఇది తిన్న ఆహారం సులభంగా జీర్ణం కావడానికి సహాయపడుతుంది. అందుకే వీటిని కూరల్లో వివిధ వంటల్లో చేర్చడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
జీడిపప్పులో ఒమేగా -3 ఆల్ఫా-లినోలెనిక్ ఆమ్లం (ఎఎల్ఎ) వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. అంతేకాదు ఈ గింజల్లో ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు కూడా ఉంటాయి. ఇవి శరీర జీవక్రియను పెంచడానికి సహాయపడతాయి.
జీడిపప్పు, ఇతర గింజల్లో ఒమేగా -3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీవక్రియను వేగవంతం చేయడమే కాదు బెల్లీ ఫ్యాట్ ను కరిగించడానికి కూడా సహాయపడతాయి. గింజలు ఆరోగ్యంగా బరువు తగ్గడానికి ప్రయత్నిస్తున్నవారికి, ఎక్కువసేపు కడుపును నిండుగా ఉంచడానికి ప్రయత్నిస్తున్న వారికి ఒక సూపర్ ఫుడ్.
జీడిపప్పులో ఉండే అధిక సాంద్రత కలిగిన లుటిన్, ఇతర ముఖ్యమైన యాంటీఆక్సిడెంట్లు కళ్ళను రక్షిస్తాయి. ఇవి కంటిచూపును మెరుగుపరుస్తాయి. జీడిపప్పులో ఉండే జియాక్సంతిన్ అనే యాంటీఆక్సిడెంట్ కళ్ళకు కావాల్సిన ఒక ముఖ్యమైన పోషకం. ఈ యాంటీ ఆక్సిడెంట్ అతినీలలోహిత కిరణాల ఫిల్టర్ గా పని చేస్తుంది. ఇది సూర్య కిరణాల ప్రభావం నుంచి కళ్ళను కాపాడుతుంది.
Cashew Nut
జీడిపప్పులను తింటే శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయనేది మన భ్రమ. ఎందుకంటే దీనిలో స్టెరిక్ ఆమ్లం పుష్కలంగా ఉంటుంది. ఇది మన రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది. శరీరంలో కొలెస్ట్రాల్ పేరుకుపోతే గుండె జబ్బులు వస్తాయి. అందుకే జీడిపప్పులను మోతాదులో రోజూ కొన్ని తినండి.
జీడిపప్పు గుండె జబ్బుల ప్రమాదాన్ని కూడా తగ్గించడానికి సహాయపడుతుంది. జీడిపప్పుల్లో ఉండే మెగ్నీషియం గుండెకు సంబంధించిన రోగాలు రాకుండా కాపాడుతుంది. ఈ పప్పుల్లో ఉండే ఖనిజాలు, ఫైబర్ విటమిన్లు గుండెను కాపాడుతాయి.
జీడిపప్పులు షుగర్ పేషెంట్లకు ఎంతో మంచివి. దీనిలో కార్భోహైడ్రేట్లు చాలా తక్కువగా ఉంటాయి. జీడిపప్పులను మోతాదులో తినడం వల్ల డయాబెటీస్ లక్షణాలు తగ్గుతాయి. దీనిలో ఉండే ఫైబర్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రించుతుంది.