MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Walking: వాకింగ్ ఎలా చేయాలి..? ఉదయం పూట గంట చేస్తే సరిపోదా..? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..

Walking: వాకింగ్ ఎలా చేయాలి..? ఉదయం పూట గంట చేస్తే సరిపోదా..? డాక్టర్స్ ఏం చెబుతున్నారంటే..

Walking:   వాకింగ్ ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఆ వాకింగ్ ఎప్పుడు చేస్తున్నాం..? ఎలా చేస్తున్నాం..? ఎంత సేపు చేస్తున్నాం అనే విషయాలపై మన ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. 

2 Min read
Author : ramya Sridhar
Published : Nov 14 2025, 10:35 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Walking
Image Credit : istockphoto

Walking

మనం ఎంత ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా... శరీరానికి ఎంతో కొంత వ్యాయామం చాలా అవసరం. చాలా మంది వాకింగ్ ని వ్యాయామంగా ఎంచుకుంటారు. నిజంగానే రెగ్యులర్ గా వాకింగ్ చేయడం ఆరోగ్యానికి చాలా మంచిది. అందులోనూ.. ఎక్కువ మంది ఉదయాన్నే వాకింగ్ చేయడానికి ఇష్టపడతారు. కనీసం గంట పాటు నడుస్తూ ఉంటారు. ఇది చాలా మంచి విషయమే. కానీ.... రోజూ ఉదయాన్నే నడిచి.. తర్వాత రోజంతా కూర్చొని ఉండటం వల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండవని వైద్యులు చెబుతున్నారు.

హైదరాబాద్ అపోలో న్యూరాలజిస్ట్ డాక్టర్ సుధీర్ కుమార్ ఈ వాకింగ్ విషయంలో తన అభిప్రాయాన్ని ట్విట్టర్ లో షేర్ చేశారు. వ్యాయామం అంటే రోజులో ఒక గంటకు పరిమితం అయ్యేది కాదని, రోజంతా చురుకుగా కదులుతూ ఉండాలని డాక్టర్ చెప్పారు.

Which Walk is Healthier?

1. Many people walk for 60 minutes in the morning; then sit all day.
2. Others take short walks several times through the day.
▶️Both total 60 minutes… but the health impact is very different. 

✅Science says:
Breaking up sitting time, even with short… pic.twitter.com/FtzOZMNm3B

— Dr Sudhir Kumar MD DM (@hyderabaddoctor) November 11, 2025

24
వైద్యులు ఏమన్నారంటే...
Image Credit : istockphoto

వైద్యులు ఏమన్నారంటే...

ఆయన ప్రకారం... రోజులో ఒక గంట నడిచి.. మిగిలిన సమయం మొత్తం కదలకుండా కూర్చోవడం కంటే... ప్రతి గంటకీ మూడు నిమిషాల పాటు నడవడం మంచిది. నడిచే సమయం తక్కువగా ఉన్నా.. అది మొత్తం ఆరోగ్యంపై చాలా ఎక్కువ ప్రభావం చూపుతుందని వైద్యులు చెబుతున్నారు. ఇలా ప్రతి గంట కీ మూడు నిమిషాలు నడవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి. కొలెస్ట్రాల్ కూడడా తగ్గుతుంది. మెటబాలిజం చురుకుగా పని చేస్తుంది. అదేవిధంగా గుండె పోటు, స్ట్రోక్ వంటి సమస్యల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

భోజనం చేసిన వెంటనే కూర్చోకుండా కనీసం 5 నుంచి 10 నిమిషాల పాటు నడవాలి. ఇలా చేయడం వల్ల శరీరం ఆహారాన్ని మెరుగ్గా జీర్ణం చేసుకునే శక్తిని స్థిరంగా ఉంచుతుంది. రోజంతా కొద్ది కొద్ది సమయం నడవడం వల్ల రోజంతా ఎనర్జిటిక్ గా ఉంటారు. ఇలా నడవడం వల్ల బ్లోటింగ్ తగ్గడమే కాకుండా.. మొత్తం జీర్ణక్రియను గణనీయంగా మెరుగుపరుస్తుంది. తీసుకున్న ఆహారం కూడా సులభంగా జీర్ణమౌతుంది. వారానికి కనీసం 10 గంటలు నడవడం వల్ల జీర్ణవ్యవస్థకు సంబంధించి కొన్ని రకాల క్యాన్సర్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుందని వైద్యులు చెబుతున్నారు.

Related Articles

Related image1
Egg Recipes: నోరు చప్పగా అనిపించినప్పుడు ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు చేసి చూడండి, అదిరిపోతుంది
Related image2
Health: మ‌నిషికి రోజుకు ఎంత ప్రోటీన్ కావాలో తెలుసా.? ఎక్కువైనా క‌ష్ట‌మే..
34
ఆరోగ్య ప్రయోజనాలు..
Image Credit : istockphoto

ఆరోగ్య ప్రయోజనాలు..

డయాబెటిస్ ఉన్న వారికి భోజనం తర్వాత నడక మరింత ముఖ్యమైనది. పరిశోధనలు సూచించినట్లుగా, ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం రోజు తర్వాత 30 నిమిషాల నడక కంటే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను నియంత్రించడంలో ఎక్కువ ప్రభావవంతంగా ఉంటుంది. ఇది రక్తంలో చెక్కర అకస్మాత్తుగా పెరగకుండా నిరోధిస్తుంది. ఇది టైప్ 1, టైప్ 2 డయాబెటిస్ ఉన్న వారికి ఎంతో ఉపయోగకరమైన అలవాటు.

క్రమం తప్పకుండా నడవడం గుండె ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇది చెడు కొలెస్ట్రాల్ తగ్గించడంలో, రక్తపోటును నియంత్రించడంలో, గుండెపోటు, స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. భోజనం చేసిన తర్వాత నడవడం వల్ల అదనపు కేలరీలు బర్న్ కావడం ద్వారా బరువు కంట్రోల్ లో ఉంటుంది. ఎక్కవ సేపు కూర్చొని పని చేసేవారు ఇలా తిన్న తర్వాత వాకింగ్ చేయడం వల్ల సిస్టోలిక్ రక్తపోటు తగ్గిస్తుందని పరిశోధనలు చెబుతున్నాయి.

44
భోజనం తర్వాత వాకింగ్...
Image Credit : Getty

భోజనం తర్వాత వాకింగ్...

మొత్తానికి, డాక్టర్ సుధీర్ కుమార్ చెప్పినట్లుగా, ఒక పెద్ద వ్యాయామం కన్నా రోజంతా చురుకుగా కదలడం ఆరోగ్యానికి ఎంతగానో మేలు చేస్తుంది. ప్రతి గంట నిలబడి కొద్దిసేపు నడవడం, ప్రతి భోజనం తర్వాత 10 నిమిషాలు నడవడం, ఎక్కువసేపు కూర్చోవడాన్ని తగ్గించడం లాంటి చిన్నచిన్న మార్పులు చేసుకోవడం వల్ల ఆరోగ్యం మెరుగుపడుతుంది.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
ఆహారం
ఆరోగ్యం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్

Latest Videos
Recommended Stories
Recommended image1
Baby Anklets: 15 గ్రాముల్లో చిన్నారుల కోసం వెండి పట్టీలు
Recommended image2
Oats: ఓట్స్ ఇలా రోజూ తిన్నారంటే త్వరగా బరువు తగ్గే ఛాన్స్
Recommended image3
Jasmine: ఈ నీళ్లు పోస్తే.. సంవత్సరమంతా మల్లెపూలు పూస్తాయి..!
Related Stories
Recommended image1
Egg Recipes: నోరు చప్పగా అనిపించినప్పుడు ఉల్లి కారం కోడిగుడ్డు వేపుడు చేసి చూడండి, అదిరిపోతుంది
Recommended image2
Health: మ‌నిషికి రోజుకు ఎంత ప్రోటీన్ కావాలో తెలుసా.? ఎక్కువైనా క‌ష్ట‌మే..
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved