MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Oats: ఓట్స్ ఇలా రోజూ తిన్నారంటే త్వరగా బరువు తగ్గే ఛాన్స్

Oats: ఓట్స్ ఇలా రోజూ తిన్నారంటే త్వరగా బరువు తగ్గే ఛాన్స్

Oats:  బరువు తగ్గాలనుకునేవారికి ఓట్స్ ఉత్తమ ఫుడ్. ఓట్స్ లో ఫైబర్ అధికంగా ఉంటుంది. ఇక కేలరీలు తక్కువగా ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను కూడా కంట్రోల్‌లో ఉంచుతాయి. ఓట్స్ ప్రతిరోజూ తింటే బరువు తగ్గడం సులువవుతుంది.

2 Min read
Author : Haritha Chappa
Published : Mar 10 2026, 05:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఓట్స్ తో బరువు తగ్గొచ్చు
Image Credit : Getty

ఓట్స్ తో బరువు తగ్గొచ్చు

అధిక బరువు సమస్యతో ఎంతో మ్ంది బాధపడుతున్నారు. అధిక బరువు వల్ల ఎన్నో ప్రాణాంతక సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి బరువు పెరగకుండా జాగ్రత్తపడాల్సిన అవసరం ఉంది.  బరువు తగ్గడానికి ఓట్స్ ఉత్తమ ఆహారంగా వైద్యులు చెబుతారు. ఇందులో ఫైబర్ ఎక్కువ, కేలరీలు తక్కువ ఉంటాయి. ఇవి రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడంలో కూడా ఎంతో సహాయపడతాయి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
ఎలా తినాలి?
Image Credit : Getty

ఎలా తినాలి?

ఓట్స్ తినేందుకు చాలా చప్పగా అనిపిస్తాయి. ఎలాంటి రుచి ఉండవు కాబట్టి వాటిని ప్రత్యేకంగా వండుకోవాలి.  కొవ్వు తక్కువగా ఉండే పాలతో ఓట్స్ ఉడికించుకుని తినాలి.  రుచి కోసం అందులో బెర్రీలు, నట్స్,  చియా గింజలు వంటివి వేసుకుంటే మంచిది. 

ఓట్స్‌తో పాటు ఉడికించిన కూరగాయలు కలిపి తింటే ఆరోగ్యానికి ఇంకా మంచిది. వీరు బరువు చాలా సులభంగా తగ్గుతారు.  కూరగాయల్లో ఫైబర్ అధికంగా ఉంటుంది.  వాటిని ఉడికించి, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి చల్లి ఓట్స్‌లో కలుపుకుని తినొచ్చు. ఇది చాలా రుచిగా ఉంటుంది. బ్రేక్ ఫాస్ట్ సమయంలో దీన్ని తింటే ఎంతో రుచిగా ఉంటుంది.

34
రాత్రి పూట తినవచ్చా?
Image Credit : Getty

రాత్రి పూట తినవచ్చా?

ఓట్స్ మితంగా తింటే ఎంతో ఆరోగ్యంం. ముఖ్యంగా డయాబెటిస్ ఉన్న వారికి ఓట్స్ ఎంతో ఉపయోగపడతాయి. రాత్రిపూట భోజనంలో ఓట్స్ స్మూతీగా చేసుకుని తింటే త్వరగా బరువు తగ్గే అవకాశం ఉంది. ఓట్స్ చాలా తేలికగా జీర్ణం అవుతాయి. ఇవి జీర్ణ సమస్యలు రాకుండా అడ్డుకుంటుంది. 

ఓట్స్‌ను నీళ్లు లేదా బాదం పాలు వంటి తక్కువ కేలరీలున్న పాలతో ఉడికించాలి. తీపి కోసం బెర్రీలు లేదా అరటిపండు వంటి పండ్లను కొద్దిగా కలుపుకోవచ్చు. ఇలా తినడం వల్ల శరీరానికి శక్తి కూడా అందుతుంది. 

44
ఓట్స్ ఉప్మా
Image Credit : Getty

ఓట్స్ ఉప్మా

ఓట్స్ తో ఉప్మా కూడా వండుకోవచ్చు. దీని రెసిపీ కూడా చాలా సులువు. ఈ  ఓట్స్ ఉప్మా బరువు తగ్గడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో రకరకాల కూరగాయలు వేసి వండుకోవచ్చు. ఒక టీస్పూన్ చియా లేదా అవిసె గింజలు ఇందులో కలిపి వండితే రెట్టింపు లాభాలు కలుగుతాయి. ఎలాగైనా ఓట్స్ ను ఆహారంలో భాగం చేసుకోవాల్సిన అవసరం ఉంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
ఆహారం
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Milk Spoilage: వేసవిలో పాలు విరిగిపోకుండా ఈ చిన్న చిట్కాలు ఉపయోగపడతాయి
Recommended image2
Soap Hacks: మిగిలిపోయిన సబ్బు ముక్కలు పడేస్తున్నారా? వాటిని ఎన్ని రకాలుగా వాడుకోవచ్చో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved