Health Tips: చేతులను సరిగ్గా కడుగుతున్నారా? లేదా? ఆ రోగాలొస్తయ్.. జాగ్రత్త..
Health Tips: చేతులను ఎంత శుభ్రంగా ఉంచుకుంటే మనం అంత హెల్తీగా ఉంటామన్న సంగతి మనం ఎప్పటికీ మర్చిపోవద్దు. సర్వరోగాలు మనల్ని చుట్టుముట్టడానికి మురికిగా ఉండే మన చేతులే చాలు. చేతులను నీట్ గా ఉంచుకోకపోతే ఏయే రోగాలొస్తయో తెలుసా..

Health Tips: చేతులే సర్వరోగాలకు వాహకాలు. ఇది మీకు సిల్లీగా అనిపించినా ఇదే వాస్తవం. చేతులను సరిగ్గా కడుకోకపోతే ఎన్నో రోగాలు సోకే ప్రమాదముంది. అందుకే చేతులను ఎప్పటికప్పుడు కడుగుతూ ఉండాలి. మరి చేతులను సరిగ్గా శుభ్రం చేసుకోకపోతే ఎటువంటి రోగాలొస్తయో ఇప్పుడు తెలుసుకుందాం..
మెరుగైన జీవితం మన చేతుల్లోనే ఉంటుందని పెద్దలు చెబుతూ ఉంటారు. ఎందుకో తెలుసా.. చేతులు శుభ్రంగా ఉన్నప్పుడే మనం ఆరోగ్యంగా ఉంటాం కాబట్టి. అదే చేతులు శుభ్రంగా ఉంచుకోకపోతే జ్వరం, జలుబు, శ్వాసకోశ సమస్యలు, న్యుమోనియా వంటి అనేక రోగాలు సోకే ప్రమాదముంది. ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల 21 శాతం ఫ్లూ, జలుబు సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
ఎవరైతే చేతులను సరిగ్గా కడుక్కోరో వారికే కడుపు సంబంధిత సమస్యలు ఎక్కువగా వస్తాయని అధ్యయనాలు తేల్చి చెబుతున్నాయి. ముఖ్యంగా బాత్రూం కి వెళ్లినప్పుడు చేతులను క్లీన్ చేసుకోకపోతే ఎంతో ప్రమాదం. ఎందుకంటే మలం విసర్జించినప్పుడు చేతులను సబ్బుతో కడగపోతే చేతులకు వైరస్ లు, బ్యాక్టీరియా అలాగే పట్టుకుని ఉంటుంది. అవి స్టమక్ కు సంబంధించిన ఎన్నో సమస్యలను కలిగిస్తాయి.
హ్యాండ్ వాష్ చేసుకోకుండా ఆహారాన్ని తిన్నా, ఆ చేతులతో వేరే వాళ్లకు ఇచ్చినా అది విషంగా మారుతుంది. అందుకే మీరు వంట చేసే ముందే లేదా కూరగాయలను లేదా మాంసాన్ని కడిగేముందు మీ చేతులను శుభ్రంగా కడగడం ఎంతో అవసరం. ఇది మీ చేతులపై బ్యాక్టీరియా లేకుండా చేస్తుంది. మాంసాన్ని కడిగాక కూడా మీ చేతులను శుభ్రం చేసుకోవడం మర్చిపోవద్దు.
రోజుకు మీరు ఎన్నో వస్తువులను ముట్టుకుంటారు. దాంతో మీ చేతులకు ఎన్నో రకాల క్రిమికీటకాలు, బ్యాక్టీరియా అంటుకుంటుంది. అయినా మీరు చేతులను శుభ్రం చేసుకోకుండా అలాగే మీ నోటిని, చెవులను, కళ్లను, ముక్కును అలాగే మట్టుకోవడం, తాకడం అస్సలు మంచి పద్దతి కాదు. హ్యాండ్ వాష్ చేసుకోకుండా వాటిని తాకితే ఆ ప్లేస్ లో వైరస్ వ్యాపిస్తుంది.
హ్యాండ్ వాష్ సరిగ్గా చేసుకోకపోవడం వల్ల పిల్లలు, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉండే వారు ఎన్నో రోగాల బారిన పడే ప్రమాదముంది. అందుకే వీరు ఎప్పుడూ చేతులను నీట్ గా ఉంచుకోవాలి.
చేతులను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోవడం వల్ల ఎన్నో రోగాల నుంచి తప్పించుకోవచ్చు. బ్యాక్టీరియా వ్యాపించకుండా చేయవచ్చు. అందుకే రోజుకు ఖచ్చితంగా 5 నుంచి 6 సార్లు చేతులను కడగాలని నిపుణులు సూచిస్తున్నారు. రోజులో ఎక్కువ సార్లు చేతులను కడగటం వల్ల విరేచనాలు, కడుపు సమస్యల నుంచి 60 శాతం తప్పించుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.