MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathimynation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • రోజూ రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారా? అయితే మీకు ఏం జరుగుతుందో తెలుసా

రోజూ రాత్రి ఆలస్యంగా నిద్రపోతున్నారా? అయితే మీకు ఏం జరుగుతుందో తెలుసా

Sleeping late at night effects: మ‌నిషి ఆరోగ్యంగా ఉంచే విష‌యంలో నిద్ర కూడా కీల‌కంగా ఉంటుంది. వైద్య నిపుణుల ప్ర‌కారం ప్ర‌తిరోజులో 7-8 గంట‌లు నిద్ర పోవాలి. అయితే, ఆల‌స్యంగా రాత్రి నిద్ర‌పై వైద్య నిపుణులు హెచ్చ‌రిస్తున్నారు. 

2 Min read
Mahesh Rajamoni
Published : Dec 23 2024, 08:44 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Side effects of sleeping late night

Side effects of sleeping late night

Sleeping late at night effects: కాలంతో వ‌చ్చిన మార్పులు, టెక్నాల‌జీ కార‌ణంగా మ‌నిషి జీవితం గ‌తంలో పోలిస్తే ఇప్పుడు పూర్తిగా మారిపోయింద‌ని చెప్పాలి. బిజీ బిజీ  లైఫ్ షెడ్యూల్ కారణంగా జీవ‌న శైలీలో అనేక మార్పులు వ‌చ్చాయి. చాలా మంది ప్రజలు అర్థరాత్రి వరకు మేల్కొని ఉంటున్నారు. రాత్రి 1 లేదా 2 గంటల తర్వాత నిద్రపోయే వారు చాలా మంది ఉన్నారు.

ఉదయం లేచిన‌ప్ప‌టి నుంచి ఆఫీసు పనులు, లేదా ఇతర ముగించుకుని బెడ్ పై ఫోన్‌లు లేదా ట్యాబ్, ల్యాప్ టాప్, టీవీల‌తో బిజీ కావ‌డం లేట్ నైట్ నిద్ర‌కు కార‌ణం కావ‌చ్చు. ఈ మొత్తం పరిస్థితిని రివెంజ్ బెడ్‌టైమ్ ప్రోక్రాస్టినేషన్ అంటార‌నీ, ఈ అలవాటు మన ఆరోగ్యానికి చాలా హానికరమ‌ని వైద్యులు చెబుతున్నారు.

25
sleep

sleep

ఆల‌స్యంగా రాత్రిళ్లు నిద్ర‌పోవ‌డం అస్స‌లు మంచిది కాదు

వైద్యులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం.. ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం ఆరోగ్యానికి అస్స‌లు మంచిది కాదు. మన శరీరంపై ప్రమాదకరమైన ప్రభావాలను చూపుతుంది. మనకు సరైన నిద్ర రాకపోతే శరీరంలో సహజమైన జీవ‌క్రియ చ‌క్రం దెబ్బ‌తింటుంది. ఇది మన శరీరంపై అనేక రకాల దుష్ప్ర‌భావాలను కలిగిస్తుంది. జీర్ణక్రియ ఇబ్బందులు, టెన్షన్, డిప్రెషన్, ఒత్తిడి, మానసిక ఆరోగ్య రుగ్మతలు వ‌స్తాయి. 

35
Sleeping late at night effects

Sleeping late at night effects

ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల కలిగే నష్టాలు 

ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల శరీర స‌హ‌జ ప్ర‌క్రియ‌ల చ‌క్రం (సిర్కాడియన్ రిథమ్) పూర్తిగా పాడవుతుంది. దీని కారణంగా శరీరం అనేక ఇబ్బందుల‌కు గురి అవుతుంది. నెమ్మ‌దిగా శ‌రీరం దెబ్బతినడం ప్రారంభమవుతుంది. దీంతో శరీరంలోని మొత్తం హార్మోన్ల వ్యవస్థ చెదిరిపోతుంది. అంతే కాకుండా జీర్ణవ్యవస్థ కూడా క్షీణిస్తుంది. 

45
Sleeping late at night effects

Sleeping late at night effects

ఏకాగ్రత తగ్గుతుంది.. జ్ఞాపకశక్తి పోతుంది 

ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది. జ్ఞాపకశక్తి, మానసిక చురుకుదనం కూడా క్షీణిస్తుంది. మాన‌సిక రుగ్మ‌త‌లు కూడా వ‌చ్చే ఛాన్స్ ఉంది. ప్రతిరోజూ ఆలస్యంగా నిద్రపోవడం వల్ల జీవక్రియ తగ్గుతుంది, దీని కారణంగా శరీరం బరువు పెరగడం ప్రారంభమవుతుంది. 
 
నిద్ర లేకపోవడం వల్ల, రోగనిరోధక శక్తి బలహీనపడుతుంది, దీని కారణంగా అనేక రకాల వ్యాధులు మిమ్మల్ని ప్రభావితం చేస్తాయి. నిద్ర లేకపోవడం వల్ల ఆందోళన, ఒత్తిడి, బరువు పెరగడం వంటి సమస్యలు మొదలవుతాయి.

55
sleep

sleep

రాత్రిళ్లు త‌ర్వ‌ర‌గా నిద్ర పోవ‌డానికి చిట్కాలు 

రాత్రిళ్లు త్వ‌ర‌గా నిద్ర పోవడం వ‌ల్ల అనేక రుగ్మ‌త‌లు మీకు రాకుండా చేసుకోవ‌చ్చు. రాత్రిళ్లు త్వ‌ర‌గా నిద్ర పోవ‌డానికి కొన్ని చిట్కాలు పాటించాలి. వాటిలో మొద‌టిది ఫోన్, ట్యాబ్ ల‌ను ప‌డుకునే ముందు అస్స‌లు చూడ‌కూడ‌దు. ఇది మీ నిద్ర‌ను చెడ‌గొడుతుంది. ప‌డుకునే స‌మ‌యంలో కొంత స‌మ‌యం ముందు పుస్త‌కం చ‌దివితే కూడా నిద్ర త్వ‌ర‌గా వ‌స్తుంది. గ‌దిలో లైట్ ఆఫ్ చేయ‌డం లేదా త‌గ్గించ‌డం చేయాలి. పడుకునే ముందు ఫోన్ స్విచ్ ఆఫ్ చేయడం ఇంకా ఉత్త‌మం. బెడ్ పై పడుకుని ఎలాంటి లైటింగ్ స్క్రీన్ లను చూడకపోవడం మంచింది. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
జీవనశైలి
 
Recommended Stories
Top Stories
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Andriod_icon
  • IOS_icon
  • About Us
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2025 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved