MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Bigg Boss Telugu 10
Asian Games 2026
IMD Weather Update
Today's Rasi Phalalu
Jr NTR Injury Update
OTT Releases This Week
Actress Roja Selvamani
Team India Captain
Dimpu Kallem Asha
Abhishek Sharma
Missing Meghana Movie Review
Getup Srinu Remuneration
Chicken Curry Recipe
  • Home
  • Life
  • First Periods: మనదేశంలోని ఆడపిల్లల్లో 8 ఏళ్లకే పీరియడ్స్ ఎందుకు మొదలవుతున్నాయో తెలుసా?

First Periods: మనదేశంలోని ఆడపిల్లల్లో 8 ఏళ్లకే పీరియడ్స్ ఎందుకు మొదలవుతున్నాయో తెలుసా?

First Periods: అమ్మాయిల జీవితంలో మొదటి రుతుస్రావం ఎంతో ముఖ్యమైనది. ఈ దశలో ఎన్నో శారీరక, మానసిక, భావోద్వేగ మార్పులు జరుగుతాయి. అయితే మనదేశంలో చిన్న వయసులోనే ఆడపిల్లలకు నెలసరి మొదలవుతోంది.దీనికి కారణాలు ఏమిటో తెలుసా? 

2 Min read
Author : Haritha Chappa
Published : Apr 22 2026, 01:47 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
ఎనిమిదేళ్లకే రుతుస్రావం
Image Credit : Gemini ai

ఎనిమిదేళ్లకే రుతుస్రావం

నెలసరి లేదా రుతుస్రావం అనేది అమ్మాయిల్లో జరిగే ఒక సహజ ప్రక్రియ. ఇది ఎంతో ముఖ్యమైనది కూడా. అయితే ఒక అమ్మాయి జీవితంలో మొదటిసారి రుతుస్రావడం కావడం అనేది చాలా ముఖ్యమైన ఘట్టం. ఇది ఆ అమ్మాయికి కాస్త అసౌకర్యంగానే అనిపిస్తుంది. మొదటిసారి పీరియడ్స్ ప్రారంభం అవ్వడాన్ని మెనార్చే అని అంటారు. రుతుస్రావం ప్రారంభం కావడం ఆ అమ్మాయి జీవితంలో పెద్ద మార్పుకు సంకేతం. ఈ కాలంలో శారీరక, మానసిక మార్పులు మొదలవుతాయి. ఎన్నో భావోద్వేగాలు కూడా కలుగుతాయి. సాధారణంగా అమ్మాయిలకు మొదటి పీరియడ్స్ 10 నుండి 15 సంవత్సరాల మధ్యలో ప్రారంభమవుతుంది. కానీ ఇప్పుడు మనదేశంలో ఎనిమిదేళ్లకే పీరియడ్స్ ప్రారంభమవుతున్న అమ్మాయిల సంఖ్య పెరిగిపోతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
కారణాలు ఇవే
Image Credit : Getty

కారణాలు ఇవే

చిన్న వయసులోనే రుతుస్రావం ఎందుకు మొదలవుతోంది? ఈ రోజుల్లో అమ్మాయిలకు ఇలా జరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా జంక్ ఫుడ్ అధికంగా తినడం, శారీరక శ్రమ చేయకపోవడం, వ్యాయామం చేయకపోవడం, అనారోగ్యకరమైన జీవనశైలి, నిద్ర తగ్గిపోవడం, తీవ్రమైన చదువుల ఒత్తిడి ఇవన్నీ కూడా వారిలో అనేక మార్పులకు కారణం అవుతున్నాయి. దీనివల్ల వారు త్వరగా రజస్వల అవుతున్నారు.

34
స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్
Image Credit : Getty

స్క్రీన్ టైమ్ ఎఫెక్ట్

ఈ కాలంలోని పిల్లలు చదువు విషయంలో అధికంగా ఒత్తిడికి గురవుతున్నారు. అలాగే వారు టీవీ, ఫోన్ చూసే సమయం కూడా పెరిగిపోతుంది. దీనివల్ల నిద్ర విధానాల్లో మార్పులు వస్తున్నాయి. అనారోగ్యకరమైన జీవన శైలి వారికి చిన్నప్పటి నుంచే అలవాటవుతోంది. మార్కెట్లో కల్తీ ఆహార పదార్థాలు ఎక్కువవుతున్నాయి. వీటిని తిన్న అమ్మాయిల హార్మోన్లపై ప్రతికూల ప్రభావం పడుతోంది. దీనివల్ల హార్మోన్ల మార్పులు త్వరగా ప్రారంభమై.. రుతుస్రావం కూడా త్వరగానే మొదలవుతోంది. దీనితో ఎనిమిది నుండి తొమ్మిది సంవత్సరాల మధ్య గల ఆడపిల్లలు త్వరగా రజస్వల అవుతున్నారు.

44
ఎప్పుడు సమస్య?
Image Credit : Getty

ఎప్పుడు సమస్య?

ఎనిమిదేళ్లు దాటిన ఆడపిల్లలకు తల్లి రుతుస్రావం గురించి ఎంతో కొంత సమాచారాన్ని చెప్పడం చాలా ముఖ్యం. లేకుంటే వారు ఒక్కసారిగా భయపడే అవకాశం ఉంటుంది. ఎనిమిది సంవత్సరాల వయసు రాకముందే ఋతుస్రావం మొదలైతే కచ్చితంగా వైద్యుల్ని సంప్రదించాల్సిన అవసరం ఉంది. అలాగే ఒక అమ్మాయికి 15 ఏళ్లు దాటినా కూడా పీరియడ్స్ మొదలుకాకపోయినా కూడా డాక్టర్ ను కలిసి తగిన చికిత్సలు తీసుకోవాలి. రుతుస్రావ సమయంలో తీవ్రమైన నొప్పి కూడా ప్రమాదకరమైనది. ఇది పీసీఓడీ లేదా ఎండోమెట్రియోసిస్ వంటి సమస్యలకు సంకేతంగా భావించాలి.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Printed Saree: ఆఫీస్ వేర్ కి పర్ఫెక్ట్ గా సూటయ్యే ప్రింటెడ్ చీరలు
Recommended image2
Chapati Dough: చపాతీ పిండి కలిపిన కాసేపటికే నల్లగా ఎందుకు మారుతుంది? తాజాగా ఉండాలంటే ఏం చేయాలి?
Recommended image3
Silver Anklet:భారత్ లో కాకుండా ఏదేశంలో మహిళలు పట్టీలు ధరిస్తారో తెలుసా
Related Stories
Recommended image1
Curry leaves oil: కరివేపాకులను ఇలా వాడారంటే.. మీ తెల్ల జుట్టు నల్లగా మారిపోవడం ఖాయం
Recommended image2
Jupiter Transit: గురుగ్రహం వల్ల అతిపెద్ద రాజయోగం, జాక్ పాట్ కొట్టే రాశులు ఇవే
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved