MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Toxic Movie First Review
IMD Weather Update
Today Rasi Phalalu
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
Dhruv Jurel
OTT Releases
Devdutt Padikkal
Dakshina Kailasam Temple
Bigg Boss Agnipariksha
  • Home
  • Life
  • Dosa: మీకు దోశలు వేయడం వస్తే చాలు.. ఏడాదికి రూ.32లక్షల జీతం, ఎక్కడో తెలుసా?

Dosa: మీకు దోశలు వేయడం వస్తే చాలు.. ఏడాదికి రూ.32లక్షల జీతం, ఎక్కడో తెలుసా?

Dosa: మీకు బ్రహ్మాండంగా దోశలు వేయడం వచ్చా? అయితే.. ఈ దోశలు వేస్తూ సంవత్సరానికి రూ.32 లక్షలు సంపాదించొచ్చని మీకు తెలుసా? ఆ ఉద్యోగం ఎక్కడ దొరుకుతుందో తెలుసా?

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 16 2026, 01:23 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
దోశలు వేయడం వచ్చా?
Image Credit : Chat GPT

దోశలు వేయడం వచ్చా?

భారతీయ వంటకాలకు ప్రపంచ వ్యాప్తంగా రోజు రోజుకీ ఆదరణ పెరుగుతోంది. ముఖ్యంగా దోశ, ఇడ్లీ, వడ వంటి దక్షిణ భారత వంటకాలకు విదేశాల్లోనూ ఎంతో ఫేమస్ అవుతున్నాయి. దీంతో.. ఈ వంటలు చేయడం వచ్చిన వారికి క్రేజ్ పెరుగుతోంది. ముఖ్యంగా దోశలు వేయడం వస్తే.. విదేశాల్లో భారీ ప్యాకేజ్ తో ఉద్యోగాలు ఆఫర్ చేస్తున్నారని మీకు తెలుసా? దీనికి సంబంధించి సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ గా మారింది. ఆ వీడియోలో దోశలు వేయడం వస్తే..రూ. 32లక్షల జీతం అని ఉంది. నిజంగానే ఇలాంటి ఉద్యోగాలు ఉంటాయా? ఇలాంటి ఉద్యోగాలకు డిమాండ్ ఎక్కడ ఉంది? అనే విషయాలు ఇప్పుడు చూద్దాం..

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
దోశ చెఫ్ కి ఎందుకు అంత డిమాండ్..?
Image Credit : Gemini

దోశ చెఫ్ కి ఎందుకు అంత డిమాండ్..?

గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచ వ్యాప్తంగా భారతీయ రెస్టారెంట్లు వేగంగా విస్తరిస్తున్నాయి. ముఖ్యంగా సౌత్ ఇండియన్ రెస్టారెంట్ల సంఖ్య రోజు రోజుకీ పెరుగుతోంది. అందుకోసమే.. మన ఫుడ్స్ దోశ, ఇడ్లీ, ఉతప్పం వంటి వాటిని తయారు చేసే చెఫ్స్ కోసం వెతుకుతున్నారు. అలా దొరికిన వారికి భారీ మొత్తంలో జీతం చెల్లిస్తున్నారు.

Related Articles

Related image1
Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
Related image2
Water Bottle: నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనేయచ్చు..!
34
ఏ దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది..?
Image Credit : Chat GPT

ఏ దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది..?

యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఖతార్, సౌదీ అరేబియా, కువైట్, ఒమన్, సింగపూర్, మలేషియా, కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో ఎక్కువ డిమాండ్ ఉంది. ఈ దేశాల్లో చాలా రెస్టారెంట్లలో దోశ చెఫ్స్ కి మంచి డిమాండ్ ఉంది.ఈ దేశాల్లో జీతం కూడా భారీగానే ఆఫర్ చేస్తున్నట్లు తెలుస్తోంది. గల్ఫ్ దేశాల్లో నెలకు సుమారు లక్షన్నర నుంచి రెండున్నర లక్షల వరకు జీతం ఇస్తున్నారు. ఇక.. కెనడా, ఆస్ట్రేలియా, యూకే, అమెరికా వంటి దేశాల్లో సంవత్సరానికి రూ.20 లక్షల నుంచి రూ.32లక్షల దాకా ఆఫర్ చేస్తున్నారు.

44
ఈ ఉద్యోగం రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటే...
Image Credit : Gemini

ఈ ఉద్యోగం రావాలంటే ఎలాంటి అర్హతలు ఉండాలంటే...

విదేశాల్లో దోశ చెఫ్ గా ఉద్యోగం సాధించాలి అంటే.. కొన్ని అర్హతలు ఉండాలి. ముఖ్యంగా కనీసం 2 నుంచి 5 సంవత్సరాలు హోటల్స్ పనిచేసిన అనుభవం ఉండాలి. నార్మల్ దోశ వేయడం వస్తే సరిపోదు. వివిధ రకాల డిఫరెంట్ దోశలు వేయడం రావాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉండాలి. మంచి దోశ పిండి తయారు చేయడం, రుచిగా సాంబార్, చట్నీలు తయారు చేయడం కూడా రావాలి.

ఇలాంటి ఉద్యోగాలకు ఎలా అప్లై చేయాలి..?

మీకు కూడా ఇలాంటి ఉద్యోగం కావాలి అంటే.. లింక్డిన్, ఇన్ డీడ్, గ్లాస్ డోర్, గల్ఫ్ టాలెంట్ వంటి వాటిల్లో వెతికితే చాలా ఈజీగా ఉద్యోగం దొరికే అవకాశం ఉంది.

ఒకప్పుడు కేవలం దక్షిణ భారత దేశానికి మాత్రమే పరిమితమైన ఈ దోశ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. ఈ దోశ వేయడం వస్తే చాలు.. ఈజీగా లక్షల రూపాయల జీతం పొందొచ్చు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Period Diet: పీరియడ్స్ టైంలో ఇలాంటి ఫుడ్ తీసుకుంటే చాలా మంచిది!
Recommended image2
భారతీయులు ఎంజాయ్ చేయడానికి బ్యాంకాక్‌కు ఎందుకు వెళ్తారు?
Recommended image3
Blouse:ట్రెండింగ్ బ్లౌజ్ బ్యాక్ నెక్ డిజైన్స్..చీర అందాన్ని పెంచుతాయి
Related Stories
Recommended image1
Ambani: అంబానీ ఇంట్లో ఉద్యోగం చేయాలంటే..మీకు ఎలాంటి అర్హతలు ఉండాలో తెలుసా?
Recommended image2
Water Bottle: నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనేయచ్చు..!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved