MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Water Bottle: నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనేయచ్చు..!

Water Bottle: నీతా అంబానీ వాడే వాటర్ బాటిల్ ఖరీదు ఎంతో తెలుసా? డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ కొనేయచ్చు..!

 Water Bottle: ముఖేష్ అంబానీ భార్య నీతా అంబానీ వాడే చీరలు, జ్యూవెలరీ లక్షల్లో, కోట్లల్లో విలువ చేస్తూ ఉంటాయి. కానీ, ఆమె వాడే ఒక వాటర్ బాటిల్ తో మిడిల్ క్లాస్ వాళ్లు ఏకంగా ఓ ఇల్లు కొనేయవచ్చని మీకు తెలుసా? 

2 Min read
Author : ramya Sridhar
Published : Jul 07 2026, 09:31 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..
Image Credit : Instagram

వాటర్ బాటిల్ ఖరీదు తెలిస్తే ఎవరైనా షాక్ అవ్వాల్సిందే..

మన దేశ కుబేరుడు ముఖేష్ అంబానీ గురించి స్పెషల్ గా పరిచయం అవసరం లేదు. ఆయన వ్యాపారాలకు సంబంధించిన విషయాలతో నిత్యం వార్తల్లో నిలుస్తూ ఉంటారు. అయితే... ఆయన భార్య నీతా అంబానీ మాత్రం ఫ్యాషన్, ఖరీదైన ఆభరణాలు ధరిస్తూ.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు.

అయితే.. ఇప్పటి వరకు ఆమె కట్టుకునే చీరలు, వాడే హ్యాండ్ బ్యాగ్స్, వేసుకునే జ్యూవెలరీ కోట్ల రూపాయలు విలువ చేయడం గురించి వినే ఉంటారు. కానీ.. ఆమె వాడే ఒక వాటర్ బాటిల్ ధర ఎంతో తెలుసా? అక్షరాలా రూ.49లక్షలు. మిడిల్ క్లాస్ కుటుంబం ఈ డబ్బుతో ఏకంగా.. ఒక డబుల్ బెడ్రూమ్ ఫ్లాట్ చాలా ఈజీగా కొనేయచ్చు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
వాటర్ బాటిల్ లో అంత స్పెషల్ ఏముంది..?
Image Credit : AcquaDiCristallo/Facebook

వాటర్ బాటిల్ లో అంత స్పెషల్ ఏముంది..?

నీతా అంబానీ అందం, ఆరోగ్యం పట్ల శ్రద్ధ కాస్త ఎక్కువ.అందుకే.. తన అందాన్ని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి స్పెషల్ నీటిని తాగుతారు. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నీటిని నీతా అంబానీ తాగుతారు. అందుకే.. అంత ఖరీదైన వాటర్ తాగడానికి.. మరింత ఖరీదైన స్పెషల్ వాటర్ బాటిల్ డిజైన్ చేయించుకున్నారు. నీతా అంబానీ వాడే.. ఈ వాటర్ బాటిల్ ని ప్రముఖ మెక్సికన్ డిజైనర్ ఫెర్నాండో అల్టామినో రూపొందించారు. ఈ బాటిల్ ఒక మహిళ ముఖం ఆకారంలో ఉంటుంది. అదంతా 24 క్యారెట్ల బంగారంతో చేయడం విశేషం. బాటిల్ బంగారంతో చేయడమే కాదు.. ఆ నీటిలో కూడా బంగారం కలుస్తుంది. ఆ బాటిల్ లో అక్వా డి క్రిస్టాలో ట్రిబ్యూటో ఎ మోడిగియాని ఉంది. అంటే.. ఆ నీటిలో ఫిజి, ఫ్రాన్స్, ఐస్ లాండ్ నుంచి సేకరించిన సహజ సెలయేటి నీటితో పాటు 24 క్యారెట్ల బంగారు రేణువులు కూడా కలుపుతారు. అందుకే.. ఆ నీరు అంత ఖరీదు. ఈ నీరు తాగడం వల్ల.. చర్మం హైడ్రేటెడ్ గా ఉంటుంది. నీతా అందం రహస్యం ఈ వాటరే అని చాలా మంది అంటూ ఉంటారు.

33
నెటిజన్ల రియాక్షన్ ఇదే..
Image Credit : stockPhoto

నెటిజన్ల రియాక్షన్ ఇదే..

ఈ వార్త సోషల్ మీడియాలో షేర్ అయిన తర్వాత..కామెంట్స్ మాత్రం చాలా భిన్నంగా వినిపిస్తున్నాయి. అంత ఖరీదైన వాటర్ బాటిల్ ని కడగడానికి ఏ నీళ్లు వాడతారు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. అయితే.. . నీతా వాడే ఈ వాటర్ బాటిల్ విషయంలో భిన్న అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. కొందరు.. నిజంగానే నీతా వాడే వాటర్ బాటిల్ ఖరీదు రూ.50లక్షలు అని కామెంట్ చేస్తుంటే... కొందరు.. అందులో నిజం లేదని..అదంతా ఫేక్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Necklace Designs: అర తులంలో అదిరిపోయే నక్లెస్ డిజైన్లు
Recommended image2
Relationship: చిన్న విషయమే కదా అని వదిలేస్తున్నారా? 5 అలవాట్లు మార్చుకుంటే లైఫ్ అంతా హ్యాపీ
Recommended image3
White Clothes: తెల్లడ్రెస్సులు కొత్తవాటిలా మెరవాలంటే ఈ పదార్థాలను ఉపయోగించండి చాలు
Related Stories
Recommended image1
Slowest Train:మనిషి నడిచే వేగం కన్నా.. నెమ్మదిగా కదిలే రైలు, ఈ రైలు ఎక్కడానికి క్యూలు కడుతున్న జనం, ఎక్కడో తెలుసా?
Recommended image2
Oldest Bazar: మన దేశంలో అతి పాత బజార్ ఇదే..350 ఏళ్లుగా నడుస్తోంది..ఇక్కడ దొరకనిది అంటూ ఏదీ లేదు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved