Weight loss tips : తినకపోయినా బరువు పెరుగుతామా?
Weight loss tips : ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. ఈ సమస్యతో బాధపడుతున్న వారు నలుగురిలోకి వెళ్లడానికి కూడా నామోషిగా ఫీలవుతుంటారు. బరువు తగ్గేందుకు నానా ప్రయత్నాలు చేసి విఫలం అయిన వారు లేకపోలేదు. అయితే తింటేనే కదా బరువు పెరుగుతున్నం అని తిండిని మానేసి కడుపు మాడ్చుకునే వారు చాలా మందే ఉన్నారు. అయితే ఎంత మంది బరువు తగ్గారు..?

Weight loss tips : ప్రస్తుత కాలంలో చాలా మంది ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య అధిక బరువు. ఈ సమస్యతో బాధపడుతున్నా వారు నలుగురిలోకి వెళ్లడానికి కూడా నామోషిగా ఫీలవుతుంటారు. దీని కారణంగా వారికి ఇష్టమైన డ్రెస్సులను కూడా వేసుకోలేకపోతుంటారు. అందులోనూ టైట్ గా ఉండే దుస్తుల జోలికి అస్సలు పోరు. ఎందుకంటే ఆ డ్రెస్సులను వేసుకుంటే ఎక్కడ వారు లావుగా కనిపించి నలుగురి వెక్కిస్తారేమోనని భయపడిపోతుంటారు. బరువు తగ్గేదెలా అంటూ తీవ్ర ఆందోళనకు గురవుతుంటారు. ఎన్నో చిట్కాలను, సలహాలను పాటిస్తుంటారు. బరువును తగ్గేందుకు నానా ప్రయత్నాలు చేసి విఫలం అయిన వారు లేకపోలేదు. అయితే తింటేనే కదా బరువు పెరుగుతున్నం అని తిండిని మానేసి కడుపు మాడ్చుకునే వారు చాలా మందే ఉన్నారు. ఎప్పుడు పడితే అప్పుడు తమకు నచ్చిన వ్యాయామాలు చేస్తుంటారు. అయినా బరువు తగ్గారా..? అంటే అది ఉండదు. మరి బరువు తగ్గాలంటే సరైన మార్గం ఏంటి.. మనం చేసిన పొరపాట్లేంటో తెలుసా..? ఈ ఆర్టికల్ చదివి బరువు పెరగడానికి దారి తీసే కారణాలు తెలుసుకుందాం పదండి.
కంటినిండా నిద్రలేకపోతే అనేక రోగాల బారిన పడతామని మనకు ఇది వరకే తెలిసిందే. నిద్ర రోగాలనే కాదండి అధిక బరువు సమస్యను కూడా తెస్తుంది. కంటినిండా నిద్రలేకపోతే బరువు పెరుగుతారని ఇప్పటికే పలు అధ్యయనాలు కూడా స్పష్టం చేశాయి. అలాగే నిద్రలేమితో జీవక్రియల వేగం కూడా నెమ్మదిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. అందుకే రోజూ ఒకే టైం కు పడుకునేలా చూసుకోవాలి
వ్యాయామం చేస్తే కూడా బరువు తగ్గుతారు. వర్కౌట్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఫిట్ గా చేయడంలో కూడా Workouts మించిన సాధనం మరోటి లేదు. అయితే ఇవి చేయడానికి సమయం.. సందర్భం.. ఎంతో అవసరం. అదీ కాక ఇష్టానుసారంగా చేయడానికి వీలు లేదు. అయితే తొందరగా బరువు తగ్గాలని ఇష్టాను సారంగా మితి మీరి Workouts ను చేస్తుంటారు. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యల భారిన పడే ప్రమాదం పొంచి ఉంది. బరువు తగ్గాలన్నా, ఫిట్ గా ఉండాలన్నా ఒక క్రమపద్దతి ప్రకారమే వర్కౌట్లను చేయాలి. వర్కౌట్స్ మధ్యలో బ్రేకులు తప్పకుండా తీసుకోవాలి.
అధిక బరువుతో బాధపడేవారు వాళ్ల ఫుడ్ పై నియంత్రణ కలిగి ఉండాలి. లేదంటే మరింత బరువు పెరిగే అవకాశం ఉంది. ఆకలిగా అనిపిస్తే కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం, ఆకలిని కలిగించే పండ్ల జ్యూస్ లకు దూరంగా ఉండాలి. అలాగే Cool Drinks ను తాగడం మానేయాలి. వీటికి బదులుగా మంచి నీళ్లను తాగడం అలవాటు చేసుకోండి. పోషకాలు మెండుగా లభించే ఫుడ్ ను పరిమితికి మించి తినకూడదు.
పిండి పదార్థాలు, కార్బోహైడ్రేట్స్ బరువును పెంచడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అందుకే ఇవి అధికంగా ఉండే బ్రెడ్, బియ్యం, చక్కెర వంటి పదార్థాలకు దూరంగా ఉండాలి. వీటినుంచి పోషకాలు కూడా మనకు చాలా తక్కువగా లభిస్తాయి. వీటిని తినడం వల్ల గ్లైసిమిక్ అంది అది మన blood లో Sugar levels ను పెంచుతాయి. ఫలితంగా బరువు తగ్గే ఛాన్సే లేకుండా పోతుంది. సో వీటికి బదులుగా వేరే ఆహారాన్ని తినడం మంచిది.