MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
UPI Payment Charges
Irumudi Movie BO Collections
Indian Railways New Rule
Ramba Oorvasi Menaka BO Collections
Bethlehem Kudumba Unit OTT Release
Team India Squad for West Indies ODI Series
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
  • Home
  • Life
  • Love Psychology: I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? సైకాలజీ ఏం చెబుతోంది?

Love Psychology: I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? సైకాలజీ ఏం చెబుతోంది?

Love Psychology: I Love You అనే మాట చాలా ప్రత్యేకమైంది. కానీ ప్రతి ఒక్కరూ తమ ప్రేమను మాటల్లో చెప్పలేరు. కొందరు చేతల్లో చూపిస్తుంటారు. I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? అనే డౌట్ చాలామందిలో ఉంటుంది. ఇక్కడ క్లియర్ చేసుకుందాం.

2 Min read
Author : Kavitha G
Published : May 30 2026, 12:32 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
16
I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా?
Image Credit : Getty

I Love You అని చెప్పని వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా?

ప్రేమ అనేది కేవలం మాటల్లో చెప్పేది కాదు, మన ప్రవర్తన, చూపులు, చిన్న చిన్న కేర్‌లో కూడా కనిపించే భావన. అయితే చాలా మంది మనసులో ఉండే డౌట్ ఏంటంటే.. ఎప్పుడూ I Love You అని చెప్పే వాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? లేదా చెప్పనివాళ్లు ఎక్కువగా ప్రేమిస్తారా? అని. దీనిపై సైకాలజీ నిపుణులు ఏం చెబుతున్నారో ఇక్కడ తెలుసుకుందాం.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
26
మాటలతో కొలవడం కష్టం
Image Credit : Getty

మాటలతో కొలవడం కష్టం

సైకాలజీ ప్రకారం ప్రతి వ్యక్తి ప్రేమను వ్యక్తపరిచే విధానం భిన్నంగా ఉంటుంది. కొందరికి I Love You అని పదే పదే చెప్పడం సహజంగా అనిపిస్తే, మరికొందరు అలా చెప్పడానికి కాస్త సంకోచిస్తారు. కానీ వారు మీ కోసం చేసే పనులు, మీ సమస్యలను పట్టించుకోవడం, మీకు అవసరమైనప్పుడు మీతో ఉండడం ద్వారా తమ ప్రేమను చూపిస్తారు. కాబట్టి ప్రేమను మాటలతోనే కొలవడం కష్టం.

36
పెరిగిన వాతావరణ ప్రభావం
Image Credit : Getty

పెరిగిన వాతావరణ ప్రభావం

కొందరు వ్యక్తులు చిన్నప్పటి నుంచి ఎమోషన్స్‌ను బయటపెట్టకుండా పెరిగి ఉంటారు. కుటుంబ వాతావరణం, పెంపకం, గత అనుభవాలు ఇవన్నీ కూడా ఒక వ్యక్తి ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడో ప్రభావితం చేస్తాయి. చిన్నప్పటి నుంచి ప్రేమను మాటల్లో వ్యక్తం చేయని కుటుంబంలో పెరిగిన వారు I Love You అని చెప్పడానికి ఇబ్బంది పడొచ్చు. అలాంటి వ్యక్తులు భావోద్వేగాల కంటే చర్యలను ఎక్కువగా నమ్ముతారు.

46
నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటారంటే?
Image Credit : Gemini AI

నిజంగా ప్రేమిస్తే ఎలా ఉంటారంటే?

మరోవైపు, ఎప్పుడూ I Love You అని చెప్పే వాళ్లందరూ లోతుగా ప్రేమిస్తారనే గ్యారంటీ లేదు. కొన్ని సందర్భాల్లో అది అలవాటుగా మారిపోవచ్చు. నిజమైన ప్రేమ కేవలం మాటల్లో కాకుండా, కష్ట సమయంలో అండగా నిలబడటంలో, మీ భావాలను గౌరవించటంలో, మీ ఆనందాన్ని, మీకు సంబంధించిన చిన్న చిన్న విషయాలను పట్టించుకోవటంలో కనిపిస్తుంది. సైకాలజీ నిపుణుల ప్రకారం, ఒక వ్యక్తి మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తే వారి ప్రవర్తనలో స్థిరత్వం ఉంటుంది. 

56
ప్రేమను వ్యక్తపరచడం
Image Credit : pixabay

ప్రేమను వ్యక్తపరచడం

ప్రేమను వ్యక్తపరచకపోవడం ఎప్పుడూ మంచి విషయం అనుకోకూడదు. ఎందుకంటే ప్రతి సంబంధంలో కమ్యూనికేషన్ చాలా ముఖ్యం. కొందరికి ప్రేమను మాటల్లో వినడం వల్ల భద్రత, నమ్మకం కలుగుతుంది. సైకాలజీ ప్రకారం ఇద్దరు వ్యక్తులు తమ భావాలను ఒకరికొకరు అర్థమయ్యే విధంగా వ్యక్తపరుకోవడమే మంచిది.

66
బంధంలో ఇది ముఖ్యం
Image Credit : Getty

బంధంలో ఇది ముఖ్యం

ప్రేమను అంచనా వేయాలంటే కేవలం I Love You అన్న మాటను మాత్రమే చూడకూడదు. ఆ వ్యక్తి మీతో ఎలా ప్రవర్తిస్తున్నాడు? మీకు గౌరవం ఇస్తున్నాడా? మీ భావాలను అర్థం చేసుకుంటున్నాడా? మీ కోసం సమయం కేటాయిస్తున్నాడా? అనే విషయాలను కూడా గమనించాలి. ఎందుకంటే ప్రేమ అనేది ఒక్క మాట కాదు, అది నిరంతరం కనిపించే శ్రద్ధ, ఆప్యాయత, బాధ్యతల కలయిక.

About the Author

KG
Kavitha G
8 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2016లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. ప్రస్తుతం ఏసియానెట్‌లో ఫ్రీలాన్స్ జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు.
బంధుత్వం
జీవనశైలి
ఏషియానెట్ న్యూస్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Garlic Naan Recipe: మెత్తగా, బటర్ ఫ్లేవర్‌తో గార్లిక్ నాన్..నోట్లో వేసుకోగానే దూదిలా కరిగిపోతుంది
Recommended image2
Chanakya Niti: చాణక్యుడి ప్రకారం.. మీపై అసూయ ఉన్నవారిని ఎలా గుర్తించాలో తెలుసా?
Recommended image3
Moral Story: కర్మ ఈజ్ బూమరాంగ్.. పక్కవారిపై నింద వేసి సంతోషపడుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Related Stories
Recommended image1
Soft Chapati: ఈ సింపుల్ టిప్స్ తో దూదిలాంటి మెత్తటి చపాతీలు రెడీ! ట్రై చేయకపోతే ఎలా?
Recommended image2
Money Saving Habits: ఈ 5 అలవాట్లు ఉన్నవాళ్లు త్వరగా ధనవంతులవుతారు!
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved