Kidney Failure Symptoms: రాత్రిపూట ఇలాంటి లక్షణాలు కనపడుతున్నాయా?
Kidney Failure Symptoms: కిడ్నీ ఫెయిల్యూర్ అనేది చాలా ప్రమాదకరమైన వ్యాధి. కానీ, సకాలంలో చికిత్స తీసుకుంటే దీనిని నయం చేయవచ్చు. కానీ, దానికంటే అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే... దాని లక్షణాలను గుర్తించడం.

మూత్ర పిండాలు
మూత్రపిండాలు మన శరీరంలో అతి ముఖ్యమైన అవయవం. శరీరాన్ని శుభ్రపరచడానికి, రక్తాన్ని నిర్విషీకరణ చేయడానికి ఇవి కీలకంగా పని చేస్తాయి. కానీ, ఇటీవల కాలంలో, మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నవారి సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇందులో కిడ్నీ ఫెయిల్యూర్స్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే, వీటిని చాలా ప్రమాదకరమైన వాటికా పరిగణిస్తారు. అయితే, ఈ మూత్ర పిండాల వ్యాధి లక్షణాలను ముందుగా గుర్తించాలి. వాటిని ఎలా గుర్తించాలి అనే విషయాన్ని కార్డియాలజిస్ట్ డాక్టర్ బిమల్ చాజర్ వివరించారు.
నిపుణులు ఏం చెబుతున్నారు...?
మూత్ర పిండాల వైఫల్యానికి అతి పెద్ద కారణం దాని లక్షణాలను గుర్తించడంలో ఆలస్యం అని డాక్టర్ బిమల్ ఛజ్జర్ చెప్పారు. ప్రారంభ లక్షణాలు చాలా తేలికగా ఉంటాయి. 90 శాతం మంది కనీసం వాటిని గుర్తించలేరు. అవి చాలా కామన్ అని భావిస్తారు. కానీ, ఆ మూత్ర పిండాల ఫెయిల్యూర్ కి సంబంధించిన లక్షణాలు రాత్రిపూట మాత్రమే ఎక్కువగా కనపడతాయి.
కిడ్నీ ఫెయిల్యూర్ సంకేతాలు...
రాత్రిపూట మూత్ర విసర్జన
రాత్రిపూట తరచుగా మూత్ర విసర్జన చేస్తూ, బాత్రూమ్‌కు వెళ్లడానికి తరచుగా మేల్కొంటుంటే, అది మూత్రపిండాల దెబ్బతినడానికి సంకేతం కావచ్చు. కొన్నిసార్లు మూత్రం లీకేజ్ కూడా ఒక సమస్య కావచ్చు.
పాదాలలో వాపు
శరీరంలో ఉప్పు , నీరు సరిగ్గా ఫిల్టర్ చేయనప్పుడు, పాదాలలో వాపు వస్తుంది. కొన్నిసార్లు, సాయంత్రం, రాత్రి వేళల్లో చేతుల్లో వాపు కనిపిస్తుంది.
రాత్రి దురద
రాత్రి వేళల్లో ఎవరికైనా తరచుగా దురద, మంట అనిపిస్తే, ఇది కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు. వాస్తవానికి, మూత్రపిండాల వైఫల్యం శరీరంలో అదనపు విషపదార్థాలు పేరుకుపోవడానికి కారణమవుతుంది. ఇది చర్మంపై దురద, దద్దుర్లుకు దారితీస్తుంది.
నిద్ర లేకపోవడం
మూత్రపిండాల పని శరీరం నుండి విషపదార్థాలను తొలగించడం. కానీ ఈ హానికరమైన పదార్థాలు శరీరంలో పేరుకుపోయినప్పుడు, అది రాత్రిపూట విశ్రాంతి లేకపోవడానికి కారణమవుతుంది. ఫలితంగా, నిద్రలేమి తరచుగా సమస్యగా మారుతుంది. రాత్రిపూట అలసట , బలహీనత కూడా మూత్రపిండాల వైఫల్యానికి సంకేతం కావచ్చు.
శ్వాస ఆడకపోవడం, నొప్పి
మూత్రపిండాల వైఫల్యం కొన్నిసార్లు నొప్పిని కలిగిస్తుంది. ఈ నొప్పి రాత్రిపూట ఎక్కువగా కనిపిస్తుంది. ఈ నొప్పి కారణంగా, ప్రజలు రాత్రిపూట శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని అనుభవించవచ్చు. ఇది మూత్రపిండాల వైఫల్యానికి కూడా ఒక లక్షణం.
మూత్రపిండ వైఫల్యానికి ఎలా చికిత్స చేస్తారు?
మూత్రపిండాల వైఫల్య లక్షణాలను ఎదుర్కొంటున్న ఎవరైనా వెంటనే వైద్యుడిని సంప్రదించాలి. రక్త పరీక్షలు, మూత్ర పరీక్షలు , అల్ట్రాసౌండ్‌లు, MRIలు అవసరం. మందులతో చికిత్స చేయవచ్చు. అయితే, తీవ్రమైన మూత్రపిండ వైఫల్యానికి డయాలసిస్ చేయాల్సి రావచ్చు.