Fish: చేపలు తినే రోజు వీటిని మాత్రం తినకండి, తింటే మాత్రం పొట్టలో గడబిడే
చేపలు (Fish) తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మంచిది. అయితే చేపలు తినే రోజు మీరు కొన్ని రకాల ఆహారాలకు దూరంగా ఉండాలి. లేకుంటే పొట్టలో గడబిడ మొదలైపోతుంది. జీర్ణ సమస్యలు ఎక్కువవుతాయి. కాబట్టి చేపలతో పాటూ తినకూడని ఆహారాలేంటో తెలుసుకోండి.

చేపలు తినే రోజు...
నాన్ వెజ్ ప్రియులకు చేపలు అంటే ఎంతో ఇష్టం. చేపల ఇగురు, చేపల పులుసు, చేపల వేపుడు ఇలా రకరకాలు వంటకాలు వండుకుని తినవచ్చు. అయితే మీరు చేపలతో చేసిన వంటకాలు తినేరోజు కొన్ని రకాల ఆహారాలు తినకూడదు. అవేంటో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి. చేపలతో పాటూ కొన్ని ఆహారాలు తినడం వల్ల పొట్టలో గడబిడ మొదలైపోతుంది.
పాల ఉత్పత్తులు
చేపలు తిన్న రోజు పాలు, పెరుగు, చీజ్ లాంటి పాల ఉత్పత్తులు తినకూడదు. తింటే కొందరిలో జీర్ణ సమస్యలు మొదలైపోతాయి. ఎందుకంటే ఈ రెండూ ఆహారాల్లో ప్రోటీన్ అధికంగా ఉంటుంది. వీటిని కలిపి తింటే జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది. దీనివల్ల కడుపునొప్పి, కడుపు ఉబ్బరం లాంటివి రావచ్చు.
సిట్రస్ పండ్లు
నిమ్మ, నారింజ లాంటి సిట్రస్ పండ్లలో ఆమ్లత్వం అధికంగా ఉంటుంది. ఈ ఆమ్లం చేపలోని ప్రోటీన్ తో కలిసినప్పుడు కొందరిలో జీర్ణ సమస్యలు మొదలైపోతాయి. కాబట్టి చేపలు తినే రోజు ఈ పండ్లను తినకండి.
ప్రాసెస్ చేసిన ఆహారాలు
ప్రాసెస్ చేసిన ఆహారాలు, నూనెలో వేయించిన ఆహారాలను కూడా చేప తినే రోజు తినకూడదు. ఎందుకంటే ప్రాసెస్ చేసిన, నూనెలో వేయించిన ఆహారాల్లో ట్రాన్స్ ఫ్యాట్స్ అధికంగా ఉంటాయి. ఇవి శరీరానికి అస్సలు మంచివి కావు. ఇక చేపలతో కలిపి తింటే ఇతర సమస్యలు వచ్చే అవకాశం ఉంది.
కూల్ డ్రింక్స్, మద్యం
కోకో కోలా వంటి కూల్ డ్రింక్స్ ఎన్నో ఉన్నాయి. వీటిని ప్రతిరోజూ తినే వారు ఉంటారు. వీటిలో యాసిడ్ ఉండే పానీయాలు. వీటిని చేపలతో పాటు తాగకూడదు. అలాగే మద్యానికి కూడ దూరంగా ఉండాలి. చేపలు కలిపి తినడం కూడా కొందరిలో జీర్ణ సమస్యలకు కారణమవుతుంది.
పుట్టగొడుగులు
పుట్టగొడుగులు ఆరోగ్యానికి మేలే చేస్తాయి. కానీ పుట్టగొడుగులు, చేపలు కలిపి వండకూడదు, తినచూడదు. ఇది తీవ్రమై జీర్ణ సమస్యలకు కారణం అవుతాయి.

