MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
IMD Weather Update
Jio Free Canva Pro Subscription
Epic Movie BO Collections
Tirumala Srivari Brahmotsavam
Mandaadi Movie BO Collections
Bigg Boss Telugu 10
Maremma Movie Box Office Collections
Mahendragiri Varahi Movie Collections
Kiara Advani-Sidharth Malhotra
Samantha Baby Shower
Vishnu Dashavatara Life Lessons
Indian Stock Market
  • Home
  • Life
  • Fridge Magnets: ఫ్రిజ్ డోర్ కి మ్యాగ్నెట్స్ పెడుతున్నారా? వీటి వల్ల ఫ్రిజ్ పాడైపోతుందా?

Fridge Magnets: ఫ్రిజ్ డోర్ కి మ్యాగ్నెట్స్ పెడుతున్నారా? వీటి వల్ల ఫ్రిజ్ పాడైపోతుందా?

Fridge Magnets: ఫ్రిజ్ డోర్ కి మ్యాగ్నెట్స్ పెట్టే అలవాటు మీకు కూడా ఉందా? అందంగా ఉంటాయి అని మ్యాగ్నెట్స్ పెడుతున్నారు.. కానీ, వీటి వల్ల ఫ్రిజ్ పాడైపోతుందా? నిజమెంత?

2 Min read
Author : ramya Sridhar
Published : Aug 04 2026, 01:11 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
ఫ్రిజ్ మ్యాగ్నెట్స్...
Image Credit : chat GPT

ఫ్రిజ్ మ్యాగ్నెట్స్...

ప్రస్తుత కాలంలో.. ఇంట్లో ఫ్రిజ్ లేనివాళ్లు ఎవరూ లేరు అనే చెప్పాలి. అయితే.. ఫ్రిజ్ ఉన్నవాళ్లంతా.. వాటి డోర్లపై చిన్న చిన్న మ్యాగ్నెట్స్ అంటిస్తూ ఉంటారు. టూర్ కి వెళ్లినప్పుడు గుర్తుగా తెచ్చుకున్నవి కావచ్చు.. లేదా.. పిల్లల ఫోటోలు, షాపింగ్ లిస్టులు, బిల్లులు లాంటివి కూడా ఫ్రిజ్ కి అంటిస్తూ ఉంటారు. వీటిని పెట్టడం వల్ల ఫ్రిజ్ చాలా అందంగా కూడా కనపడుతుంది. కానీ, వీటి వల్ల ఫ్రిజ్ పనితీరు తగ్గిపోతుందా? తొందరగా ఫ్రిజ్ పాడైపోయే అవకాశం ఉందా? నిపుణులు ఏం చెబుతున్నారు? ఇందులో ఎంత వరకు నిజం ఉంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
ఫ్రిజ్ కి మాగ్నెట్స్ పెడితే ఫ్రిజ్ పాడౌతుందా?
Image Credit : Asianet News

ఫ్రిజ్ కి మాగ్నెట్స్ పెడితే ఫ్రిజ్ పాడౌతుందా?

చాలా మంది ఈ మ్యాగ్నెట్స్ పెట్టడం వల్ల ఫ్రిజ్ కంప్రెసర్ పై ఒత్తిడి పెరుగుతుందని, దీని వల్ల తొందరగా ఫ్రిజ్ పాడైపోతుందని అనుకుంటారు. కానీ... ఈ చిన్న మ్యాగ్నెట్స్ వల్ల ఎలాంటి నష్టం ఉండదని నిపుణులు చెబుతున్నారు. మార్కెట్ లో దొరికే చిన్న డెకరేటివ్ ఫ్రిజ్ మ్యాగ్నెట్లు ఫ్రిజ్ పనితీరు తగ్గించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి. అంతేకాదు.. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ఫ్రిజ్ లో హై టెక్నాలజీతో వస్తున్నాయి. వీటిలో ఉండే కంప్రెసర్, కూలింగ్ సిస్టమ్, ఎలక్ట్రిన్ భాగాలు ఈ చిన్న మ్యాగ్నెట్స్ వల్ల దెబ్బ తినే అవకాశం తక్కువ. ముఖ్యంగా మనం అంటించే మ్యాగ్నెట్స్ చాలా చిన్నవి కాబట్టి.. పెద్దగా వీటితో నష్టం ఉండదు.

33
ఇవి మాత్రం ఫ్రిజ్ కి పెట్టకూడదు..
Image Credit : Amazon

ఇవి మాత్రం ఫ్రిజ్ కి పెట్టకూడదు..

1.ఎక్కువ బరువు ఉన్న మ్యాగ్నెట్స్..

చాలా మది చాలా పెద్దవి లేదంటే బరువైన మ్యాగ్నెట్స్ ఎక్కువ సంఖ్యలో ఫ్రిజ్ కి పెడుతూ ఉంటారు. ఇలాంటివి మాత్రం పెట్టకూడదు. దీని వల్ల ఫ్రిజ్ పై అదనపు భారం పడుతుంది. ఇది వెంటనే ప్రభావం చూపించకపోయినా.. కొన్నాళ్లకు.. ఫ్రిజ్ డోర్ లపై ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కాబట్టి.. బరువైనవి మాత్రమే కాదు, ఎక్కువగా కూడా పెట్టకూడదు.

2. డోర్ రబ్బర్ సీల్ కి అడ్డుగా ఉండకూడదు...

మాగ్నెట్ లేదా దానితో పెట్టిన కాగితం రబ్బర్ సీల్ మధ్యలో ఇరుక్కుపోతే, డోర్ పూర్తిగా మూసుకోకపోవచ్చు. దీంతో చల్లని గాలి బయటకు వెళ్లి, విద్యుత్ వినియోగం పెరిగే అవకాశం ఉంటుంది. ఫలితంగా కరెంట్ బిల్లు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది.

3. స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రిజ్‌లపై

ప్రతి స్టెయిన్‌లెస్ స్టీల్ ఫ్రిజ్‌పై మాగ్నెట్లు అంటుకోవు. కొన్ని మోడళ్లలో నాన్-మ్యాగ్నెటిక్ స్టెయిన్‌లెస్ స్టీల్ ఉపయోగిస్తారు. అలాంటి ఫ్రిజ్‌లపై మాగ్నెట్లు పనిచేయవు.

ఎప్పుడు జాగ్రత్తపడాలి? 

పరిశ్రమల్లో ఉపయోగించే అత్యంత శక్తివంతమైన అయస్కాంతాలు (Industrial Magnets) ఫ్రిజ్‌కు దగ్గరగా ఉంచకపోవడం మంచిది. స్మార్ట్ ఫ్రిజ్‌ల టచ్ డిస్‌ప్లే లేదా కంట్రోల్ ప్యానెల్‌పై మాగ్నెట్లు అంటించకండి.డోర్ సీల్‌కు అడ్డుగా మాగ్నెట్లు లేదా కాగితాలు పెట్టవద్దు.

అయితే ఫ్రిజ్‌పై మ్యాగ్నెట్లు వాడొచ్చా..?

ఎలాంటి సమస్యలు లేకుండా మీరు ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ వాడొచ్చు. సాధారణ అలంకరణ కోసం ఉపయోగించే చిన్న ఫ్రిజ్ మ్యాగ్నెట్స్ తో ఎలాంటి నష్టం ఉండదు. అవి ఫ్రిజ్ పనితీరు, కూలింగ్ లేదా కంప్రెసర్‌పై ప్రభావం చూపవు. అయితే, బరువైన మాగ్నెట్లు ఎక్కువగా పెట్టడం, డోర్ సీల్‌కు అడ్డుగా వస్తువులు ఇరుక్కునేలా ఉంచడం మాత్రం మంచిది కాదు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Sarees: స్టైల్, కంఫర్ట్ కోసం ఈ శారీస్ కచ్చితంగా ట్రై చేయాల్సిందే!
Recommended image2
Mangalsutra Designs: కాటన్ చీరలకు సూటయ్యే మంగళసూత్రం డిజైన్లు
Recommended image3
Motivational Story: మనసులోని ఆలోచనలే శత్రువులు.. అద్దం కూడా భయపెడుతుంది.. మీ ఆలోచన మార్చే కథ ఇది
Related Stories
Recommended image1
Beach: ఈ బీచ్ కి వెళ్తే..మీకు స్టార్ హీరోలు అందరూ కనిపిస్తారు, షూటింగ్స్ అన్నీ ఇక్కడే, ఎంటి అంత స్పెషల్?
Recommended image2
Crispy Dosa: పప్పు నానపెట్టేటప్పుడు ఇదొక్కటి వేస్తే.. దోశలు ఎర్రగా, క్రిస్పీగా వస్తాయి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved