MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • బోర్లా పడుకునే అలవాటుందా..? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

బోర్లా పడుకునే అలవాటుందా..? అయితే మీకు ఈ సమస్యలు తప్పవు..

ఒక్కొక్కరు ఒక్కోలా పడుకుంటారు. ఎలా పడుకున్నా.. నిద్ర ముఖ్యమంటారు కొందరు. అయితే మనం పడుకునే విధానం వల్ల కూడా ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Sep 10 2022, 09:52 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
19
sleeping

sleeping

ఆరోగ్యంగా ఉండాలంటే కంటి నిండా నిద్రపోవాలి. ఎందుకంటే అలసి సొలసిన శరీరం నిద్రలోనే శక్తివంతంగా మారుతుంది. అందుకే రోజుకు 6 నుంచి 8 గంటలు ఖచ్చితంగా నిద్రపోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. కంటినిండా నిద్రపోతేనే మన బ్రెయిన్ చురుగ్గా పనిచేస్తుంది. ఎన్నో రోగాలు కూడా దూరమవుతాయి. కానీ ఈ రోజుల్లో అన్ని వయసుల వారు నిద్రలేమితో బాధపడుతున్నారు. ఈ నిద్రలేమికి సోషల్ మీడియా, ఒత్తిడి, డిప్రెషన్, ఆందోళన, మానసిక ఆరోగ్య సమస్యలు, కొన్ని రకాల శారీరక సమస్యలు వంటి కారణాలున్నాయి. 

29

ఇకపోతే నిద్ర ఎంత ముఖ్యమో.. మనం పడుకునే విధానం కూడా అంతే ముఖ్యం. కొంతమంది కాళ్లు, చేతులు నావి కావు అన్నట్టే నిద్రపోతుంటారు. ఇంకొంతమంది వెల్లకిలా పడుకుంటే.. మరికొంతమంది బోర్లా పడుకుంటారు. ఇలా పడుకుంటేనే నిద్ర వస్తుందనేవారు లేకపోలేదు. కానీ ఇలా పడుకోవడం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయి. అవేంటో తెలుసుకుందాం పదండి. 
 

39

ఆడవారు బోర్లా పడుకోవడం అస్సలు మంచిది కాదు. ఇలా పడకోవడం వల్ల వారి ఛాతిపై ఒత్తిడి పడి నొప్పి పెడుతుంది. అంతేకాదు బోర్లా పడుకుంటే ముఖంపై మొటిమలు, మురికి పేరుకుపోవడం వంటి సమస్యలు కూడా వస్తాయి. అంతేకాదు ముడతలు కూడా పడుతుంది. ఎందుకంటే అక్కడ తగినంత ఆక్సిజన్ అందదు.

49

ఇకపోతే గర్భిణులు ఇలా బోర్లా పడుకోవడం కడుపులో ఉన్న బిడ్డకే కాదు తల్లికి కూడా అస్సలు మంచిది కాదు. ఎందుకంటే ఇలా పడుకోవడం వల్ల బిడ్డపై ఒత్తిడి పడుతుంది. దీంతో కడుపులో నొప్పి పుడుతుంది. అంతేకాదు ఇది బిడ్డను ప్రమాదంలో పడేస్తుంది. 

59

బోర్లా పడుకోవడం వల్ల ఆడవారికే కాదు మగవారికి కూడా రిస్కే. ఇది కడుపునకు సంబంధించిన సమస్యలతో పాటుగా గుండెల్లో మంట, అజీర్థి వంటి ప్రాబ్లమ్స్ ను ఫేస్ చేయాల్సి ఉంటుంది. 

69

బోర్లా పడుకుంటే వెన్నెముకపై ఒత్తిడి పడుతుంది. దీంతో బ్యాక్ పెయిన్ వస్తుంది. ఇది ఎన్నో సమస్యలకు దారితీస్తుంది. ముఖ్యంగా వెన్ను నొప్పి నిద్రలేమి సమస్యలకు కారణమవుతుంది. దీనికి తోడు బోర్లా పడుకుంటే శ్వాస సరిగ్గా తీసుకోలేం. అంతేకాదు ఇది మెడ సమస్యలను కలిగిస్తుంది. 

79

ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. కడుపుపై పడుకోవడం వల్ల శరీరంలోని వివిధ భాగాల్లో జలదరింపు, నొప్పి, తిమ్మిరి వంటి సమస్యలు వస్తాయి. ఇలా నిద్రపోయే అలవాటున్నవారికి మెడనొప్పితో పాటుగా వంగే సమస్యలు వస్తాయి. 

89

బోర్లా పడుకోవడం వల్ల నష్టాలతో పాటుగా కొన్ని ప్రయోజనాలు కూడా ఉన్నాయి. ఇలా నిద్రపోవడం వల్ల గురక పెట్టేవారికి కొన్ని ప్రయోజనాలు కలుగుతాయి. 
 

99

మనం ఎల్లప్పుడూ ఎడమ చేతివైపు పడుకుంటే మంచిది. ఇలా పడుకోవడం వల్ల తిన్నది సరిగ్గా జీర్ణం అవుతుంది. జీర్ణ సమస్యలు కూడా పోతాయి. నిద్రకూడా బాగా పడుతుంది. అందుకే అలా ఇలా కాకుండా బోర్లా పడుకోండి. హాయిగా నిద్రపోతారు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Kitchen Hack: ఆకు కూరలు ఎక్కువరోజులు ఫ్రెష్‌గా ఉంచాలంటే…ఈ టిప్ ఫాలో అవ్వండి
Recommended image2
Balcony Plants: బాల్కనీ కోసం బెస్ట్ పూల మొక్కలు
Recommended image3
Garlic Farming: ఇంట్లోనే వెల్లుల్లి ఇలా సింపుల్‌గా పెంచేయండి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved