MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • డిజిటల్ యుగపు దిక్కుమాలిన బతుకులు... అవసరమా చెప్పండి..!!

డిజిటల్ యుగపు దిక్కుమాలిన బతుకులు... అవసరమా చెప్పండి..!!

పిల్లల స్కూల్ దగ్గరినుండి వేసుకునే బట్టల వరకు ఈ కాలంలో అంతా ఆండంబరమే… చివరకు ఏదైనా రోగం బారినపడ్డా స్టేటస్ తగ్గకుండా ఉండే హాస్పిటల్ కి వెళ్లాలి… అప్పు చేసయినా బిల్లు కట్టాలి. ఇది నేటి డిజిటల్ యుగపు బ్రతుకులు… 

3 Min read
Author : Amarnath Vasireddy
Published : Mar 17 2026, 05:08 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
బడాయి బతుకులు..
Image Credit : Getty

బడాయి బతుకులు..

''కేసిఆర్, చిరంజీవి లాంటి ప్రముఖులు వెళ్లే ఆసుపత్రులకే వెళ్ళాలి. చిన్నాచితకా ప్రైవేట్ ఆసుపత్రులకు వెళితే పరువు పోతుంది. ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్లడమంటే మరీ నామోషీ"

"పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి ప్రముఖుల పిల్లలు ఎక్కడ చదివితే అక్కడే మన పిల్లల్ని చదివించాలి. ప్రభుత్వ స్కూల్ శుద్ధ వేస్ట్. బడ్జెట్ ప్రైవేట్ స్కూల్స్ లో చదివిస్తే తలకొట్టేసినట్టే. బ్రాండెడ్ స్కూల్ కావాలి. స్కూల్... కనీసం పది ఎకరాల్లో ఉండాలి. స్కూల్ బిల్డింగ్ తాజ్ మహల్ లాగా వుండాలి. బుర్జ్ ఖలీఫా కంటే ఎత్తుగా... సోగ్గా స్టైల్ గా వుండాలి"

"అల్లెన్ సొల్లి.. వాన్ హ్యూజన్.. కాల్విన్ కేలీన్.. నైక్ .. పీటర్ ఇంగ్లాండ్... వీటికి తగ్గేదెలా. అలాగే బ్రాండెడ్ షూస్ .. బ్రాండెడ్ మొబైల్"

ఇదీ డిజిటల్ యుగంలో మెజారిటీ జనాల ఆలోచన.

అత్మన్యూనత - పోలిక - అనుకరణ - శక్తికి మించి ఖర్చు.

పోనీ కస్టపడి సంపాదించి ఇవన్నీ చేస్తారా? అంటే లేదు.

బ్రాండెడ్ వి కావాలి. అవి కన్సెషన్ కు రావాలి.

స్కూల్ ఫీజు విషయం తీసుకొందాము.

సంవత్సరానికి రూ.70 వేలు కట్టే స్థోమత ఉన్న ఒక పేరెంట్.

రూ.70 వేల ఫీజు ఉన్న స్కూల్ కు వెళ్ళడు.

వెళితే నామోషీ.

మూడు లక్షల ఫీజు ఉన్న స్కూల్ కు వెళ్ళాలి.

అక్కడ బేరమాడాలి.

రూ.70 వేలకు తగ్గించుకోవాలి.

రూ.70 వేలు కట్టాలి.

బయట మా పిల్లాడి ఫీజు మూడు లక్షలు అని గొప్పలు చెప్పుకోవాలి.

లైఫ్ అంతా మొత్తం బిల్డ్ అప్.

ఎవడికి లాభం..? ఎవడికి నష్టం..?

24
ఇప్పుడు విద్యా వ్యాపారం ఎలా సాగుతోందంటే..
Image Credit : Getty

ఇప్పుడు విద్యా వ్యాపారం ఎలా సాగుతోందంటే..

ఒకప్పుడు మిషనరీ స్కూల్స్ .. సేవాభావంతో వచ్చిన స్కూల్స్ (సరస్వతి శిశు మందిర్ లాంటివి) లేదా విద్యావేత్తలు స్థాపించినవి.

ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఓనర్.. ఫార్మసురుడు... రాజకీయ నాయకుడి బినామీ.

వీరి దగ్గర డబ్బు మస్తుగుంది.

జనాల వీక్నెస్ వీరికి తెలుసు.

రూ.200 కోట్ల మనీ పెట్టి .. నార్త్ ఇండియా కు చెందిన ఒక బ్రాండ్ తో ఒప్పందం కుదుర్చుకొని .. ఒక బడా స్కూల్ ప్రారంభిస్తారు.

బడా బిల్డింగ్ .. ఫ్రంట్ ఆఫీస్ మొదలు ... మొత్తం... షో ఆఫ్.

ఫీజు మూడు లక్షలు.. డెబ్భై శాతం డిస్కౌంట్... వెంటనే కుప్పతెప్పలుగా చేరిపోయారు.

హైదరాబాద్ లో ఎల్బి నగర్ ప్రాంతంలో ఇలాగే ఒక బడాయి స్కూల్. మొదటి సంవత్సరం భారీ డిస్కౌంట్ ఇచ్చింది. కుప్పతెప్పలుగా చేరిపోయారు. నెక్స్ట్ ఇయర్ ఫీజు ముప్పై శాతం పెంచేశారు. కొంతమంది పేరెంట్స్ స్కూల్ ముందు నిరసనకు దిగారు..?

ఏమవుతుంది...?

వారి టైం వేస్ట్ .. గొంతు నొప్పి ..తప్ప.. ఒరిగింది ఏమీ ఉండదు .

"కడితే కట్టండి .. లేకపొతే టీసీ తీసుకొని వెళ్లిపోండి" అని మొఖంపై చెప్పేశారు.

అయిదు శాతం మంది టీసీలు తీసుకొని వెళ్లిపోయారు.

కొత్తగా చేరడానికి లైన్ లో గొర్రెలు .. వారికి కూడా మొదటి సంవత్సరం డిస్కౌంట్.

అటుపై జేబు కత్తిరింపు.

స్కూల్ ను నో లాస్.. నో ప్రాఫిట్ బేసిస్ లో నడపాలి. డిస్కౌంట్ ఇచ్చే అవకాశమే ఉండదు.. డిస్కౌంట్ అంటేనే మోసమనే ఇంగితజ్ఞానం ఉండదు.

Related Articles

Related image1
Lifestyle: ఖ‌రీదైన ఫేస్‌వాష్‌తో ప‌నే లేదు.. మీ వంటింట్లోనే మ్యాజిక్ ఉంది
Related image2
Life Hacks:మీ పాత దుస్తులు పారేస్తున్నారా? వాటితోనే డబ్బు సంపాదించొచ్చు, ఎలానో తెలుసా?
34
ఆస్తులు అమ్ముకున్నా సరే... తగ్గేదే లే..!
Image Credit : X

ఆస్తులు అమ్ముకున్నా సరే... తగ్గేదే లే..!

తిరుపతిలో ఎన్నో ఆసుపత్రులు...

ఒకాయనకు జలుబు చేసింది.

ముక్కులోంచి చీమిడి కారుతోంది.

వారింట్లో సంభాషణ.

"రుయా హాస్పిటల్ కు పొతే పోలా..?"

"అయ్యా... మనకాడా దుడ్లు లేవా..? కొడుకు, కూతురు అమెరికాలో మస్తుగా సంపాదిస్తా ఉండారు. సంపాదించిందంతా ఏడ పెడ్తావు. రుయా ఆస్పత్రికి పోతాడంట. సిగ్గు వుండబడలే.. మెడ్రాస్ కు పొయ్యి... అప్పులో ఆసుపత్రిలో చేరు. లేక పొతే పక్కింటోడు, పైఇంటోళ్లు నవ్వి పూడుస్తురు.."

చివరకి కారు తీసుకొని మెడ్రాస్ అప్పులో ఆస్పిటిల్లో చేరాడు.

"టిబి కావొచ్చు.. ఎయిడ్స్ కావొచ్చు. ఆటో ఇమ్యూన్ డిసార్డర్ కావ్వొచ్చు..

కిడ్నీ... లివర్ ... గుండె ... ఊపిరి తిత్తులు... నాలుక ... కొండ నాలుక... గొంతు... కళ్ళు... ముక్కు... నోరు... చెవి.. శరీరంలో ఉన్న సకల భాగాల్లో దేనికైనా సమస్య వుండొచ్చు... మెడికల్ పుస్తకాల్లో ఉన్న 123456789 వ్యాధుల్లో ఏదైనా కావొచ్చు . రూల్ అవుట్ చెయ్యాలి"...

అని ఆసుపత్రిలో ఇన్ పేషంట్ గా చేర్చుకొని మొత్తం 98765 టెస్టులు చేశారు.

వీటిలో 1234 టెస్ట్స్ కు సంభందించి కొద్దీ పాటి అనామోలీ కనిపించింది.

వాటికి ట్రీట్మెంట్ మొదలయ్యింది .

మూడు నెలల తరువాత ఆసుపత్రి నుంచి విడుదల.

తిరుపతి కొర్లగుంట సెంటర్ లో 300 అంకణాల ల్యాండ్ అమ్మకాన్ని పెట్టి బిల్లు చెల్లించి తుత్తిగా మహా తుత్తిగా ఇంటికొచ్చి.. తన మడ్రాస్ అనుభావాలను గొప్పగా అందరికీ చెప్పుకొంటున్నాడు.

"వినయ్యా..! వీడికేనా పడిశం పట్టేది..? నాకు రేపొద్దున పట్టకుండా పోతుందా..? నేను కూడా మడ్రాస్ కు పోకుండా పోతానా?" అని అతని ఫ్రండ్స్ ఇరవై మంది జలుబు కోసం కోనేటి కట్టకాడ కాచుకొని కూర్చుంటున్నారు.

ఈలోగా తిరుపతిలో ఒక టీవీ ఛానల్ వారు పబ్లిక్ ఒపీనియన్ తీసుకొంటూ కొర్లగుంట సెంటర్ ల్యాండ్ అమ్మి తుమ్ములకు ట్రీట్మెంట్ తీసుకొన్న వ్యక్తి దగ్గరకు వచ్చారు.

"ట్రీట్మెంట్ బాగా కాస్ట్లీ అయి పూడ్చిండాది. గవర్నెమెంట్ వీధికొక ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రి కట్టాలా... నాలాంటోళ్లకు ఫ్రీ టట్రీట్మెంట్ ఇవ్వాలా"

అయన వ్యాఖ్యలు బాగా వైరల్ అయ్యాయి.

ఆ రీల్ చూస్తున్నంతసేపు .. జనాల్లో పూనకాలు లోడింగ్.

44
ఇంకో చోట ఇలాంటి బడాయి..
Image Credit : Getty

ఇంకో చోట ఇలాంటి బడాయి..

''కోయంబత్తూరులో తక్కువ ధరలకే నాణ్యమయిన దుస్తులు దొరుకుతాయి. హోల్ సేల్ గా ఫ్యాక్టరీ నుండి కొందాము"

''ఛీ.. చీప్ బట్టలు .. నేను పీటర్ ఇంగ్లాండ్ కు తగ్గేదెలా"

ఏమి దాని స్పెసిలిటీ..?

''వాటిని ఇంగ్లాండ్ లో కింగ్ ఇంటి పక్కనే తయారు చేస్తారు"

అందరూ తెలుసుకోవాల్సిన విషయాలు

1. ఫ్రెంచ్ ఫ్రైస్ ను ఫ్రాన్స్ లో ఆ ఈపిల్ పిల్ టవర్ పైన తయారు చేసి ఇక్కడికి పంపుతారు.

2. ఢిల్లీ స్కూల్ అంటే ఢిల్లీ వారిది.

3. టాటా స్కూల్ అంటే స్వయంగా టాటా నడుపుతాడు.

4. అమెరికా లో ఒక సందు పేరుతొ వచ్చిన స్కూల్ అమెరికా వాళ్ళది.

పోస్ట్ లో నీతి :

డిజిటల్ డిప్పగాళ్లకు చిన్న మెదడు చితికి పోయింది. వారిని బుట్టలో పెట్టడానికి ఆస్తులు దోచెయ్యడానికి సవా లక్ష ప్లాన్స్ తో బడా వ్యాపారులు

About the Author

AV
Amarnath Vasireddy
వాసిరెడ్డి అమర్‌ నాథ్‌ ప్రముఖ విద్యావేత్త. తన విద్యా సంస్థలతో వేలాది మంది IAS, IPS, గ్రూప్-Iతో పాటు ఇతర ప్రభుత్వ అధికారులను దేశానికి అందించారు. విద్యవేత్తగా, మీడియా విశ్లేషకుడిగా, పిల్లల మనస్తత్వవేత్తగా, మానవతావాదిగా, సంస్కరణవాదిగా, కాలమిస్ట్‌గా మంచి పేరు సంపాదించుకున్నారు. సోషియాలజీ, ఆంత్రోపాలజీలో ఎమ్‌.ఏ, ఎమ్‌ ఫిల్‌ పూర్తి చేశారు. ప్రస్తుతం అమర్ నాథ్‌ స్లేట్- ది స్కూల్‌కి ఛైర్మన్‌గా ఉంటున్నారు. ఈయన్ను Amarnath_vasireddy@yahoo.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
జీవనశైలి
విద్య
ఏషియానెట్ న్యూస్
Latest Videos
Recommended Stories
Recommended image1
Black Coffee: మీ డే బ్లాక్ కాఫీతో మొదలవుతుందా? అయితే ఈ విషయం మీకు తెలుసా?
Recommended image2
Mosquito Repellent: ఈ సింపుల్ చిట్కాలతో ఇంట్లో ఒక్క దోమ లేకుండా చేయొచ్చు!
Recommended image3
Menopause: 50 తర్వాత మహిళలు ఇవి తప్పక తినాలి, లేదంటే ఏం జరుగుతుందంటే..?
Related Stories
Recommended image1
Lifestyle: ఖ‌రీదైన ఫేస్‌వాష్‌తో ప‌నే లేదు.. మీ వంటింట్లోనే మ్యాజిక్ ఉంది
Recommended image2
Life Hacks:మీ పాత దుస్తులు పారేస్తున్నారా? వాటితోనే డబ్బు సంపాదించొచ్చు, ఎలానో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved