MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • డయాబెటీస్ పేషెంట్లకు ఈ గింజలు చాలా చాలా మంచివి.. రోజూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి

డయాబెటీస్ పేషెంట్లకు ఈ గింజలు చాలా చాలా మంచివి.. రోజూ తింటే బ్లడ్ షుగర్ లెవెల్స్ కంట్రోల్ లో ఉంటాయి

గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉండే గింజలు మధుమేహులకు ప్రయోజనకరంగా ఉంటాయి. వీటిని తినడం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గడంతో పాటుగా శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Jan 19 2023, 01:58 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
15

ప్రపంచ వ్యాప్తంగా మధుమేహుల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతోంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు మధుమేహాన్ని కొంతవరకు దూరం చేస్తాయి. డయాబెటీస్ పేషెంట్లకు గింజలు ప్రయోజనకరంగా ఉంటాయి. ఎందుకంటే వీటిలో మోనోశాచురేటెడ్, పాలీఅన్శాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్స్, విటమిన్లు, ఖనిజాలు, ఫైటోన్యూట్రియెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి బ్లడ్ షుగర్ లెవెల్స్ ను తగ్గించడమే కాదు మన ఆరోగ్యానికి ఎన్నో విధాలా మేలు చేస్తాయి. రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గడానికి మధుమేహులు ఎలాంటి ఆహారాలను తినాలో ఇప్పుడు తెలుసుకుందాం..
 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
25

బాదం పప్పు

బాదంలో ఫైబర్, విటమిన్ ఇ, మెగ్నీషియం, విటమిన్ 12తో పాటు ఎన్నో రకాల పోషకాలు పుష్కలంగా ఉంటాయి. బాదం పప్పులను రోజూ తినడం వల్ల శరీరంలో గ్లూకోజ్ లెవల్స్ రెగ్యులేట్ అవుతాయి. ఇవి ఆక్సీకరణ ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆక్సీకరణ ఒత్తిడి పెరిగితే డయాబెటిస్, గుండె జబ్బులొచ్చే ప్రమాదం ఉంది. రాత్రంతా  బాదం పప్పులను నీటిలో నానబెట్టి ఉదయాన్నే తింటే ఆరోగ్యానికి ఎంతో మంచిది. 
 

35

పిస్తా

పిస్తాపప్పుల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ తక్కువగా ఉంటుంది. పిస్తా పప్పులను టైప్ 2 డయాబెటిస్ పేషెంట్లు తినడం వల్ల వారి గ్లైసెమిక్ స్థితి మెరుగుపడుతుంది. పిస్తా అధికంగా ఉండే మధ్యధరా ఆహారం గ్లూకోజ్ స్థాయిలు, తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ కొలెస్ట్రాల్, మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను మెరుగుపరుస్తుంది.
 

45
cashew

cashew

జీడిపప్పు

జీడిపప్పులో యాంటీ డయాబెటిస్ లక్షణాలు ఉంటాయి. జీడిపప్పులో కొవ్వు పరిమాణం కొంతవరకు ఎక్కువగా ఉన్నప్పటికీ.. ఇందులో చాలావరకు మంచి కొవ్వులే ఉంటాయి. మధుమేహ వ్యాధిగ్రస్తులకు ఇది ఆరోగ్యకరమైన ఆహారం. జీడిపప్పును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది. మంచి కొలెస్ట్రాల్ (హెచ్డిఎల్) పెరుగుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది. అంతేకాదు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించడానికి కూడా ఈ పప్పు సహాయపడుతుంది.

55

వాల్ నట్

వాల్ నట్స్ లో ప్రోటీన్లు, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వులు పుష్కలంగా ఉంటాయి. వాల్ నట్స్ లో ఉండే అసంతృప్త కొవ్వు ఆమ్లాలు (మోనోశాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు, పాలీఅన్ శాచురేటెడ్ కొవ్వు ఆమ్లాలు) గ్లూకోజ్ నియంత్రణలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ఆకలిని తగ్గించడానికి కూడా సహాయపడతాయి. అంటే వీటిని తింటే బరువు కూడా తగ్గుతారు. 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
స్లీప్ టూరిజం అంటే ఏమిటి? ఇండియాలో ఇందుకు పర్ఫెక్ట్ ప్లేసెస్ ఏవి?
Recommended image2
Coconut Sprout: కొబ్బరికాయ పువ్వు ఎప్పుడైనా తిన్నారా? తింటే ఏమౌతుంది?
Recommended image3
Jowar Roti: 30 రోజులు అన్నం మానేసి జొన్న రొట్టె తింటే ఏమవుతుందో తెలుసా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved