MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • చిన్న వయసులో డయాబెటీస్ రావడానికి కారణం ఇదే..

చిన్న వయసులో డయాబెటీస్ రావడానికి కారణం ఇదే..

చాలా చిన్నవయసులో డయాబెటీస్ రావడానికి ప్రధాన కారణం ఊబకాయం. అలాగే జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, చక్కెర, కొవ్వులు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం వల్ల కూడా వస్తుంది. అన్నింటికీ మించి శారీరక శ్రమ లేకపోవడం వల్ల షుగర వ్యాధి వచ్చే ప్రమాదం పెరుగుతుంది.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Nov 08 2022, 10:51 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
diabetes

diabetes

ప్రపంచవ్యాప్తంగా మధుమేహంతో బాధపడుతున్న యువత సంఖ్య రోజు రోజుకు పరిగిపోతూనే ఉంది. ఈ డయాబెటీస్ ఈ కాలంలో సర్వ సాధారణ సమస్యగా మారిపోయింది.  2016-17లో 1,20,000 నుంచి 2020-21 నాటికి 1,48,000కు చేరుకున్న 40 ఏళ్లలోపు వారి సంఖ్య 23 శాతానికి పెరిగిందని డయాబెటిస్ యూకే డేటా తెలిపింది. 40 ఏళ్లు పైబడిన వారి కంటే యువతలో మధుమేహుల పేషెంట్ల సంఖ్య మరింత వేగంగా పెరుగుతుందని ఇది సూచిస్తుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28
diabetes

diabetes

అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ఊబకాయం, జీవన శైలి సరిగ్గా లేకపోవడం వంటి కారణాల వల్లే మధుమేహుల సంఖ్య పెరిగిపోతోందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ టైప్ 2 డయబెటీస్ 40 ఏండ్ల కంటే ముందే వస్తుంది. సాధారణంగా ఈ వ్యాధి మధ్యవయస్కుల్లో లేదా వృద్ధులకే ఎక్కువగా వస్తుంది. అయితే ఇది పిల్లలు, కౌమారులు,  20 నుంచి 30 ఏండ్ల వారికి కూడా వచ్చే అవకాశం కూడా ఉంది. దీని లక్షణాలు మొదట్లోనే గుర్తిస్తే.. దీన్ని చాలా వరకు కంట్రోల్ లో ఉంచొచ్చు. 

38

టైప్ 2 డయాబెటిస్ వల్ల అధిక దాహం, తరచుగా మూత్రవిసర్జన, అలసట, పాదాల్లో తిమ్మిరి, దృష్టి లోపాలు, చూపు మసకబారడం వంటి సమస్యలు వస్తాయి. చిన్నవయసులోనే మధుమేహం రావడానికి ఊబకాయం ప్రధాన కారణమంటున్నారు నిపుణులు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లు, ముఖ్యంగా జంక్ ఫుడ్, ఫాస్ట్ ఫుడ్, అధిక కేలరీలు, చక్కెర, కొవ్వు వంటి ఆహారాలను తినడం, శారీరక శ్రమ లేకపోవడం వల్ల ఊబకాయం వస్తుంది. ఇకపోతే చిన్న వయసులోనే మధుమేహం రావడానికి ఒత్తిడి కూడా మరో కారణమంటున్నారు నిపుణులు.
 

48
diabetes

diabetes

సరైన జీవనశైలితో మధుమేహాన్ని నివారించొచ్చు. ఆరోగ్యకరమైన ఆహారం తినడం, కార్బోహైడ్రేట్లను తగ్గించడం, మొత్తం కేలరీలను తీసుకోవడం తగ్గించడం వల్ల డయాబెటీస్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చు. అలాగే క్రమం తప్పకుండా వ్యాయామం చేయాలి. బరువును నియంత్రణలో ఉంచుకోవాలి. యోగా, ప్రాణాయామం, ధ్యానం వంటివి ఒత్తిడిని తగ్గించడమే కాదు వేళకు నిద్రపోవడానికి కూడా సహాయపడతాయి. 
 

58

టైప్ 2 డయాబెటిస్ ను నివారించే మార్గాలు

వ్యాయామం చేయాలి

టెప్ 2 మధుమేహాన్ని నియంత్రించడానికి వ్యాయామం చాలా ముఖ్యం. కానీ బిజీ బిజీ షెడ్యూల్స్, ఇతర కారణాల వల్ల మనలో చాలా మంది వ్యాయామం అసలే చేయరు. కానీ మధుమేహాన్ని నియంత్రించడాకి, దీనినుంచి తప్పించుకోవడానికి ఫాస్ట్ వాకింగ్, గార్డెనింగ్, యోగా, డ్యాన్స్ ప్రాక్టీస్ వంటివి  చేయండి. ఇవి మీకు మంచి ప్రయోజననకరంగా ఉంటాయి. ఆరోగ్యకరమైన ఆహారాన్ని తింటే టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం తగ్గుతుంది. 
 

 

68
smoking

smoking

స్మోకింగ్

నికోటిన్ రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతుంది. అందుకే స్మోకింగ్ చేసే వారికి పక్కాగా డయాబెటీస్ వచ్చే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. అందులోనూ వీరి రక్తంలో చక్కెర స్థాయిలు ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయి. అందుకే స్మోకింగ్ అలవాటును మానుకోవడం చాలా ముఖ్యం.
 

78
stress

stress

ఒత్తిడి

మధుమేహం కేవలం ఒత్తిడి వల్ల మాత్రమే రాదు. కానీ ఒత్తిడి, టైప్ 2 డయాబెటిస్ ప్రమాదం మధ్య సంబంధం ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అధిక స్థాయి ఒత్తిడి హార్మోన్లు క్లోమంలోని ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలు సరిగ్గా పనిచేయకుండా ఆపుతాయి. అలాగే అవి ఉత్పత్తి చేసే ఇన్సులిన్ మొత్తాన్ని కూడా తగ్గిస్తాయని పరిశోధకులు చెబుతున్నారు.
 

88
less sleep

less sleep

తక్కువ నిద్ర

డయాబెటిస్ ఉన్నవారిలో కొంతమందికి విపరీతమైన నిద్ర వస్తుంటుంది. మరికొందరికి అసలే నిద్ర రాదు. కానీ నిద్ర అతిగా పోయినా ప్రాబ్లమే.. తక్కువగా పడుకున్నా ప్రాబ్లమే. తక్కువ నిద్ర డయాబెటీస్ కు దారితీస్తుంది. అందుకే టైం ప్రకారమే నిద్రపోయేలా చూసుకోండి. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Travel Tips: కారు, బస్సు ప్రయాణం పడడం లేదా? వాంతులు అవుతుంటే ఈ చిన్న పని చేయండి
Recommended image2
Mangalsutra Bracelet: నేటి మగువల మనసు దోచే మంగళసూత్ర బ్రేస్‌లెట్స్
Recommended image3
Butterfly Rings: ఒక్కసారైనా ఈ బ్యూటిఫుల్ బటర్ ఫ్లై రింగ్స్ ట్రై చేయాలి
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved