MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • ఇంతకి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగొచ్చా? లేదా?

ఇంతకి షుగర్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగొచ్చా? లేదా?

డయాబెటీస్ పేషెంట్లు తీపి పదార్థాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి. అయితే కొబ్బరి నీళ్లు కూడా కొంచెం తియ్యగానే ఉంటాయి. అందుకే వీటిని తాగకూడదని అంటుంటారు. మరి దీనిపై నిపుణులు ఏమంటున్నారో తెలుసుకుందాం పదండి.  

2 Min read
Author : Mahesh Rajamoni
Published : Oct 02 2022, 09:59 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
18
coconut water

coconut water

ఎండాకాలం వచ్చిందంటే చాలు రోజూ కొబ్బరి నీళ్లను ఇష్టంగా తాగేవారు చాలా మందే ఉన్నారు. నిజానికి కొబ్బరి నీళ్లు మన ఆరోగ్యానికి చాలా మంచివి. దీనిలో సహజ  చక్కెర ఉంటుంది. అందుకే కొద్దిగా తియ్యగా ఉంటాయి. తియ్యగా ఉంటాయని  కొబ్బరి నీళ్లను తాగకుండా దూరంపెడుతుంటారు కొంతమంది డయాబెటీస్ పేషెంట్లు. కొబ్బరి నీళ్లను తాగితే నిజంగా రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతయా? లేదా? అన్న విషయాలను తెలుసుకుందాం పదండి. 

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
28

కొబ్బరి నీళ్లు మన  ఆరోగ్యానికి ఔషదంతో సమానం. దీనిలో కేలరీలు చాలా తక్కువ మొత్తంలో ఉంటాయి. అధిక బరువు, ఊబకాయం, కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించడానికి ఈ నీళ్లు మెడిసిన్ లా పనిచేస్తాయి. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల బాడీ హైడ్రేట్ గా ఉంటుంది. వడదెబ్బ నుంచి రక్షిస్తుంది. కొబ్బరి నీళ్లను తాగడం వల్ల శరీరంలో నీటి కొరత ఏర్పడే అవకాశమే ఉండదు. మన శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే ఎన్నో ప్రయోజనకరమైన పోషకాలుంటాయి కొబ్బరి నీళ్లలో. 
 

38

కొబ్బరి నీళ్లను రెగ్యులర్ తాగే వారిలో ఎలక్ట్రోలైట్ అసమతుల్యత ఉండనే ఉండదని ఎన్నో పరిశోధనలు, అధ్యయనాలు నిరూపించాయి. ఈ ఎలక్ట్రోలైట్ల ద్వారే మన శరీరానికి శక్తి అందుతుంది. 
 

48

ఈ కొబ్బరి నీళ్లు హైబీపీ పేషెంట్లకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. రోజూ కొబ్బరి నీళ్లను తాగడం వల్ల అధిక రక్తపోటు కంట్రోల్ లో ఉంటుంది. ఈ వాటర్ లో పుష్కలంగా ఉండే పొటాషియం రక్తపోటును నార్మల్ గా ఉండేట్టు చూస్తుంది.
 

58

కొబ్బరి నీళ్లను తాగడం వల్ల స్ట్రోక్, గుండె పోటు ప్రమాదాలు చాలా వరకు తగ్గుతాయి. అలాగే శరీరంలో ట్రై గ్లిజరైజ్, కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. 

68

ఒక కప్పు కొబ్బరి నీళ్లలో కేవలం 46 కేలరీలు మాత్రమే ఉంటాయి. ఈ నీళ్లను రోజుకు రెండు మూడు సార్లు తాగితే సులువుగా బరువు తగ్గుతారు. నిజానికి కొకొనట్ వాటర్ లో కార్భోహైడ్రేట్లు, షుగర్ కంటెంట్ చాలా తక్కువగా ఉంటాయి. కొబ్బరి నీళ్లు జీవక్రియ రేటును పెంచుతాయి. ఈ పానీయం బరువు తగ్గేందుకు బెస్ట్ అనే చెప్పాలి. 
 

78

కొబ్బరి నీళ్లు మన రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. కోవిడ్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తప్పకుండా తాగాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎందుకంటే కొబ్బరి నీళ్లు వారిలో ఇమ్యూనిటీ పవర్ ను పెంచి.. కోవిడ్ నుంచి త్వరగా కోలుకోవడానికి సహాయపడతాయి. 
 

88


మధుమేహులు కొబ్బరి నీళ్లను తాగొచ్చా? లేదా? 

కొబ్బరి నీళ్లలో సహజ చక్కెర ఉంటుంది. అందుకే ఇవి కొద్దిగా తీయగా ఉంటాయి. అందుకే కొంతమంది డయాబెటీస్ పేషెంట్లు కొబ్బరి నీళ్లను తాగరు. ఎక్కడ ఈ నీళ్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయో అని. గ్రేటర్ నోయిడాలోని జీఐఎంఎస్ హాస్పటల్ లో పనిచేస్తున్న ప్రముఖ డైటీషియన్ డాక్టర్ ఆయుషి యాదవ్ జీ న్యూస్ తో ఇలా అన్నారు.. నిజానికి కొబ్బరి నీళ్లు మధుమేహులకు చాలా మంచివి. ఇవి వారి రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయిట. ఈ విషయం జంతువులపై చేసిన పరిశోధనలో వెల్లడైందని తెలిపారు. కొబ్బరి నీళ్లలో గ్లైసెమిక్ ఇండెక్స్ 55 కంటే తక్కువగా ఉంటుంది. కాబట్టి ఇవి మధుహులకు ఎలాంటి హాని కలిగించవు. డాక్టర్ సలహాతీసుకుని మధుమేహులు కొబ్బరి నీళ్లను తాగొచ్చు. 
 

About the Author

MR
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు.
ఆరోగ్యం
జీవనశైలి
Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Rings: కేవలం ఒక్క గ్రాములో గోల్డ్ రింగ్ డిజైన్లు
Recommended image2
Kundan Jewellery: చోకర్ నుంచి మంగళసూత్రం వరకు కుందన్ కలెక్షన్ అదిరింది
Recommended image3
Pearl Bangles: చేతులకే వన్నె తెచ్చే ముత్యాల గాజులు...కొనకుండా ఉండలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved