MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today Rasi Phalalu
IMD Weather Forecast
Bigg Boss Agnipariksha 2
Kavya Maran-Anirudh Wedding
Hyderabad TSRTC Bus Routes
Donald Trump Strait of Hormuz
India Skills Report
KL Rahul Love Story
India Geographic Extent
Rocking Star Yash
Agadha Movie 4 Days Collection
Telangana Food Safety
VAS vs Makutam Box Office
Yashasvi Jaiswal
Korean Kanakaraju Collections
  • Home
  • Life
  • Cuddle Therapy: వెచ్చని కౌగిలి, మనసు విప్పి మాట్లాడే మనిషి కావాలా? రూ.5వేలు ఇస్తే.. మీ పక్కనే వాలిపోతారు..!

Cuddle Therapy: వెచ్చని కౌగిలి, మనసు విప్పి మాట్లాడే మనిషి కావాలా? రూ.5వేలు ఇస్తే.. మీ పక్కనే వాలిపోతారు..!

Cuddle Therapy: ప్రస్తుతం అందరి జీవితాలు యాంత్రికంగా మారిపోయాయి. మనసు విప్పి మాట్లాడుకోవడానికి, బాధను పంచుకోవడానికి తమకంటూ ఎవరూ లేరని ఫీలయ్యేవారు చాలా మంది ఉంటారు. ఇక నుంచి ఆ బాధ లేదు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 17 2026, 04:51 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Cuddle
Image Credit : Getty

Cuddle

ఈ రోజుల్లో దాదాపు అందరూ రాత్రి, పగలు అని తేడా లేకుండా పనితోనే సమయం గడుపుతున్నారు. ఫోన్ లో కాంటాక్ట్ లిస్ట్ ఎంత పొడవుగా ఉన్నా, సోషల్ మీడియాలో ఫ్రెండ్స్ జాబితా వేలల్లో ఉన్నా, కాసేపు ప్రేమగా మాట్లాడుకోవడానికి, మనసులో బాధను పంచుకోవడానికి, ఆత్మీయంగా ఆలింగనం చేసుకోవడానికి ఎవరూ లేరని ఒంటరిగా ఫీలయ్యే వారు చాలా మంది ఉన్నారు. అయితే.. ఇప్పుడు ఈ బాధను తాము తీరుస్తామని ముందుకు వచ్చిందే.. ఈ Cuddle Therapy. విదేశాల్లో మాత్రమే అందుబాటులో ఉండే.. ఈ ట్రెండ్.. ఇప్పుడు మన దేశంలోనూ అడుగుపెట్టింది. అది కూడా మన బెంగళూరులోనే.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
Cuddle Therapy అంటే ఏంటి..?
Image Credit : Getty

Cuddle Therapy అంటే ఏంటి..?

ఈ థెరపీ అర్థమేంటి అంటే.. ఇది ఒక రకమైన ప్లాటోనిక్ టచ్ థెరపీ. అంటే.. ఇది పూర్తిగా లైంగికేతర, స్నేహ పూర్వక టచ్ థెరపీ. ఇందులో శిక్షణ పొందిన కడలర్ లేదా థెరపిస్ట్ క్లయింట్ తో సమయం గడపొచ్చు. అంటే.. వారితో గంట నుంచి 4 గంటల వరకు సమయం గడపొచ్చు. ఆ సమయంలో వారు మీ చెయ్యి పట్టుకుంటారు. మీ పక్కనే కూర్చోని మాట్లాడతారు. ఆత్మీయంగా కౌగిలించుకుంటారు. మీరు మీ మనసులో ఎలాంటి బాధ ఉన్నా వారితో పంచుకోవచ్చు. మీరు మీ తలను వారి భుజంపై వాల్చుకొని సేదతీరొచ్చు. సంతోషం, బాధ ఎదైనా వారితో పంచుకోవచ్చు.

అయితే.. దీని కంటూ కొన్ని నియమాలు ఫాలో అవ్వాలి. ఈ కడలర్ ని ఎంపిక చేసుకున్న వారు వారితో గడిపే సమయంలో.. పూర్తిగా దుస్తులు ధరించాలి. పరస్పర ఏకాభిప్రాయంతో ఉండాలి. ముద్దు, లైంగిక స్పర్శకు పూర్తిగా నిషిద్ధం.

ఢిల్లీ, ముంబయి, బెంగళూరు వంటి నగరాల్లో ఈ ట్రెండ్ విపరీతంగా ఆకట్టుకుంటోంది. 3నుంచి 4 గంటల సమయం మీరు వారితో గడపొచ్చు. అందుకోసం రూ.5వేల వరకు చెల్లించాల్సి ఉంటుంది. 'Cuddlist.com' వంటి గ్లోబల్ ప్లాట్‌ఫామ్‌లలో సర్టిఫైడ్ థెరపిస్టులు అందుబాటులో ఉన్నారు.

Related Articles

Related image1
Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?
Related image2
Gen Z Vs 90's : ఈ జనరేషన్ పిల్లలకు తెలివితేటలు ఉండటం లేదా? సర్వేలు ఏమంటున్నాయి?
33
 ఇది ఎలా పని చేస్తుంది?
Image Credit : Getty

ఇది ఎలా పని చేస్తుంది?

సమ్మతి, నియమాలు: సెషన్ ప్రారంభమయ్యే ముందు రెండు పార్టీలు నియమాలను అంగీకరించాలి. ఎవరైనా ఎప్పుడైనా సెషన్‌ను ఆపవచ్చు.

భద్రత: ఇద్దరి బ్యాగ్రౌండ్ పూర్తిగా వెరిఫై చేస్తారు. ఇద్దరి వయసు కనీసం 18 ఏళ్లు నిండి ఉండాలి.

హార్మోన్ల ప్రభావాలు: మానవ స్పర్శ శరీరంలో 'ఆక్సిటోసిన్' అనే హార్మోన్‌ను విడుదల చేస్తుంది. దీనిని 'మంచి అనుభూతి' హార్మోన్ అంటారు. ఇది ఒత్తిడిని తగ్గిస్తుంది. మంచి నిద్రకు సహాయపడుతుంది.

మన దేశంలో ఈ ట్రెండ్ ఇంకా కొత్త అనే చెప్పాలి. కొంతమంది దీనిని 'డేటింగ్' అని తప్పుగా భావిస్తారు. కాబట్టి 'కో-పార్టనర్' వంటి ప్లాట్‌ఫారమ్‌లు ఇది కేవలం వృత్తిపరమైన సేవ అని స్పష్టం చేస్తున్నాయి. ప్రతిరోజూ వేలాది మంది ఇక్కడ నమోదు చేసుకుంటున్నారు. వారిలో ఎక్కువ మంది 32-35 సంవత్సరాల వయస్సు గలవారు ఉండటం గమనార్హం.

ప్రయోజనాలు:

ఒంటరితనం నుండి ఉపశమనం. ఆందోళన, ఒత్తిడి , భావోద్వేగ అలసట తగ్గింపు.

తీసుకోవాల్సిన జాగ్రత్తలు...

ఇలాంటి ట్రెండ్ల విషయంలో జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే, ఇది తాత్కాలిక పరిష్కారం కావచ్చు, నిజమైన సంబంధాలకు ప్రత్యామ్నాయం కాదు. దానిపై అతిగా ఆధారపడటం ఒంటరితనాన్ని మరింత పెంచుతుంది. భారతదేశంలో నకిలీ వెబ్‌సైట్‌ల ముప్పు ఉంది, ముఖ్యంగా మహిళలకు భద్రతా ప్రమాదాన్ని కలిగిస్తుంది. అంతేకాదు.. మీకు ఏదైనా కష్టం, బాధ వస్తే.. మీ కుటుంబ సభ్యులు, స్నేహితులతో వాటిని పంచుకోవడానికి ప్రయత్నించాలి అని నిపుణులు అంటున్నారు.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
వంటింట్లో స్టవ్ పక్కనే సింక్ ఉండొచ్చా? వాస్తు నిపుణులు ఏం చెబుతున్నారు?
Recommended image2
వాషింగ్ మెషీన్లో దుస్తులు ఉతికేటప్పుడు ఈ 7 తప్పులు చేస్తే మెషీన్ పోతుంది
Recommended image3
Potato Face Pack: బంగాళదుంప ఫేస్ ప్యాక్ తో ముఖంపై నల్లమచ్చలు మాయం!
Related Stories
Recommended image1
Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?
Recommended image2
Gen Z Vs 90's : ఈ జనరేషన్ పిల్లలకు తెలివితేటలు ఉండటం లేదా? సర్వేలు ఏమంటున్నాయి?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved