MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Gen Z Vs 90's : ఈ జనరేషన్ పిల్లలకు తెలివితేటలు ఉండటం లేదా? సర్వేలు ఏమంటున్నాయి?

Gen Z Vs 90's : ఈ జనరేషన్ పిల్లలకు తెలివితేటలు ఉండటం లేదా? సర్వేలు ఏమంటున్నాయి?

 Gen Z Vs 90's : పాత జనరేషన్ వాళ్లతో పోలిస్తే.. కొత్త జనరేషన్ వాళ్లకి ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉండాలి. కానీ, ప్రస్తుతం ఈ విషయంలో సీన్ రివర్స్ అయ్యిందని సర్వేలు చెబుతున్నాయి. 

2 Min read
Author : ramya Sridhar
Published : Feb 17 2026, 02:03 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
Gen Z IQ
Image Credit : freepik

Gen Z IQ

ప్రతి పేరెంట్స్ తమ పిల్లలకు తెలివితేటలు ఎక్కువగా ఉండాలని కోరుకుంటారు. మనిషి తెలివి తేటలను ఐక్యూ ఆధారంగా కొలుస్తారు. నిజానికి.. పాత జనరేషన్ తో పోలిస్తే.. కొత్త జనరేషన్ కి ఐక్యూ లెవల్స్ ఎక్కువగా ఉంటాయి. కానీ జెన్ జీ పిల్లల విషయంలో మాత్రం అలా లేదని నిపుణులు చెబుతున్నారు. దాదాపు ఒక శతాబ్దం(వందేళ్లు) పాటు మానవుల ఐక్యూ ప్రతి దశాబ్దానికి సగటున 3 పాయింట్లు పెరుగుతూ వచ్చింది. కానీ, ఇటీవల అధ్యయనాల ప్రకారం, 1990ల తర్వాత పుట్టిన వారిలో ఈ గ్రాఫ్ కిందకు పడిపోతోంది. ముఖ్యంగా జెన్ జీ, జెన్ ఆల్ఫా పిల్లలకు ఐక్యూ పెరగకపోగా, తగ్గిపోయినట్లు తేలడం గమనార్హం. దీని వెనక గల కారణాలు ఏంటో చూద్దాం....

24
IQ తగ్గిపోవడానికి కారణం ఏంటి?
Image Credit : Getty

IQ తగ్గిపోవడానికి కారణం ఏంటి?

1.ప్రధాన కారణం.. డిజిటల్ వ్యసనం ( Screen Time)

నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఈ జెన్ జీ పిల్లలు పుస్తకాలు చదవడం తగ్గించి, స్మార్ట్ ఫోన్ లు, ట్యాబ్లెట్స్ లకు ఎక్కువ సమయం కేటాయిస్తున్నారు. ముఖ్యంగా షార్ట్ వీడియోలు( రీల్స్, షార్ట్స్) చూడటం వల్ల పిల్లల్లో ఏకాగ్రత తగ్గిపోతోంది. ఇది ఆలోచనా సామర్థ్యాన్ని దెబ్బతీస్తోంది.

2.మారిపోయిన విద్య విధానం...

గతంలో పిల్లలు లాజిక్, గణితం, భాషపై పట్టు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు పిల్లలు కేవలం ఏది కావాలన్నా ఇంటర్నెట్ లో ఆన్సర్ వెతకడంపై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. మెదడు పెట్టి ఆలోచించడం లేదు. ఈజీగా ఆన్సర్ దొరుకుతుందని.. గూగుల్ లో వెతుకుతున్నారు.దీని వల్ల మెదడుకు పని తగ్గిపోతోంది. దీని వల్ల ఈ కాలం పిల్లలకు ప్రాబ్లం సాల్వింగ్ స్కిల్స్ తగ్గిపోతున్నాయి.

3. పోషకాహార లోపం , జీవనశైలి

ఆధునిక కాలంలో జంక్ ఫుడ్ వినియోగం పెరగడం కూడా ఒక కారణమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ప్రభావం: మెదడు ఎదుగుదలకు కావాల్సిన ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ , ఇతర పోషకాలు అందకపోవడం వల్ల పిల్లల తెలివితేటలు తగ్గిపోతున్నాయి.

4. పర్యావరణ కాలుష్యం

గాలి , నీటిలో పెరుగుతున్న సీసం , ఇతర రసాయనాల ప్రభావం వల్ల చిన్న పిల్లల మెదడు అభివృద్ధి మందగిస్తోందని కొన్ని పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి.

Related Articles

Related image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Related image2
Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?
34
నిపుణులు ఏమంటున్నారు?
Image Credit : Pinterest

నిపుణులు ఏమంటున్నారు?

ఇది కేవలం పిల్లల తప్పు మాత్రమే కాదు. మనం వారికి అందిస్తున్న పరిసరాలు, విద్యా విధానం , సాంకేతికత వారి సహజమైన తెలివి తేటలను తగ్గిస్తున్నాయి. అయితే, వారు డిజిటల్ విషయాల్లో చాలా వేగంగా ఉన్నప్పటికీ, ఫండమెంటల్ లాజిక్ లో వెనుకపడిపోతున్నారు.

44
మరి, పిల్లల్లో ఐక్యూ లెవల్స్ పెరగాలంటే ఏం చేయాలి..?
Image Credit : Getty

మరి, పిల్లల్లో ఐక్యూ లెవల్స్ పెరగాలంటే ఏం చేయాలి..?

రీడింగ్ హ్యాబిట్: రోజుకు కనీసం 30 నిమిషాలు పుస్తకాలు చదివించడం అలవాటు చేయాలి.

స్క్రీన్ టైమ్ నియంత్రణ: గ్యాడ్జెట్స్ వాడకాన్ని పరిమితం చేయాలి.

శారీరక ఆటలు: అవుట్‌డోర్ గేమ్స్ ఆడటం వల్ల మెదడుకు రక్తప్రసరణ పెరిగి చురుగ్గా మారుతుంది.

పజిల్స్: సుడోకు, రూబిక్స్ క్యూబ్ వంటి మెదడుకు పదును పెట్టే ఆటలను ప్రోత్సహించాలి.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
చిన్నారుల సంరక్షణ
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Gold Pendant: అరగ్రాము బంగారంలో క్యూట్ లాకెట్స్
Recommended image2
Silver Toe Rings: అదిరిపోయే స్టోన్ వర్క్ వెండి మెట్టెలు
Recommended image3
Petal Earrings: కలర్‌ఫుల్‌గా పెటల్ ఇయర్ రింగ్స్ డిజైన్లు
Related Stories
Recommended image1
Modern Parenting : 9 ఏళ్లు దాటిన పిల్లలకు తల్లి ఎలాంటి విషయాలు నేర్పించాలో తెలుసా?
Recommended image2
Child Psychology: పిల్లల ముందు తండ్రి మద్యం తాగితే ఏమౌతుంది?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved