Bottle Craft: పైసా ఖర్చు లేకుండా కాస్త క్రియేటివిటీతో అదిరిపోయే డెకరేటివ్ ఐటమ్స్
Bottle Craft: మీ ఇంట్లో ఖాళీగా ఉన్న ప్లాస్టిక్ లేదా గాజు సీసాలను పాతవని పడేస్తున్నారా? కాస్త క్రియేటివిటీ వాడితే అవే మీ ఇంటికి రాయల్ లుక్ తెచ్చే లగ్జరీ ఫ్లవర్ వాజ్‌లుగా మార్చేయొచ్చు. తక్కువ ఖర్చులోనే మేకోవర్ చేసేయొచ్చు.

కాదేది కళకు అనర్హం
కాదేది కళకు అనర్హం. ఇంటిని అందంగా అలంకరించుకోవడానికి వేల రూపాయలు ఖర్చు చేయాల్సిన పనిలేదు. పనికిరావని పారేసిన వస్తువులతోనే డెకరేటివ్ ఐటమ్స్ తయారు చేయొచ్చు. మీ లివింగ్ రూమ్‌ని ఒక లగ్జరీ కేఫ్ లాగా మార్చేయడానికి ఈ సింపుల్ బాటిల్ డెకర్ ఐడియాస్ ట్రై చేయండి.
అదిరిపోయే ఫ్లవర్ వాజ్‍లు
కోక్ బాటిల్‌తో వాజ్: మీ లివింగ్ రూమ్ కోసం ఏదైనా కూల్ డ్రింక్ బాటిల్‌తో ఈ ఫొటోలో చూపిన వాజ్‌ను తయారు చేయొచ్చు. ముందుగా బాటిల్ చుట్టూ పుట్టీ లేదా క్లేతో మందపాటి పూత వేసి, కూజా ఆకారం ఇవ్వాలి. అది ఆరిపోయాక, సాండ్‌పేపర్‌తో నునుపుగా చేయాలి. తర్వాత క్లేతో చిన్న చిన్న గులాబీలు, ఆకులు చేసి వాజ్‌పై అతికించాలి.
జనపనార బాటిల్ వాజ్: ఎక్కువ కష్టపడాలనుకోకపోతే, ఏదైనా పాత ప్లాస్టిక్ బాటిల్ కింద గ్లూ గన్ సహాయంతో జనపనార తాడును అంటించండి. నెమ్మదిగా బాటిల్ మొత్తం చుట్టేయండి. గ్లూ ఆరిన తర్వాత, దానిపై తెల్ల రంగు పెయింట్‌తో పువ్వులు, ఆకులు లేదా మీకు నచ్చిన కార్టూన్ బొమ్మ వేసి లుక్‌ను పూర్తి చేయండి.
అద్భుతమైన పెయింటింగ్ డిజైన్లతో
బాటిల్ ఆర్ట్ వాజ్: మీకు పెయింటింగ్ బాగా వస్తే, పాత బాటిళ్లపై రంగులు వేసి వాటిని మరింత ప్రత్యేకంగా మార్చవచ్చు. ఈ ఫొటోలో నాలుగు రకాల పెయింటింగ్ డిజైన్లు ఉన్నాయి. ఇవి పాత ప్లాస్టిక్ లేదా గాజు సీసాలకు అద్భుతమైన అందాన్ని ఇస్తాయి.
అద్దాలు అతికిస్తే అదిరిపోయే లుక్
మిర్రర్ వర్క్ బాటిల్ వాజ్: మీకు ఆర్ట్ & క్రాఫ్ట్ అంటే ఇష్టమైతే, ఏ ప్లాస్టిక్ బాటిల్‌నైనా ఇలా అలంకరించవచ్చు. ముందుగా బాటిల్‌కు గ్రే కలర్ పెయింట్ వేయండి. ఇప్పుడు దానిపై గులాబీ రంగు మోల్డింగ్ క్లేతో తీగలు లేదా ఆకులు చేయండి. మధ్యలో చిన్న చిన్న అద్దాలు అతికిస్తే అదిరిపోయే లుక్ వస్తుంది. ఇలాంటి వాజ్‌లు డ్రై ఫ్లవర్స్, ఆర్టిఫిషియల్ పువ్వులకు చాలా బాగుంటాయి.
సీ-షెల్ బాటిల్ వాజ్: మీ ఇంట్లో రంగురంగుల వైన్ బాటిల్స్ ఉంటే, వాటితో అందమైన వాజ్ తయారు చేయొచ్చు. దీనికోసం బాటిల్ కింది భాగంలో రకరకాల సీ-షెల్స్, ముత్యాలు అంటించండి. మెడ దగ్గర తాడు కట్టి దానికి రస్టిక్ లుక్ ఇవ్వండి.
మొజాయిక్ మిర్రర్ వర్క్ వాజ్: గాజు లేదా ప్లాస్టిక్ బాటిల్‌పై మీరు సన్నని మొజాయిక్ మిర్రర్ ఆర్ట్ చేయవచ్చు. దీనికోసం చిన్న చిన్న అద్దం ముక్కలను ఒక జ్యామితీయ పద్ధతిలో అంటించండి. ఈ వాజ్‌లలో మీరు మనీ ప్లాంట్ లేదా ఏదైనా ఇండోర్ ప్లాంట్‌ను పెంచుకోవచ్చు.

