మీరు చీరను సెక్యూర్ చేసుకోవడానికి సేఫ్టీ పిన్ వాడుతున్నారా? ఈ సేఫ్టీ పిన్ తో అదిరిపోయే క్రాఫ్ట్స్ కూడా చేయవచ్చని మీకు తెలుసా?
సేఫ్టీ పిన్‌తో బ్రేస్‌లెట్ చేయండి
చాలా సేఫ్టీ పిన్స్ తీసుకుని, వాటికి రంగురంగుల పూసలు గుచ్చి మూసేయండి. వాటిని బ్లాక్ కలర్ దారంలో గుచ్చి క్యూట్ బ్రేస్‌లెట్ చేయండి.
పిల్లల కోసం క్యూట్ పిన్ చేయండి
పిల్లల డ్రెస్సులకు సింపుల్ సేఫ్టీ పిన్ పెట్టే బదులు, ఇలా స్మైలీ బొమ్మలు, కలర్‌ఫుల్ పూసలు పెట్టి సేఫ్టీ పిన్ రెడీ చేయొచ్చు.
సేఫ్టీ పిన్‌తో నెక్లెస్ చేయండి
చిన్న సేఫ్టీ పిన్స్ తీసుకుని, వాటికి మూడు నాలుగు చిన్న ముత్యాలు గుచ్చి, వాటిని హుక్స్‌తో కలిపి అందమైన నెక్లెస్ చేయండి.
సేఫ్టీ పిన్ ఇయర్ రింగ్స్
సేఫ్టీ పిన్‌తో మీరు హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కూడా చేసుకోవచ్చు. సేఫ్టీ పిన్‌కి గుండె ఆకారపు పూస వేసి, చుట్టూ క్రిస్టల్స్ పెట్టి పైన హుక్ తగిలించి ఇయర్ రింగ్స్ చేయండి.
సేఫ్టీ పిన్ కేప్ టాప్
పెద్ద సేఫ్టీ పిన్స్ తీసుకుని వాటిని ఒకదానితో ఒకటి కలపండి. రెండు స్ట్రాప్స్ తగిలించి కేప్ స్టైల్ టాప్ చేయండి. దీన్ని బ్లాక్ లేదా రెడ్ కలర్ ఇన్నర్‌తో వేసుకోండి.