MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Home Decor: చాక్లెట్ ర్యాపర్‌లతో ఇంటికి రాయల్ లుక్ తెచ్చే 5 ఇంటీరియర్ డిజైన్స్

Home Decor: చాక్లెట్ ర్యాపర్‌లతో ఇంటికి రాయల్ లుక్ తెచ్చే 5 ఇంటీరియర్ డిజైన్స్

Home Decor: చాక్లెట్ తిన్నాక ర్యాపర్లు పారేస్తున్నారా? ఇలా ట్రై చేస్తే పైసా ఖర్చు లేకుండా మీ ఇంటిని ఒక చిన్న ప్యాలెస్‌లా మార్చుకోవచ్చు. చాక్లెట్ కవర్లతో ఇంటికే లగ్జరీ లుక్ తీసుకువచ్చే 5 DIY ఐడియాలు ఇక్కడ ఉన్నాయి. చూసేయండి.

2 Min read
Author : Nandini Arava
Published : May 02 2026, 03:55 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
పనికిరాని వాటితోనే ఇంటికి రాయల్ లుక్
Image Credit : gemini ai

పనికిరాని వాటితోనే ఇంటికి రాయల్ లుక్

చిన్న, పెద్ద అందరికీ చాక్లెట్లు అంటే ఇష్టమే. కానీ వాటిని తిన్నాక కవర్లు పడేస్తాం. అలా కాకుండా ఆ పనికిరాని వాటితోనే ఇంటికి రాయల్ లుక్ తీసుకురావొచ్చు. ఇది పర్యావరణానికి మేలు చేయడమే కాకుండా, రీసైక్లింగ్‌కు ఒక అద్భుతమైన మార్గం. తక్కువ ఖర్చుతో మీ ఇంటికి ప్రత్యేకమైన, ఆకర్షణీయమైన లుక్ తీసుకురావడానికి ఉపయోగపడుతుంది. మీకోసం కొన్ని DIY ఐడియాస్ చూసేయండి.

24
చాక్లెట్ ర్యాపర్‌తో ఫొటో ఫ్రేమ్
Image Credit : ai generated

చాక్లెట్ ర్యాపర్‌తో ఫొటో ఫ్రేమ్

చాక్లెట్ ర్యాపర్‌తో ఫొటో ఫ్రేమ్

ఒక బ్రౌన్ కలర్ ఫొటో ఫ్రేమ్ తీసుకోండి. కార్డ్‌బోర్డ్‌పై ఆర్ట్‌పేపర్ అతికించి, దానికి పెయింట్ వేసి బేస్ తయారు చేయండి. ఇప్పుడు హాట్ గ్లూ సహాయంతో చాక్లెట్ ర్యాపర్‌ను చెట్టు ఆకారంలో అతికించండి. ఆకుల కోసం చాక్లెట్ గోల్డ్ ఫాయిల్ వాడండి. రెండు దారాలు, ఒక పుల్లతో ఊయల చేసి, దానికి మీకు నచ్చిన ర్యాపర్‌ను అతికించండి. ఇది లివింగ్ రూమ్, బెడ్‌రూమ్‌కు మోడరన్, క్రియేటివ్ లుక్ ఇస్తుంది.

యూనిక్ బాస్కెట్ డెకర్ ఐడియా

మీ దగ్గర విరిగిన ప్లాస్టిక్ లేదా చెక్క బుట్ట ఉంటే, దాన్ని కూడా చాక్లెట్ ర్యాపర్లతో అలంకరించి కస్టమైజ్డ్ లుక్ ఇవ్వొచ్చు. బుట్ట బేస్ నుంచి హ్యాండిల్ వరకు, ర్యాపర్‌ను చిన్న చిన్న ముక్కలుగా అతికించండి. పైభాగంలో గోల్డ్ రిబ్బన్, పూసలతో అలంకరిస్తే సరి. పండగల సమయంలో ఇంటి అలంకరణకు ఈ DIY ఐడియా యూజ్ ఫుల్ అవుతుంది. 

Related Articles

Related image1
Home Decor: మీ పాత చీరల‌తో ఇంటిని అందంగా మార్చేయండి.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలిసి ఉండ‌దు
Related image2
Fan: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగినా…దుమ్ము ఎందుకు కింద పడదు? ఎప్పుడైనా గమనించారా?
34
క్యాండిల్ హోల్డర్ తయారు చేయండి
Image Credit : ai generated

క్యాండిల్ హోల్డర్ తయారు చేయండి

క్యాండిల్ హోల్డర్ తయారు చేయండి

మీ దగ్గర పగిలిన గాజు గ్లాస్ ఉంటే, దాన్ని పడేయకుండా ఇలా క్యాండిల్ హోల్డర్‌గా మార్చుకోవచ్చు. ముందుగా గుండ్రటి చెక్క బేస్‌పై గ్లాసును అతికించండి. గ్లాసు లోపల కొవ్వొత్తిని పెట్టండి. గ్లాస్ అంచులకు చాక్లెట్ ర్యాపర్లను అతికించి ఆరనివ్వండి. చివరగా ముందు వైపు పూసలతో ఒక పువ్వును చేసి అతికిస్తే, మీ క్యాండిల్ హోల్డర్ రెడీ. ఇది లివింగ్ రూమ్, బాల్కనీకి కొత్త అందాన్నిస్తుంది.

ఫ్రేమ్ డెకరేషన్

ఇంట్లో చాలా పాత ఫ్రేమ్‌లు ఉంటాయి కదా. వాటికి అందమైన, క్యూట్ లుక్ ఇవ్వాలంటే ఇలా చాక్లెట్ ర్యాపర్లతో అలంకరించండి. ఫ్రేమ్ అంచులకు గోల్డెన్ ఫాయిల్‌తో చేసిన పువ్వులు అతికిస్తే వాటి అందం మరింత పెరుగుతుంది.

44
ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకే
Image Credit : ai generated

ఆర్టిఫిషియల్ ఫ్లవర్ బొకే

నిజమైన పూల బొకే కొన్ని గంటల్లోనే వాడిపోతుంది. రోజూ పూల కోసం డబ్బు ఖర్చు పెట్టే బదులు, చాక్లెట్ ర్యాపర్లతో ఇలా అందమైన బొకే తయారు చేసుకోవచ్చు. ముందుగా ర్యాపర్లను శుభ్రం చేసి, నిటారుగా ఉండేలా చూసుకోండి. సన్నని తీగ లేదా చీపురు పుల్లలతో పూల కాడలను తయారు చేయండి. చాక్లెట్ ర్యాపర్‌తో చేసిన పువ్వులను టేప్ లేదా గ్లూతో ఈ కాడలకు అతికించండి. బేస్ కోసం థర్మాకోల్ లేదా కార్డ్‌బోర్డ్‌ను ఉపయోగించవచ్చు.

About the Author

NA
Nandini Arava
6 సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2019లో ఈటీవీతో కెరీర్ ప్రారంభించారు. తర్వాత పలు తెలుగు చానెళ్లలో సబ్ ఎడిటర్ గా పనిచేశారు. ప్రస్తుతం ఏసియా నెట్ లో మల్టీమీడియా జర్నలిస్టుగా చేస్తున్నారు. ఈమె సినిమా, జీవనశైలి, తెలుగు రాష్ట్రాలకు సంబదించిన వార్తలు, విశ్లేషణలు చేయగలరు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Love Goa: విదేశీయులు గోవాను ఎందుకు ఇష్ట‌ప‌డ‌తారో తెలుసా.? 7 కార‌ణాలు ఇవే
Recommended image2
Goa Travel: గోవా అంటే మందు పార్టీలు ఒక్క‌టే కాదు బ్రో.. ఇంకా చాలా ఉంది
Recommended image3
AC : ఎండలోంచి నేరుగా ఏసీ రూమ్‌ లోకి వెళ్తున్నారా..? ఆ చల్లదనం ఎంత డేంజరో తెలుసా..?
Related Stories
Recommended image1
Home Decor: మీ పాత చీరల‌తో ఇంటిని అందంగా మార్చేయండి.. ఇన్ని రోజులు ఈ ట్రిక్ తెలిసి ఉండ‌దు
Recommended image2
Fan: ఫ్యాన్ ఫుల్ స్పీడ్‌లో తిరిగినా…దుమ్ము ఎందుకు కింద పడదు? ఎప్పుడైనా గమనించారా?
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved