Malayalam English Kannada Telugu Tamil Bangla Hindi Marathi
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • KEA 2025
  • Home
  • Life
  • అబ్బాయిలు సోంపును తింటే ఎంత మంచిదో..!

అబ్బాయిలు సోంపును తింటే ఎంత మంచిదో..!

సోంపు తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ముఖ్యంగా పురుషులు రోజూ సోంపు గింజలను తింటే ఎన్నో అనారోగ్య సమస్యలు దూరమవుతాయి.   

Mahesh Rajamoni | Published : Nov 29 2022, 11:49 AM
2 Min read
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • Google NewsFollow Us
15
Fennel seeds

Fennel seeds

సోంపు గింజల్లో ఎన్నో ఔషదగుణాలుంటాయి. ఈ గింజలు పోషకాలకు మంచి వనరు. దీనిలో విటమిన్లు, ఖనిజాలు వంటి దివ్య ఔషదగుణాలు పుష్కలంగా ఉంటాయి. సోంపులో ఐరన్, విటమిన్ సి, పొటాషియం, కాల్షియం వంటి పోషకాలు ఎక్కువ మొత్తంలో ఉంటాయి. ఈ సోంపు జీర్ణం సాఫీగా కావడానికి సహాయపడుతుంది. అలాగే దీనిలోని విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. దీన్ని తినడం వల్ల ఒక్కటేమిటీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు. అయితే ఈ సోంపు తినడం వల్ల పురుషులకు ఎంతో మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. సోంపు తినడం వల్ల అబ్బాయిలకు ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.. 

25
Asianet Image

వీర్యకణాల సంఖ్య పెరుగుతుంది

ఈ రోజుల్లో చాలా మంది పురుషులు తక్కువ స్పెర్మ్ కౌంట్ తో ఇబ్బంది పడుతున్నారు. స్పెర్మ్ కౌంట్ తక్కువగా ఉంటే పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉంటుంది. అయితే ఈ సమస్యతో బాధపడేవారికి సోంపు గింజలు మంచి మెడిసిన్ లా పనిచేస్తాయి. రోజూ సోంపు గింజలను తింటే స్పెర్మ్ కౌంట్ పెరుగుతుంది. వీర్యం నాణ్యత కూడా మెరుగుపడుతుంది. అంతేకాదు సోంపు హార్మోన్ల సమస్యలను కూడా తొలగిస్తుంది. 
 

35
sex

sex

లిబిడోను పెంచుతుంది

రోజంతా ఆఫీసుల్లో పనిచేయడం, ఇతర పనుల వల్ల అలసట, ఒత్తిడి పెరిగిపోతాయి. దీనివల్ల సెక్స్ పై కోరికలు చాలా వరకు తగ్గుతాయి. సెక్స్ కోరికలను పెంచే లిబిడో కూడా తగ్గిపోతుంది. అయితే ఇలాంటి వారు సోంపు తింటే మంచిది. సోంపు మీ శరీరంలో శక్తి స్థాయిలను పెంచుతుంది. లిబిడోను ను పెంచేందుకు సహాయపడుతుంది. దీంతో లైంగిక కోరికలు పెరుగుతాయి. 
 

45
Asianet Image

వంధ్యత్వం తొలగిపోతుంది

వంధ్యత్వ సమస్యతో బాధపడే పురుషులు కూడా చాలా మందే ఉన్నారు. దీనివల్ల ఎంతో మంది తండ్రులు కాలేకపోతున్నారు. సెక్స్ పనితీరు సరిగ్గా లేకపోవడం, అకాల స్ఖలనం వంటి సమస్యలను ఫేస్ చేసే వారు చాలా మందే ఉన్నారు. పురుషుల్లో వీర్యకణాల సంఖ్యే దీనికి ప్రధాన కారణం. అయితే పురుషులు సోంపును రోజూ తింటే వంధ్యత్వ సమస్య తొలగిపోతుంది. 
 

55
Asianet Image

సోంపును మీ రోజు వారి ఆహారంలో చేర్చుకోవచ్చు. సోంపును తినడానికి సులువైన మార్గం భోజనం చేసిన తర్వాత ఒక టీస్పూన్ సోంపును నేరుగా నమలండి. ఇది మీ జీర్ణక్రియకు సహాయపడుతుంది. దీంతో తిన్న ఆహారం సులువుగా జీర్ణం అవుతుంది. మలబద్దకం, అజీర్థి వంటి సమస్యలు తొలగిపోతాయి. 

Mahesh Rajamoni
About the Author
Mahesh Rajamoni
ప్రింట్-డిజిటల్ మీడియాలో తొమ్మిదేళ్ల అనుభవం ఉన్న జ‌ర్న‌లిస్టు రాజమోని మహేష్. సామాజిక సమస్యలు, రాజకీయాలు, సమకాలీన వార్తలు, రాజకీయ విశ్లేషణలు, క్రీడలు, జీవనశైలిపై విస్తృత క‌థ‌నాలు రాస్తుంటారు. పాలమూరు యూనివర్సిటీ నుంచి సైన్స్ డిగ్రీ, నవ తెలంగాణ జర్నలిజం కాలేజీ నుంచి జర్నలిజం విద్యను పూర్తి చేశారు. ఏటీఐ నుంచి టీచింగ్ మెథడాలజీ, కంప్యూటర్ అప్లికేషన్స్ లో సర్టిఫికేషన్. ప్రస్తుతం ఏసియా నెట్ తెలుగులో స్పోర్ట్ ఎడిటర్ గా ఉన్నారు. Read More...
ఆరోగ్యం
జీవనశైలి
 
Recommended Stories
Top Stories