మహిళలనే లక్ష్యంగా చేసుకుని వచ్చే కొన్ని సాధారణ క్యాన్సర్లు
ఆడవాళ్లు, మగవాళ్లు అంటూ తేడా లేకుండా క్యాన్సర్లు ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తాయి. ప్రపంచ వ్యాప్త మరణాల్లో క్యాన్సర్ పేషెంట్లే ఎక్కువగా ఉంటున్నారని సర్వేలు వెళ్లడిస్తున్నాయి. ప్రారంభంలో ఈ క్యాన్సర్ల ను గుర్తించకపోతే చనిపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది.

cancer
క్యాన్సర్ చిన్నపిల్లలు, యువత, పెద్దలు అంటూ ప్రతి ఒక్కరినీ ప్రభావితం చేస్తుంది. అయినప్పటికీ రొమ్ము, అండాశయం, గర్భాశయ, ఎండోమెట్రియల్ క్యాన్సర్లతో సహా కొన్ని రకాల క్యాన్సర్లు మహిళలకే ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. ఈ క్యాన్సర్లు స్త్రీల శారీరక, మానసిక ఆరోగ్యం, వారి జీవన నాణ్యతపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతాయి.
ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం.. క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మందిని ప్రభావితం చేస్తుంది. ఇది శరీరంలోని వివిధ భాగాలలో వస్తుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్, ఊపిరితిత్తుల క్యాన్సర్, అండాశయ క్యాన్సర్, గర్భాశయ క్యాన్సర్, కొలొరెక్టల్ క్యాన్సర్ తో పాటుగా ఇంకా కొన్ని రకాల క్యాన్సర్లకు మహిళలే ఎక్కువగా గురవుతారు. అవేంటంటే..
lung cancer
ఊపిరితిత్తుల క్యాన్సర్
మగవారితో పాటుగా ఆడవాళ్లు కూడా స్మోకింగ్ ను ఎక్కువగా చేస్తున్నారు. దీనివల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. మీకు తెలుసా? స్మోకింగ్ చేసే పురుషుల కంటే స్మోకింగ్ అలవాటున్న ఆడవారికే ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే ఎక్కువగా ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ధూమపానం చేయని వారిలో, మహిళలకు ఊపిరితిత్తుల క్యాన్సర్ వచ్చే అవకాశం కూడా ఉంది.
Breast Cancer
రొమ్ము క్యాన్సర్
మహిళలకు వచ్చే అత్యంత సాధారణ క్యాన్సర్లలో రొమ్ము క్యాన్సర్ ఒకటి. 8 మంది ఆడవారిలో ఒకరు దీని బారిన పడుతున్నారట. మహిళలు శారీరకంగా చురుకుగా లేకపోతే రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రుతువిరతి, స్థూలకాయులే దీనిబారిన ఎక్కువగా పడుతున్నారట. ఆరోగ్యకరమైన బరువు ఉన్న వృద్ధ మహిళలతో పోలిస్తే, అధిక బరువు లేదా ఊబకాయం ఉన్నవారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది.
colorectal cancer
కొలొరెక్టల్ క్యాన్సర్
కొలొరెక్టల్ క్యాన్సర్ ఆడవారి జీవితంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దీన్ని ముందుగానే గుర్తించడం చాలా అవసరం. క్రమం తప్పకుండా టెస్ట్ లు, సరైన చికిత్స, ఆరోగ్యకరమైన జీవనశైలితో ఆడవారు ఈ క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. మహిళలు తమ ఆరోగ్యం శ్రద్థ తీసుకోవడం, ప్రమాద కారకాలు, హెచ్చరిక సంకేతాల గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం. ఈ క్యాన్సర్లను వీలైనంత తొందరగా గుర్తించి చికిత్స తీసుకుంటే దీనినుంచి బయటపడొచ్చు.
cervical cancer
గర్భాశయ క్యాన్సర్
ఆడవారికి వచ్చే క్యాన్సర్లలో గర్భాశయ క్యాన్సర్ కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. ఇది యోని నుంచి గర్భాశయానికి ప్రవేశ ద్వారం అయిన గర్భాశయం కణాలలో సంభవిస్తుంది. ప్రతి సంవత్సరం ప్రపంచవ్యాప్తంగా 35, 45 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నఅర మిలియన్ కంటే ఎక్కువ మంది మహిళలు గర్భాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నారు. ఈ వ్యాధి 300,000 మందికి పైగా మరణాలకు దారితీస్తుంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ ను గుర్తించడం చాలా కష్టం. క్రమం తప్పకుండా స్త్రీ జననేంద్రియ పరీక్షలు చేయించుకోవడం, హెచ్పివి వ్యాక్సిన్ పొందడం, పాప్ పరీక్షలు చేయించుకోవడం, సురక్షితమైన సెక్స్ లో పాల్గొనడం వల్ల గర్భాశయ క్యాన్సర్ ప్రమాదం నుంచి తప్పించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
ovarian cancer
అండాశయ క్యాన్సర్
మహిళలకు సోకే అత్యంత సాధారణ క్యాన్సర్లలో అండాశయ క్యాన్సర్ ఐదో ప్లేస్ లో ఉంది. దీనిబారిన పడి ఎంతో మంది ఆడవారు చనిపోతున్నారు. ఎందుకంటే దీని లక్షణాలను గుర్తించడం చాలా కష్టం. అందుకే దీన్ని "నిశ్శబ్ద కిల్లర్" అని కూడా పిలుస్తారు.