Beauty Tips: కొబ్బరి నూనె వీటితో కలిపి ముఖానికి రాస్తే ఏమౌతుంది?
కొబ్బరి నూనెలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ కొబ్బరి నూనెతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల.. అనేక ప్రయోజనాలు కలుగుతాయి.

అందాన్ని పెంచుకోవాలంటే..
రోజు రోజుకీ తమ అందం పెరిగిపోవాలని, యవ్వనంగా కనిపించాలి అని, ముఖంపై ముడతలు లేకుండా అందంగా కనిపించాలని చాలా మంది కోరుకుంటారు. అయితే, అలాంటి అందం పొందాలంటే.. కేవలం ఖరీదైన క్రీముల వల్లనే సాధ్యం అవుతుంది అనే భావన చాలా మందిలో ఉంటుంది.కానీ కేవలం కొబ్బరి నూనె వాడి మన అందాన్ని రెట్టింపు చేసుకోవచ్చని మీకు తెలుసా?
కొబ్బరి నూనెతో సహజ సౌందర్యం
కొబ్బరి నూనెలో విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు, ఫ్యాటీ ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి.ఈ కొబ్బరి నూనెతో ఫేస్ మాస్క్ వేసుకోవడం వల్ల.. అనేక ప్రయోజనాలు కలుగుతాయి. అయితే అచ్చంగా కొబ్బరి నూనె కాకుండా.. అందులో మరికొన్నింటిని కలిపి కనుక రాస్తే.. ముఖంలో సహజ మెరుపు రావడమే కాకుండా, చర్మం రంగు కూడా మెరుగుపడుతుంది.
1.కొబ్బరి నూనె, తేనె మాస్క్...
1 టీస్పూన్ కొబ్బరి నూనెను 1 టీస్పూన్ ముడి తేనెతో కలపండి. ఈ రెండూ కలిపి మంచి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. ఇప్పుడు, ఈ మిశ్రమాన్ని ముఖానికి రాసి కనీసం 15 నిమిషాలు అలానే ఉంచాలి. ఆ తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. ఈ రెండూ కలిపి రాయడం వల్ల స్కిన్ మంచిగా తేమగా మారుతుంది. సహజమైన మెరుపు వస్తుంది. తేనెలో యాంటీ బాక్టీరియల్ లక్షణాలు కూడా ఉంటాయి.
కొబ్బరి నూనె , పెరుగు మాస్క్
1 టీస్పూన్ కొబ్బరి నూనెను 2 టీస్పూన్ల సాదా పెరుగుతో కలపండి. ఈ రెండూ కలిపి మంచి మిశ్రమంలా చేసుకోవాలి. ఇప్పుడు దీనిని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత ముఖం శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. పెరుగులో ఉన్న లాక్టిక్ ఆమ్లం కారణంగా, ఇది తేమను, సున్నితంగా ఎక్స్‌ఫోలియేట్ చేస్తుంది.
కొబ్బరి నూనె , పసుపు మాస్క్
1 టీస్పూన్ కొబ్బరి నూనెను 1 టీస్పూన్ పసుపు పొడితో కలపండి. ఈ రెండింటినీ బాగా కలిపి ముఖానికి రాయాలి. 20 నిమిషాల తర్వాత ముఖాన్ని శుభ్రం చేసుకోవాలి. దీనిని రెగ్యులర్ గా రాయడం వల్ల చర్మం ప్రకాశవంతంగా మారుతుంది.
కొబ్బరి నూనె , అవకాడో మాస్క్
సగం అవకాడోను మెత్తగా చేసి 1 టేబుల్ స్పూన్ కొబ్బరి నూనెతో కలపండి. దీనిని మెత్తగా చేసి.. ముఖానికి రాయాలి. 15 నిమిషాల తర్వాత ముఖాన్ని కడుక్కుంటే సరిపోతుంది. ఇది రాయడం వల్ల ముఖం యవ్వనంగా కనపడుతుంది. చర్మానికి మంచి హైడ్రేషన్ ఇస్తుంది.
కొబ్బరి నూనె , ఓట్ మీల్ మాస్క్
1 టీస్పూన్ కొబ్బరి నూనెను 2 టీస్పూన్ల వండిన ఓట్ మీల్‌తో కలపండి.దీనిని ముఖానికి రాసి 15 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేసుకుంటే సరిపోతుంది. ఈ ఫేస్ మాస్క్ రాయడం వల్ల చర్మాన్ని సున్నితమైన ఎక్స్‌ఫోలియేషన్‌ను అందిస్తుంది. ఇన్ స్టాంట్ గ్లో ఇస్తుంది.
కొబ్బరి నూనె, నిమ్మరసం మాస్క్
1 టీస్పూన్ కొబ్బరి నూనెను 1 టీస్పూన్ తాజా నిమ్మరసంతో కలపండి.ఈ రెండింటిని కలిపి మిశ్రమంలా తయారు చేసుకోవాలి. దీనిని ముఖానికి రాసి 10 నిమిషాల తర్వాత ఫేస్ వాష్ చేస్తే సరిపోతుంది. ఇది మంచి సన్ స్క్రీన్ లా పని చేస్తుంది. చర్మాన్ని ప్రకాశవంతంగా మారుస్తుంది.
కొబ్బరి నూనె , కలబంద మాస్క్
1 టీస్పూన్ కొబ్బరి నూనెను 1 టేబుల్ స్పూన్ కలబంద జెల్‌తో కలపండి.ఈ మిశ్రమాన్ని కనీసం 15 నుంచి 20 నిమిషాలు ముఖానికి ఉంచి తర్వాత శుభ్రం చేసుకుంటే సరిపోతుంది. చర్మానికి అందాన్ని తెస్తుంది.
కొబ్బరి నూనె , గుజ్జు చేసిన అరటిపండు మాస్క్
సగం పండిన అరటిపండును మెత్తగా చేసి 1 టీస్పూన్ కొబ్బరి నూనెతో కలపండి.ఈ మిశ్రమాన్ని ముఖానికి అప్లై చేసి, 15 నిమిషాలు అలాగే ఉంచండి. తర్వాత ముఖాన్ని బాగా కడగాలి. ఇలా చేయడం వల్ల కూడా ఇన్ స్టాంట్ గ్లో వస్తుంది. చర్మం మృదువుగా మారుతుంది.