Cholesterol: చెడు కొలెస్ట్రాల్ తగ్గాలంటే.. ఈ అలవాట్లు ఉండాల్సిందే..
Cholesterol: మన శరీరంలో కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచిది. రెండోది చెడ్డది. ఇందులో మంచి కొలెస్ట్రాల్ గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

మన శరీరంలో కొలెస్ట్రాల్ కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్ రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి మంచి కొలెస్ట్రాల్ (HDL). రెండోది చెడు కొలెస్ట్రాల్ (LDL). వీటిలో మన శరీరానికి మంచి కొలెస్ట్రాల్ యే మేలు చేస్తుంది. పలు అధ్యయనాల ప్రకారం.. మంచి కొలెస్ట్రాల్ తో గుండె జబ్బులు తగ్గుతాయని తేలింది.
High Cholesterol
మంచి కొలెస్ట్రాల్ ధమనుల్లో అదనపు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి లేదా పూర్తిగా తొలగించడానికి ఎంతో సహాయపడుతుంది. అదే చెడు కొలెస్ట్రాల్ మన శరీరానికి ఏ మాత్రం మంచిది కాదు. ఎందుకంటే ఇది పూర్తిగా ధమనుల్లో పేరుకుపోతుంది. రక్త ప్రసరణకు అడ్డంకులు కలిగిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే ఇది గుండె జబ్బులకు కారణమవుతుంది. అదే మంచి కొలెస్ట్రాల్ అయితే రక్తప్రవాహంలో అదనపు కొవ్వులను శుద్ధి చేస్తుంది. ఇది గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.
High Cholesterol
అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అని పిలువబడే మంచి కొలెస్ట్రాల్ కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది. అదే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ అని పిలువబడే చెడు కొలెస్ట్రాల్ రక్త నాళాలలో పేరుకుపోతుంది. ఇది కాలేయానికి హాని చేస్తుంది.
High Cholesterol
మన లైఫ్ స్టైల్, మనం తీసుకునే ఆహారం శరీరంలోని కొలెస్ట్రాల్ పై తీవ్రమైన ప్రభావాన్ని చూపిస్తాయి. శరీరంలో కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె జబ్బులే కాదు ఇతర ప్రాణాంతకమైన రోగాల బారిన పడతారు.
చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే చిట్కాలు
ఊబకాయం: ఊబకాయం ఎన్నో ప్రాణాంతక రోగాలకు దారితీస్తుంది. అందులో ఊబకాయలకు.. అధిక కొలెస్ట్రాల్ తో సంబంధం ఉన్న రోగాలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉందని పలు పరిశోధనలు స్పష్టం చేశాయి. శరీరంలోని అదనంగా ఉండే కొవ్వు చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించే శరీర సామర్థ్యానికి ఆటంకం కలిగిస్తుంది.
వ్యాయామం: వ్యాయామం శరీరాన్ని ఆరోగ్యంగా, ఫిట్ గా ఉంచుతుంది. రెగ్యులర్ గా వ్యాయామం చేయడం ద్వారా శరీరం చురుగ్గా ఉంటుంది. ముఖ్యంగా వ్యాయామం చేయడం ద్వారా చెడు కొలెస్ట్రాల్ తగ్గిపోతుంది. అలాగే ట్రైగ్లిజరైడ్ లను కూడా వ్యాయామం తగ్గిస్తుంది. రక్తంలో హెచ్ డిఎల్ స్థాయిలను మెరుగుపరచడానికి కూడా వ్యాయామం ఎంతో సహాయపడుతుంది.
fiber
ఆహారం: మొక్కల ఆధారిత ఆహారం తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ బాగా తగ్గిపోతుంది. ఎందుకంటే మాంసంలో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి. దీంతో రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయి విపరీతంగా పెరుగుతుంది. ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండే ఆహారాలు కూడా కొలెస్ట్రాల్ ను ఫాస్ట్ గా తగ్గిస్తాయి.
TOBACCO
పొగాకు, మద్యపానానికి దూరంగా ఉండాలి: స్మోకింగ్, ఆల్కహాల్ కు వీలైనంత దూరంగా ఉంటేనే మంచిది. ఈ రెండూ రక్తంలో చెడు కొలెస్ట్రాల్ ను పెంచుతాయి. అందులో పొగాకు రక్తనాళాల గోడలను దెబ్బతీస్తుంది. ఇది ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది.