Cholesterol: ఈ డ్రింక్స్ కొలెస్ట్రాల్ ను వెన్నలా కరిగిస్తాయి తెలుసా..?
Cholesterol: అధిక కొలెస్ట్రాల్ (High cholesterol) ను తగ్గించడానికి కొన్ని డ్రింక్స్ బాగా ఉపయోగపడతాయి. అవేంటంటే..

high cholesterol
శరీరంలో చెడు కొలెస్ట్రాల్ ఎన్నో ప్రమాదకరమైన రోగాలకు దారితీస్తుంది. అందుకే దీనిని వీలైనంత తొందరగా తగ్గించుకోవాలని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు. అయితే కొన్ని పానీయాలు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి.
High Cholesterol
ఈ రోజుల్లో ఊబకాయం, అధిక బరువుతో బాధపడే వారి సంఖ్య బాగా పెరిగిపోతోంది. దీని నుంచి బయపడేందుకు ఎన్నో ప్రయత్నాలను చేస్తుంటారు. అయినా బరువు తగ్గని వారు చాలా మందే ఉన్నారు. కానీ బరువు తగ్గకపోతే గుండె జబ్బులు వంటి ప్రమాదకరమైన రోగాలు వచ్చే అకాశాలు ఉన్నాయి. ఇంతకీ కొలెస్ట్రాల్ ను ఏ డ్రింక్స్ తగ్గిస్తాయో తెలుసుకుందాం పదండి.
గ్రీన్ టీ (Green tea): గ్రీన్ టీ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇది ఓవర్ వెయిట్ ను తగ్గించడమే కాదు.. కొలెస్ట్రాల్ ను కూడా తగ్గించగలదు. ఇందుకోసం మీరు గ్రీన్ టీని క్రమం తప్పకుండా తాగాల్సి ఉంటుంది. అయితే బరువు తగ్గే ప్రాసెస్, కొలెస్ట్రాల్ తగ్గే ప్రాసెస్ చాలా నెమ్మదిగా సాగుతుంది. నిత్యం దీన్ని తాగితే మీరు ఊహించని ఫలితాలు వస్తాయి.
టమాటా రసం.. టమాటాలు కూరలకు రుచిని పెంచడమే కాదు.. మరెన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా కలిగి ఉన్నాయి. గ్లాస్ టమాటా రసాన్ని తాగడం వల్ల కొలెస్ట్రాల్ చాలా ఫాస్ట్ గా తగ్గుతుంది. టమాటా జ్యూస్ కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను తగ్గిస్తుంది. అయితే కొన్ని అనారోగ్య సమస్యలు ఉన్నవాళ్లు.. డాక్టర్ సలహాల ప్రకారమే తీసుకోవాల్సి ఉంటుంది.
ఓట్స్ మిల్క్.. ఓట్స్ మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. అందులో ఓట్ మిల్క్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడతాయి. దీనిలో ఉండే బీటా గ్లూకాన్ కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి ఎంతో సహాయపడుతుంది.
వీటితో పాటుగా వెల్లుల్లి కూడా.. వెల్లుల్లి మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. అందుకే ఇది ప్రతి వంటగదిలో ఖచ్చితంగా ఉంటుంది. ప్రతిరోజూ వీటిని తినడం వల్ల శరీరంలోని కొలెస్ట్రాల్ సమతుల్యంగా ఉంటుంది. ముఖ్యంగా వెల్లుల్లి మన శరీరంలో పెరిగిన చెడు కొలెస్ట్రాల్ ను తగ్గించడానికి సహాయపడుతుంది.
పసుపు పాలు.. పసుపు కలిపిన పాలు మనల్ని ఎన్నో అనారోగ్య సమస్యల నుంచి బయటపడేస్తాయి. నిత్యం ఏదో ఒక రోగం బారిన పడేవారు తమ రోజు వారి ఆహారంలో పసుపు పాలను చేర్చుకుంటే మంచి ఫలితం ఉంటుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. కొలెస్ట్రాల్ ను తగ్గించే గుణాలు పాలలో ఉన్నాయి.