MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Chicken Liver Vs Mutton Liver: చికెన్ లివర్, మటన్ లివర్ రెండింటిలో ఏది తినాలి? ఎవరు ఏది తినకూడదు?

Chicken Liver Vs Mutton Liver: చికెన్ లివర్, మటన్ లివర్ రెండింటిలో ఏది తినాలి? ఎవరు ఏది తినకూడదు?

Chicken Liver Vs Mutton Liver: మీకు లివర్ తినడం ఇష్టమా? అయితే.. చికెన్ లివర్? మటన్ లివర్..? ఈ రెండింటిలో ఏది ఆరోగ్యానికి మంచిది? ఏది తింటే ఎక్కువ ప్రయోజనాలు కలుగుతాయి?

3 Min read
Author : ramya Sridhar
Published : Oct 03 2026, 08:54 AM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
లివర్ తింటున్నారా?
Image Credit : Gemini

లివర్ తింటున్నారా?

చికెన్, మటన్ రెండూ ఆరోగ్యానికి ఎంత మంచివో స్పెషల్ గా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే... చాలా మందికి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్నా, లివర్ విషయంలో చాలా అనుమానాలు ఉంటాయి. లివర్.. శరీరంలోని వ్యర్థాలను ఫిల్టర్ చేస్తుంది కదా... దానిని తినకూడదేమో అని చాలా డౌట్స్ ఉంటాయి. కానీ, సాధారణ చికెన్ కంటే లివర్ లో దాదాపు 10 శాతం ఐరన్ ఎక్కువగా ఉంటుంది. అంతేకాకుండా, ఈ ఐరన్ శరీరాన్ని త్వరగా శోషించుకోవడానికి సహాయం చేస్తుంది. చికెన్ లివర్ లో ఐరన్ తో పాటు విటమిన్ బి12, విటమిన్ ఎ, ఫోలేట్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి.

అయితే, మాంస ప్రియులందరిలో ఉండే సాధారణ సందేహం ఏంటంటే... చికెన్ లివర్, మటన్ లివర్.. ఈ రెండింటిలో అసలు ఏది మంచిది? ఏది ఎవరికి ఎక్కువ మేలు చేస్తుంది?

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
చికెన్ లివర్..
Image Credit : Gemini

చికెన్ లివర్..

చికెన్ లివర్ లో ఐరన్, ఫోలేట్, విటమిన్ ఎ, విటమిన్ బి12, సెలీనియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. చికెన్ లివర్ లో లభించే ఐరన్ శరీరం త్వరగా గ్రహిస్తుంది. ఇది సులభంగా జీర్ణం అవుతుంది. రక్తహీనత సమస్యతో బాధపడేవారికి, శరీరంలో రక్తం శాతాన్ని వేగంగా పెంచుకోవాలి అనుకునే వారికి ఇది మంచి ఆప్షన్. తక్కువ ఖర్చుతో అత్యధిక పోషకాలు పొందాలి అనుకునేవారికి, ఫోలేట్ అవసరం అయ్యే మహిళలకు ఇది చాలా మంచిది.

34
మటన్ లివర్...
Image Credit : Chatgpt

మటన్ లివర్...

మటన్ లివర్ లో విటమిన్ ఎ, డి, బి12, ఐరన్ తో పాటు జింక్, కాపర్, పొటాషియం వంటి మినరల్స్ పుష్కలంగా ఉంటాయి. పోషకాల పరంగా చూస్తే... చికెన్ లివర్ కంటే మటన్ లివర్ లో కొన్ని ఖనిజాలు అంటే జింక్, కాపర్ వంటివి మరింత అధిక మోతాదులో లభిస్తాయి. మటన్ లివర్ తిన్నప్పుడు మెదడు చాలా చురుకుగా పని చేస్తుంది. జ్ఞాపకశక్తి మెరుగుపడాలన్నా, నరాల బలం పెంచుకోవడానికి రెగ్యులర్ గా మటన్ లివర్ ని ఆహారంలో భాగం చేసుకోవాలి. అంతేకాకుండా... రోగనిరోధక శక్తిని పెంచడంలో , శరీర కణాలకు ఆక్సిజన్ అందేలా చేయడంలో ఇది బాగా తోడ్పడుతుంది.

చికెన్ లివర్, మటన్ లివర్.. రెండింటిలో ఏది మంచిది?

లివర్ సులభంగా జీర్ణం అవ్వాలన్నా, రక్తం తక్కువగా ఉంది అని బాధపడేవారు.. చికెన్ లివర్ తీసుకోవడం బెస్ట్. అలా కాకుండా.. పోషకాలు ఎక్కువగా కావాలి అంటే.. మటన్ లివర్ ఎంచుకోవచ్చు.

44
లివర్ ఎవరు తినకూడదు..?
Image Credit : Chatgpt

లివర్ ఎవరు తినకూడదు..?

అధిక కొలెస్ట్రాల్ ఉన్నవారు...

లివర్ లో కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. LDL ( చెడు కొలెస్ట్రాల్) పెరిగే అవకాశం కూడా ఎక్కువగా ఉంది. హృదయ సంబంధిత సమస్యలు కూడా వస్తాయి. కాబట్టి, హార్ట్ పేషెంట్స్, కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నవారు చికెన్, మటన్ లివర్ లను పూర్తిగా దూరంగా ఉంచడమే మంచిది.

బీపీ, హైపరేటెన్షన్ ఉన్నవారు....

లివర్ లో సోడియం, ఫ్యాట్ ఎక్కువగా ఉన్నవారు రక్తపోటు సమస్య పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే.. రక్తపోటు నియంత్రణలో లేనివారు ఈ ఆహారాన్ని తినకపోవడమే మంచిది.

కిడ్నీ సమస్యలతో బాధపడేవారు...

లివర్ లో ప్రోటీన్, ఖనిజాలు అధికంగా ఉండటం వల్ల కిడ్నీలపై అధనపు ఒత్తిడి పడుతుంది. క్రియాటిన్ పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవారు.. చికెన్, మటన్ లివర్ లాంటివి తినకపోవడమే మంచిది.

గర్భిణీ స్త్రీలు, పాలిచ్చే తల్లులు...

మటన్, చికెన్ లివర్ లలో విటమిన్ ఏ అధికంగా ఉంటుంది. వీటిని ఎక్కువగా తీసుకోవడం వల్ల ఫీటస్ డెవలప్మెంట్ కు హాని కలిగిస్తుంది. హార్మోన్ అసమతుల్యతకు కారణం అవుతుంది. కాబట్టి, వైద్యుడి అనుమతి లేకుండా.. తీసుకోకూడదు.

మజిల్ డిజార్డర్స్, ఆటో ఇమ్యూన్ సమస్యలు ఉన్నవారు...

లివర్ లో అధిక ప్రోటీన్ ఉంటుంది. ఎక్కువ ప్రోటీన్ తీసుకోవడం వల్ల కండరాల వ్యాధులు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది. ఇమ్యూన్ రియాక్షన్స్ కి అవకాశం ఉంటుంది. ఇలాంటి వాళ్లు కూడా లివర్ వంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.

చిన్న పిల్లలు...

చిన్న పిల్లలకు కూడా లివర్ పెట్టకూడదు. అంటే పూర్తిగా పెట్టకూడదు అని కాదు కానీ, ఎక్కువగా పెట్టకూడదు. లివర్ ఎక్కువగా పిల్లలకు పెట్టడం వల్ల జీర్ణ సమస్యలు వచ్చే ప్రమాదం ఉంది. అందుకు రెండేళ్లలోపు పిల్లలకు లివర్ పెట్టకపోవడమే మంచిది. పెట్టినా చాలా మితంగా పెట్టాలి.

లివర్ తినేవారు తీసుకోవాల్సిన జాగ్రత్తలు....

లివర్ తినేవారు కూడా కొన్ని నియమాలను గుర్తుపెట్టుకోవాలి. వారానికి ఒకటి, రెండుసార్లకు మించి తినకూడదు. పూర్తిగా ఉడికించిన తర్వాత మాత్రమే తినాలి. నాణ్యమైన మాంసాహారాన్ని మాత్రమే ఉపయోగించాలి. రోజూ తినడం ఎవరికైనా ప్రమాదమే.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dandruff: కొబ్బరి నూనెలో ఇదొక్కటి కలిపి రాస్తే చుండ్రు మళ్లీ రాదు
Recommended image2
Protein Idli: ఈజీగా వెయిట్ లాస్‌ అవ్వాలంటే ఈ ప్రోటీన్ ఇడ్లీ ట్రై చేయండి..
Recommended image3
Rock Salt vs Regular Salt: వంటలోకి కల్లుప్పు మంచిదా? సాల్ట్ మంచిదా?
Related Stories
Recommended image1
Pressure Cooker: కుక్కర్ లో అన్నం, పప్పు పొంగుతున్నాయా? ఎంత నీరు పోస్తే సరిగా ఉడుకుతాయో తెలుసా?
Recommended image2
Motivational Story: నాలో ఒక్క టాలెంట్ కూడా లేదు అని ఫీల్ అవుతున్నారా? మీ కళ్లు తెరిపించే కథ ఇది
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved