MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
  • Home
  • Life
  • Manthras: ఈ మంత్రాలను జపిస్తే మీకున్న తీవ్ర కోపం మంచులా కరిగిపోతుంది.. ప్రశాంతంగా ఉండగలుగుతారు

Manthras: ఈ మంత్రాలను జపిస్తే మీకున్న తీవ్ర కోపం మంచులా కరిగిపోతుంది.. ప్రశాంతంగా ఉండగలుగుతారు

Manthras: ఇప్పుడు చిన్న చిన్న విషయాలకే చాలామందికి కోపం వచ్చేస్తుంది. కోపం అన్ని అనర్ధాలకు కారణంగా చెప్పుకుంటారు. ఇలా ఎక్కువ కోపం వచ్చేవారికి కొన్ని శక్తివంతమైన మంత్రాలు ఎంతో సహాయపడతాయి. కొన్ని మంత్రాలను జపించడం వల్ల కోపం చాలా వరకు తగ్గుతుంది. 

2 Min read
Author : Haritha Chappa
Published : May 12 2026, 12:29 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
14
కోపాన్ని తగ్గించే మంత్రాలు
Image Credit : Getty

కోపాన్ని తగ్గించే మంత్రాలు

మితిమీరిన కోపం శరీర ఆరోగ్యానికి కూడా ఏమాత్రం మంచిది కాదు. మనసుపై కూడా ఇది హానికరమైన ప్రభావాలను కలిగిస్తుంది. అంతేకాదు ఆ కోపంలో వ్యక్తి ఏం చేస్తున్నాడో కూడా విచక్షణ లేకుండా ఉంటాడు. దీనివల్ల తీవ్రమైన అనర్ధాలు కూడా కలిగే అవకాశం ఉంటుంది. కోపం ఒక వ్యక్తికి అతి పెద్ద శత్రువు అని చెప్పుకోవాలి. చిన్నచిన్న విషయాలకే కొంతమందికి త్వరగా కోపం వచ్చేస్తుంది. ఆవేశంలో తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. అలాంటి వారు కోపాన్ని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంది. తరచూ కోపానికి గురయ్యే వారు కొన్ని శక్తివంతమైన మంత్రాలను ప్రతిరోజు జపిస్తూ ఉంటే మంచిది. ఈ మంత్రాలను జపించడం వల్ల మనసుకు ప్రశాంతంగా ఉంటుంది. కోపాన్ని నియంత్రించడంలో సహాయపడుతుంది.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
24
శ్రీకృష్ణ వాసుదేవాయ మంత్రం
Image Credit : Getty

శ్రీకృష్ణ వాసుదేవాయ మంత్రం

కృష్ణాయ వాసుదేవాయ హరయా పరమాత్మనే.

ప్రణాత్ క్లేశనాశాయ గోవిందాయ నమో నమః.

ఈ మంత్రం జపించిన భక్తునికి మానసిక బలాన్ని ఇస్తుంది. శ్రీకృష్ణుడు ఆశీస్సులను అందిస్తుంది. దీర్ఘ శ్వాసలు తీసుకొని ఆ తర్వాత ఈ మంత్రాన్ని జపించాలి. కోపాన్ని శాంతంగా మార్చేందుకు ఇది ఒక ప్రభావమైన మంత్రమని చెప్పుకోవచ్చు.

34
మంగళ బీజ మంత్రం
Image Credit : Getty

మంగళ బీజ మంత్రం

ఓం క్రాం క్రీం క్రౌం సహ భూమాయ నమః.

ఆవేశానికి,కోపానికి అధిపతి కుజుడు.కుజుడు ప్రశాంతంగా ఉంటే కోపం కూడా తగ్గిపోతుంది.అందుకే ఈ కుజ మంత్రం జపించడం వల్ల కోపాన్ని నియంత్రణలోకి తెచ్చుకోవచ్చు. ఈ మంత్రం జపిస్తే శారీరక బలంతో పాటు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది.

44
రాహుబీజ మంత్రం
Image Credit : Getty

రాహుబీజ మంత్రం

ఓం భ్రాం భ్రీం భ్రాం సహ రాహువే నమః.

ఈ బీజ మంత్రాన్ని జపించడం వల్ల రాహువు శాంతిస్తాడు. రాహువు ప్రశాంతంగా ఉంటే కోపం కూడా తగ్గిపోతుంది. ఈ మంత్రం ఒక మనిషిలో ఉన్న కోపాన్ని తొలగించి, జీవితంలోని ప్రతికూలతను కూడా తొలగిస్తుంది. ఇది ఒక వ్యక్తి వ్యక్తిత్వాన్ని మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది.

వైష్ణవ మంత్రం

ఓం నమో భగవతే వాసుదేవాయ.. వైష్ణవ మంత్రం ఎంతో శక్తివంతంగా పనిచేస్తుంది. దీన్ని జపించడం వల్ల శ్రీ విష్ణుమూర్తి నుంచి అపారమైన ఆశీస్సులు లభిస్తాయి. ఈ మంత్ర జపం జీవితంలోని సమస్యలను తొలగించి కోపాన్ని అదుపులో ఉంచుకోవడానికి సహాయపడుతుంది. ఈ వైష్ణవ మంత్రాన్ని జపిస్తూ ధ్యానం చేయండి. మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది.

About the Author

HC
Haritha Chappa
హరిత ఏసియా నెట్‌లో చీఫ్ సబ్ ఎడిటర్ గా పనిచేస్తున్నారు. జర్నలిజంలో పీజీ పూర్తి చేశారు. ఈనాడు, సమయం, ఆంధ్రజ్యోతి, ఏబీపీ నెట్ వర్క్, హిందూస్థాన్ టైమ్స్ లో పనిచేశారు. ప్రింట్, డిజిటర్ మీడియాలో 18 ఏళ్ల అనుభవం ఉంది. ఏసియా నెట్ లైఫ్ స్టైల్, బిజినెస్, ఓటీటీ మూవీ కంటెంట్, ఆస్ట్రాలజీ కంటెంట్ రాస్తారు.
జీవనశైలి
ఆధ్యాత్మిక విషయాలు
ఏషియానెట్ న్యూస్
ఏషియానెట్ న్యూస్ తెలుగు ఒరిజినల్స్
 

Latest Videos
Recommended Stories
Recommended image1
Dinner Mistakes: రాత్రి భోజనం విషయంలో 90 శాతం మంది చేసే 5 తప్పులు ఇవే!
Recommended image2
Maggi Masala: ఇంట్లోనే కేవలం పది నిమిషాల్లో మ్యాగీ మసాలా..ఎలా చేయాలో తెలుసా?
Recommended image3
Gold Necklaces: అరతులంలో అదిరిపోయే బంగారు నెక్లెస్ డిజైన్లు
Related Stories
Recommended image1
Mars Transit: కుజ సంచారంతో ఈ 4 రాశులవారికి 45 రోజుల పాటు తిరుగులేదు, డబ్బు చేతికందుతుంది
Recommended image2
Summer Travel: వేసవిలో పొరపాటున కూడా ఈ ప్రదేశాలకు వెళ్లొద్దు.. ఎండలు తట్టుకోలేరు
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved