Chanakya Niti: ఈ ఐదు పనులు చేస్తే మీ గౌరవం పెరుగుతుంది..!
Chanakya Niti: సమాజంలో గౌరవం పెంచుకోవాలని, అందరూ తమను గౌరవించాలనే కోరిక చాలా మందిలో ఉంటుంది. అయితే.. ఆ గౌరవం పెంచుకోవడం అనేది మన చేతల్లోనే ఉంటుందని చాణక్యుడు చెబుతున్నాడు.

Chanakya Niti
మన చుట్టూ చాలా మంది ఉంటారు. కొందరిని చూడగానే అందరికీ గౌరవం ఇవ్వాలనిపిస్తుంది. వారి మాటకు అందరూ విలువ ఇస్తారు. అయితే, ఆ గౌరవం దక్కడానికి మనవంతు కృషి చేయాలని చాణక్య నీతి చెబుతుంది.చాణక్యుడి ప్రకారం... డబ్బు, అధికారం లేకుండా కూడా గౌరవం పొందాలంటే కచ్చితంగా కొన్ని అలవాట్లు అలవరుచుకోవాలి. మరి, ఆ అలవాట్లు ఏంటో చూద్దాం....
1. ఇచ్చిన మాట నిలపెట్టుకోవాలి....
ఎవరికైనా మాట ఇవ్వడం చాలా సులువు, కానీ, దానిని నిలబెట్టుకునే సామర్థ్యం కూడా ఉండాలి. ఆ నమ్మకాన్ని కూడా మీరు కలిగించాలి. మీరు చెప్పిన పనిని సమయానికి పూర్తి చేయడం, గోప్యతను కాపాడటం, వాగ్దానం చేసినప్పుడు దానిని నెరవేర్చడం ఇవన్నీ ఇతరులకు మీరు నమ్మదగిన వ్యక్తి అని తెలియజేస్తాయి. ఇవన్నీ గౌరవాన్ని పెంచుతాయి.
2.తక్కువ మాట్లాడి, ఎక్కువ వినాలి...
మంచి కమ్యూనికేషన్ అంటే మాట్లాడటం మాత్రమే కాదు, వినడం కూడా. ఎవరైనా మాట్లాడుతున్నప్పుడు మనం వినడం నేర్చుకోవాలి. మధ్యలో అడ్డుకోవడం లాంటివి చేయకూడదు. చెప్పేదానిపై శ్రద్ధ కూడా చెప్పాలి. మీరు ఇతరుల అభిప్రాయాలను గౌరవిస్తే.. వారు కూడా మీ మాటకు విలువ ఇస్తారు. ఇచ్చి పుచ్చుకుంటే... గౌరవం పెరుగుతుంది.
3.అందరితో దయగా ఉండటం...
హోదా, స్థాయి, పరిస్థితి ఏదైనా, ప్రతి ఒక్కరితో మానవత్వంతో ప్రవర్తించండి. చిన్న చిన్న విషయాలకు థ్యాంక్స్ చెప్పడం, సహాయం చేయడం, ఓపిక చూపించడం — ఇవి మీ నిజమైన మనసును ప్రతిబింబిస్తాయి. నిజమైన దయ ఎప్పుడూ గౌరవాన్ని తెస్తుంది.
4. ఒత్తిడిలో ప్రశాంతంగా ఉండండి
కష్ట సమయంలో కూడా స్థిరంగా ఉండగల వ్యక్తిని అందరూ గౌరవిస్తారు. సమస్యల సమయంలో సహనం, శాంతి ఆలోచనాత్మకంగా ఉండటం మీ పరిపక్వతను తెలియజేస్తుంది. ఇది నాయకత్వ లక్షణంగా కూడా పరిగణిస్తారు.
5. నేర్చుకుంటూ, ఎదుగుతూ ఉండండి
తమను తాము నిరంతరం మెరుగుపరుచుకుంటూ, కొత్త విషయాలను నేర్చుకునే వారిని అందరూ గౌరవిస్తారు. చదవడం, కొత్త విషయాలు నేర్చుకోవడం, తన లోపాలను గుర్తించి సరిదిద్దుకోవడం.. ఇవన్నీ వ్యక్తిత్వాన్ని మెరుగుపరుస్తాయి. జ్ఞానం పెరిగిన కొద్దీ వినయం కూడా పెరగాలి. మీరు నేర్చుకున్నది ఇతరులతో పంచుకున్నప్పుడు, అది మీ గౌరవాన్ని మరింత పెంచుతుంది.
గౌరవం పొందడం అంటే ఒకరోజు పని కాదు.
అది మీ ప్రతిరోజు ఆలోచనలు, చర్యలు, ప్రవర్తనల ఫలితం. మీరు నిజాయితీగా, దయతో, స్వీయ నియంత్రణతో జీవిస్తే.. గౌరవం సహజంగానే మీ వెంట వస్తుంది.