MalayalamNewsableKannadaKannadaPrabhaTeluguTamilBanglaHindiMarathiMyNation
Add Preferred SourceGoogle-icon
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • తాజా వార్తలు
  • ఎంటర్‌టైన్‌మెంట్
  • క్రికెట్
  • జీవనశైలి
  • ఆంధ్రప్రదేశ్
  • తెలంగాణ
  • బిజినెస్
  • జ్యోతిష్యం
TRENDING :
Today's Rasi Phalalu
Nepal Flash Flood
Raksha Bandhan 2026
Toxic Day 1 Collections
Veteran telugu Actor GV Narayana Rao
Trivikram Srinivas
New Financial Rules September
India's Shortest Train Journey
Onion & Sugar Prices
Irumudi Movie 4 Days Collections
Megastar Chiranjeevi
  • Home
  • Life
  • Chanakya Niti: అందరితో మంచిగా ఉండటం కూడా తప్పేనా? కాస్త కన్నింగ్ గా ఉండాల్సిందేనా?

Chanakya Niti: అందరితో మంచిగా ఉండటం కూడా తప్పేనా? కాస్త కన్నింగ్ గా ఉండాల్సిందేనా?

 Chanakya Niti: మన చుట్టూ ఉన్న అందరితోనూ మంచిగా ఉండాలి అని మన ఇంట్లో వాళ్లు మనకు నేర్పిస్తారు. కానీ, అలా అందరితో మంచిగా ఉండటం కూడా తప్పే అని, కాస్త కన్నింగ్ గా ఉండాలని చాణక్యుడు చెబుతున్నాడు. 

2 Min read
Author : ramya Sridhar
Published : Apr 21 2026, 05:33 PM IST
Share this Photo Gallery
  • FB
  • TW
  • Linkdin
  • Whatsapp
  • GNFollow Us
13
Chanakya Niti
Image Credit : Chatgpt

Chanakya Niti

‘ అడవిలో ఎన్నో చెట్లు ఉన్నా..నిటారుగా, సూటిగా ఉన్న చెట్లను మొదట నరికేస్తారు.. వంకరగా ఉన్న చెట్ల జోలికి ఎవరూ వెళ్లరు’ అని నీతి శాస్త్రంలో చెప్పినట్లు.. నిజ జీవితంలో కూడా అతి మంచివారిలా, అమాయకత్వంతో ఉంటే ఎదురయ్యే ఇబ్బందులను చాణక్యుడు అప్పుడే హెచ్చరించారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred
23
1.మితి మీరిన సూటితనం...
Image Credit : Chatgpt

1.మితి మీరిన సూటితనం...

జీవితంలో నిజాయితీగా ఉండటం గొప్ప గుణం. అందులో ఎలాంటి సందేహం లేదు. కానీ, ఎక్కడ ఎంత వరకు సూటిగా ఉండాలో తెలియాలి. ఎదుటివారు ఏది చెప్పినా గుడ్డినా అంగీకరిస్తూ, మంచివారు అనిపించుకోవాలని చూస్తే.. జనాలు మిమ్మల్ని తమ స్వార్థం కోసం వాడుకోవడం మొదలుపెడతారు. మీ మంచితనం ఇతరులకు ఒక అలుసు గా మారినప్పుడు, అది మీ జీవితంలో మానసిక ఒత్తిడి, అలసటకే దారితీస్తుంది.

2.మీ గొంతును నొక్కోసుకోవద్దు...

కొందరు ఇతరులతో వాదనలు ఇష్టం లేక, లేదా వారిని నొప్పించడం ఇష్టం లేక తమ సొంత అభిప్రాయాలను దాటేస్తూ ఉంటారు. చాణక్యుడి ప్రకారం.. మీరు మీ అభిప్రాయాన్ని బలంగా చెప్పనప్పుడు, సమాజం మిమ్మల్ని ఆత్మవిశ్వాస లేని వ్యక్తిగా చూస్తుంది.మీ మాటలకు విలువలేని చోట మీ ఆత్మగౌరవం దెబ్బతింటుంది. అందుకే, మౌనం ఎప్పుడు వహించాలో, ఎప్పుడు గళం విప్పాలో తెలియాలి.

Related Articles

Related image1
Life Secrets: ఈ మూడు విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో ఎదగలేరు..!
Related image2
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
33
 3. గుడ్డి నమ్మకం: మోసానికి మొదటి మెట్టు
Image Credit : chatgpt/AI

3. గుడ్డి నమ్మకం: మోసానికి మొదటి మెట్టు

అతి అమాయకంగా ఉండేవారు ప్రపంచమంతా తమలాగే నిష్కపటంగా ఉందని భావిస్తారు. ఎవరు సరైనవారు, ఎవరు కపట నాటకం ఆడుతున్నారో గుర్తించలేరు. చాణక్యుడు ఏమంటారంటే.. "నమ్మకం అనేది మంచిదే, కానీ అది గుడ్డిగా ఉండకూడదు." విచక్షణ కోల్పోయి అందరినీ నమ్మితే, ద్రోహం , నష్టాన్ని అనుభవించక తప్పదు.

4. ఆత్మ సందేహం ఉండొద్దు..

ఎప్పుడైతే ఇతరులు మీ మంచితనాన్ని దుర్వినియోగం చేస్తారో, మీకు తెలియకుండానే మీ నిర్ణయాల మీద మీకు నమ్మకం పోతుంది. "నేను తీసుకున్న నిర్ణయం సరైనదేనా?" అని పదే పదే సందేహించడం మొదలుపెడతారు. ఈ భయం మిమ్మల్ని కొత్త పనులు చేయనివ్వకుండా ఆపేస్తుంది.

5. అవకాశాలు చేజారిపోవచ్చు..

ప్రతి పరిస్థితిలోనూ మౌనంగా ఉండటం గొప్పతనం అనిపించుకోదు. మీ హక్కుల కోసం మీరు నిలబడనప్పుడు, మీ అవసరాలను మీరు వ్యక్తపరచనప్పుడు.. మిమ్మల్ని తొక్కేసి ఇతరులు ముందుకు వెళ్ళిపోతారు. ఆత్మరక్షణ , ఆత్మగౌరవం కోసం నిలబడటం స్వార్థం కాదు, అది కనీస అవసరం.

About the Author

RS
ramya Sridhar
పది సంవత్సరాలుగా జర్నలిజంలో ఉన్నారు. 2017 నుండి ఆసియానెట్‌లో జర్నలిస్ట్‌గా పని చేస్తున్నారు. ప్రస్తుతం, లైఫ్‌స్టైల్ విభాగాన్ని లీడ్ చేస్తున్నారు. ఇంతకు ముందు ఈనాడులో పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్లో జర్నలిజం శిక్షణ పొందారు.
జీవనశైలి

Latest Videos
Recommended Stories
Recommended image1
Silver Rings: రూ.1000 లోపు అద్భుత డిజైన్లలో వెండి ఉంగరాలు
Recommended image2
Salt: ఉప్పు వంట కోసమే కాదు.. ఇంట్లో ఉన్న సమస్యలను కూడా పోగొడుతుందట
Recommended image3
Curry Leaves: రోజూ ఈ ఒక్క ఆకు తిన్నా చాలు.. ఎన్ని లాభాలో?
Related Stories
Recommended image1
Life Secrets: ఈ మూడు విషయాల్లో సిగ్గుపడితే.. జీవితంలో ఎదగలేరు..!
Recommended image2
Chanakya Niti: మనుషుల నుంచి కాదు.. కాకిని చూసి ఇవి నేర్చుకోండి...
Asianet
Follow us on
  • Facebook
  • Twitter
  • whatsapp
  • YT video
  • insta
  • Download on Android
  • Download on IOS
  • About Website
  • Terms of Use
  • Privacy Policy
  • CSAM Policy
  • Complaint Redressal - Website
  • Compliance Report Digital
  • Investors
© Copyright 2026 Asianxt Digital Technologies Private Limited (Formerly known as Asianet News Media & Entertainment Private Limited) | All Rights Reserved