చాణక్య నీతి ప్రకారం ఇలాంటి ఇల్లు.. స్మశానంతో సమానం!
ఆచార్య చాణక్యుడు గొప్ప పండితుడు. మానవ జీవితాలకు ఉపయోగపడే ఎన్నో విషయాలను ఆయన తన నీతిసూత్రాల్లో పేర్కొన్నాడు. చాణక్య నీతి ప్రకారం మనం చేేసే కొన్ని తప్పుల వల్ల ఇల్లు స్మశానంగా మారుతుందట. అవేంటో ఇక్కడ చూద్దాం.

చాణక్య నీతి
ఆచార్య చాణక్యుడి నీతి సూత్రాలను పాటిస్తే జీవితంలో విజయం సాధించవచ్చని చాాలామంది నమ్ముతారు. అందుకే ఇప్పటికీ ఆయన సూత్రాలను ఫాలో అవుతుంటారు. చాణక్యుడు మానవ జీవితాలకు సంబంధించిన ఎన్నో విషయాలను తన నీతి సూత్రాల్లో పొందుపరచాడు. చాణక్యుడి ప్రకారం కొన్ని విషయాలను పాటించడం ద్వారా ఇల్లు స్వర్గంలా మారితే... మరికొన్ని విషయాలు ఇంటిని స్మశానంలా మారుస్తాయి. అవేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.
ఈ తప్పులు అస్సలు చేయొద్దు!
చాణక్య నీతి ప్రకారం కొన్ని ఇళ్లలో లక్ష్మీదేవి నివసిస్తుంది. మరికొన్ని ఇళ్లలో మాత్రం బాధ, పేదరికం, ప్రతికూలతలే ఉంటాయి. దానికి కారణం.. మనం చేసే కొన్ని తప్పులే. ఎలాంటి తప్పులు చేయడం వల్ల ఇల్లు స్మశానంలా మారుతుందో ఇక్కడ చూద్దాం.
శుభకార్యాలు జరగని ఇల్లు
చిన్నవైనా, పెద్దవైనా ఎలాంటి శుభకార్యాలు జరగని ఇళ్లు స్మశానంతో సమానమని ఆచార్య చాణక్యుడు బోధించాడు. అలాంటి ఇళ్లల్లో ఆటంకాలు, ప్రతికూల శక్తులు ఎక్కువగా ఉంటాయట. వారికి ఎందులోనూ కలిసిరాదట. కాబట్టి ఇంట్లో అప్పుడప్పుడు శుభకార్యాలు చేస్తూ ఉండాలి. దానివల్ల ఇంట్లో సంతోషం వెల్లివిరుస్తుంది.
పూజలు జరగని ఇల్లు
ఆచార్య చాణక్యుడి ప్రకారం పూజలు చేయని ఇళ్లల్లో దేవుడు అస్సలు నివసించడు. దేవుడు లేని ఇల్లు స్మశానం లాంటిది అంటారు. అక్కడ పేదరికం, దుఃఖం, బాధ మాత్రమే ఉంటాయి. ఎంత కష్టపడ్డా ఫలితం ఉండదు. ఎప్పుడూ ఏదో ఒక ఇబ్బంది వస్తూనే ఉంటుంది.
పండితులను గౌరవించని ఇల్లు
చాణక్య నీతి ప్రకారం.. పండితులు, రుషులను గౌరవించని ఇంటిపై దైవానుగ్రహం ఎప్పుడూ ఉండదు. దైవానుగ్రహం లేని ఇల్లు స్మశానంతో సమానం. పండితులు, రుషులు ఇతరులను సరైన మార్గంలో నడవడానికి ప్రేరేపిస్తారు. తద్వారా జీవితంలో సులువుగా విజయం సాధించవచ్చు. కాబట్టి వారిని గౌరవించడం మంచిదని చాణక్య నీతి చెబుతోంది.