చాణక్య నీతి ప్రకారం తెలివైనవారు ఈ 3 విషయాలు ఎవ్వరితో చెప్పరు!
Chanakya Niti: ఆచార్య చాణక్యుడి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన బోధనలు ఇప్పటికీ ఆచరణీయం. ఆయన నీతి సూత్రాలు పాటిస్తే జీవితంలో తిరుగుండదని చాలామంది నమ్మకం. చాణక్యుడి ప్రకారం తెలివైనవారు ఈ 3 విషయాలు ఎవ్వరికీ చెప్పరట. అవేంటో ఇక్కడ చూద్దాం.

చాణక్య నీతి
చాణక్యుడి ప్రకారం కొన్ని విషయాలను రహస్యంగా ఉంచడం తెలివైన వారి లక్షణం. ఒకవేళ ఆ విషయాలను అందరి ముందు చెబితే.. ఇతరుల దృష్టి, జోక్యం.. ఆ విషయాన్ని పెద్దది చేసి సమస్యలను సృష్టించవచ్చు. మరి చాణక్యుడి ప్రకారం ఏ విషయాలను రహస్యంగా ఉంచాలో ఇక్కడ తెలుసుకుందాం.
ప్రేమ సంబంధం
ఆచార్య చాణక్యుడు ప్రేమ, పెళ్లి, స్నేహం గురించి చాలా విషయాలు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు. చాణక్యుడి ప్రకారం.. మీరు ప్రేమలో ఉంటే, దాన్ని అందరి ముందు చెప్పాల్సిన పనిలేదు. బంధం బలపడే వరకు రహస్యంగా ఉంచడమే మేలు. బయటకి చెప్పడం వల్ల కొన్నిసార్లు సమస్యలు రావచ్చు. తెలివైన వారు ప్రేమను నిర్ధారించుకునే వరకు రహస్యంగా ఉంచుతారు.
కుటుంబ విషయాలు
ప్రతి కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమస్యలు కూడా ఉంటాయి. కొన్నిసార్లు ఇంట్లో పెద్ద గొడవలు లేదా సమస్యలు రావచ్చు. కానీ వాటిని బయటివారికి చెప్పకూడదు. మీరు ఇంటి విషయాలు ఇతరులకు చెబితే వాళ్లు మిమ్మల్ని ఎగతాళి చేయవచ్చు. లేదా వాటిని అవకాశంగా తీసుకొని ఇంకేమైనా చేయవచ్చు. కాబట్టి ఇంటి విషయాలను ఇంట్లోనే పరిష్కరించుకోవాలని చాణక్యుడు తన నీతి సూత్రాల్లో పేర్కొన్నాడు.
స్నేహితుల రహస్యం
మీ స్నేహితుడు లేదా మీకు కావాల్సిన వ్యక్తి ఒక రహస్యం మీతో చెబితే.. దాన్ని ఇతరులకు అస్సలు చెప్పకూడదు. స్నేహం అంటే నమ్మకం. మీరు ఆ రహస్యాన్ని వేరే వాళ్లకు చెబితే దానివల్ల మీ స్నేహితుడికి ఏదైనా ఇబ్బంది కలగవచ్చు. అంతేకాదు వారికి మీ మీద నమ్మకం కూడా పోతుంది. కాబట్టి తెలివైన వారు ఇతరుల రహస్యాలను తమలోనే దాచుకుంటారని చాణక్యుడు తన బోధనల్లో వివరించాడు.