- Home
- Life
- ఈ హెర్బల్ టీ తాగితే థైరాయిడ్ రిస్క్ తగ్గుతుంది.. అలాగే అధిక బరువు, హెయిర్ ఫాల్ సమస్యలు కూడా పోతాయి..
ఈ హెర్బల్ టీ తాగితే థైరాయిడ్ రిస్క్ తగ్గుతుంది.. అలాగే అధిక బరువు, హెయిర్ ఫాల్ సమస్యలు కూడా పోతాయి..
మన శరీరంలో అతిపెద్దైన థైరాయిడ్ గ్రంధిలో ఏదైనా సమస్య తలెత్తితే శరీరం మొత్తం ప్రభావితమవుతుంది. అందుకే ఇది సక్రమంగా పనిచేసేందుకే జాగ్రత్తలు తీసుకోవాలి.

chamomile tea
మనలో దాదాపుగా అందరికీ టీ నో లేకపోతే కాఫీనో తాగే అలవాటైతేే పక్కాగా ఉంటుంది. వీలైతే రోజుకు ఐదారు సార్లైనా తాగే వారు చాలా మందే ఉన్నారు. పాలు, పంచదార కలిపిన ఈ పానీయాలు మన ఆరోగ్యానికి ఏమాత్రం మంచివి కావని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే వీటిలో కెఫిన్ ఎక్కువ మొత్తంలో ఉంటుంది. ఇది డయబెటీస్, అధిక రక్తపోటు వంటి సమస్యల ప్రమాదాన్ని పెంచుతుంది. వీటికి తోడు మన దేశంలో థైరాయిడ్ పేషెంట్ల సంఖ్య విపరీతంగా పెరిగిపోతోంది.
chamomile tea
థైరాయిడ్ గ్రంధి మన శరీరంలోని అతిపెద్ద గ్రంధి. దీనికి ఏదైనా సమస్య వస్తే మొత్తం శరీరంపై ప్రభావం పడుతుంది. అయితే ఈ థైరాయిడ్ సమస్య రాకుండా ఉండేందుకు ఒక హెర్బల్ టీ బాగా ఉపయోగపడుతుంది. అదేంటంటే..
chamomile tea
చామంతి టీ
చామంతి టీ లో ఎన్నో ఔషదగుణాంటాయి. దీనిలో ఫ్లేవనాయిడ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి థైరాయిడ్ సమస్యను , ప్రమాదాన్ని తగ్గించడంలో ఎఫెక్టీవ్ గా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
chamomile tea
థైరాయిడ్ సమస్య ఉన్నవారికి జుట్టు పగిలిపోయి.. విపరీతంగా రాలిపోతుంది. ఇలాంటి వారు రెగ్యులర్ గా చామంతి టీ తాగితే చక్కటి ఫలితం ఉంటుందని రుజువు చేయబడింది.
chamomile tea
అయితే చామంతి టీ తాగితే థైరాయిడ్ సమస్య మొత్తానికే తొలగిపోదు. కానీ సమస్య ఎక్కువ కాకుండా నియంత్రిస్తుంది.
ఈ హెర్బల్ టీని తాగితే జుట్టు రాలే సమస్య నుంచి పరిష్కారం దొరుకుతుంది. అలాగే సన్నని జుట్టు కూడా ఒత్తుగా అయిపోతుంది.
chamomile tea
ఊబకాయులకు ఈ టీ దివ్య ఔషదంలా పనిచేస్తుంది. ఎందుకంటే ఈ టీ ని క్రమం తప్పకుండా తాగడం వల్ల బెల్లీ ఫ్యాట్, అధిక బరువు తొందరగా తగ్గిపోతుంది.
chamomile tea
మధుమేహులకు కూడా చామంతి టీ ప్రయోజనకరంగా ఉంటుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. దీనిని తాగడం వల్ల వారి రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి.
చామంతి టీ మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఎందుకంటే దీనిలో ఒత్తిడి, టెన్షన్ ను తగ్గించే గుణాలు ఉంటాయి. దీనిని తాగిన తర్వాత మీరు రీఫ్రెష్ గా ఫీలవుతారు.