- Home
- Technology
- Gadgets
- Robot Vacuum: ఉన్నోల్లే కాదండోయ్.. మనం కూడా రోబో వ్యాక్యూమ్ కొనుక్కోవచ్చు. తక్కువ ధరలోనే
Robot Vacuum: ఉన్నోల్లే కాదండోయ్.. మనం కూడా రోబో వ్యాక్యూమ్ కొనుక్కోవచ్చు. తక్కువ ధరలోనే
Robot Vacuum: రోబో వాక్యూమ్ క్లీనర్స్‌కి డిమాండ్ పెరుగుతోంది. అయితే వీటి ధరలు ఎక్కువ ఉండడంతో కేవలం కొందరికే పరిమితమనే ఆలోచనలో ఉంటాం. కానీ ఐలైఫ్ పేరుతో బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లతో కూడిన వ్యాక్యూమ్ క్లీనర్ గురించి తెలుసుకుందాం.

ILIFE A20 ప్రో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్
ఇంటి పనుల్లో ఎక్కువ సమయం తీసుకునేది పని శుభ్రపరచడం. ముఖ్యంగా దుమ్ము, పెట్ హెయిర్, చిన్న చెత్త వల్ల రోజూ క్లీనింగ్ చేయాల్సి వస్తుంది. ఇలాంటి సమయంలో ILIFE A20 ప్రో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్ స్మార్ట్ టెక్నాలజీతో ఇంటిని ఆటోమేటిక్‌గా శుభ్రం చేస్తుంది. ఈ రోబోట్ వాక్యూమ్‌లో అప్గ్రేడ్ చేసిన LiDAR నావిగేషన్ టెక్నాలజీ ఉంది. ఇది ఇంటి మ్యాప్‌ను స్కాన్ చేసి, ఏ గది ఎక్కడ ఉందో గుర్తుంచుకుంటుంది. ఫర్నిచర్‌ను ఢీకొనకుండా, మెట్ల నుంచి పడిపోకుండా సురక్షితంగా కదులుతుంది. ఇంట్లో గదులు ఎక్కువగా ఉన్నా సమస్య లేదు. ఒకేసారి 5 ఫ్లోర్ల వరకు మ్యాప్స్ సేవ్ చేసుకునే అవకాశం ఉంది. ప్రతి గదికి వేర్వేరు క్లీనింగ్ సెట్టింగ్స్ పెట్టుకోవచ్చు. మొబైల్ యాప్ ద్వారా వర్చువల్ వాల్ కూడా సెట్ చేయొచ్చు. దీంతో అవసరం లేని ప్రాంతాల్లోకి రోబో వెళ్లదు.

పవర్‌ఫుల్ సక్షన్‌తో డీప్ క్లీనింగ్
ILIFE A20 ప్రో రోబోట్ వ్యాక్యూమ్ క్లీనర్‌లో శక్తివంతమైన సక్షన్ సిస్టమ్ ఉంది. ఇది నేలపై ఉన్న దుమ్ము, జుట్టు, చిన్న చెత్త కణాలను సులభంగా పీల్చేస్తుంది. సంప్రదాయ ఊడ్చే పద్ధతిలో దుమ్ము గాల్లోకి ఎగిరిపోతుంది. కానీ ఈ రోబో వాక్యూమ్ నేరుగా నేల నుంచే దుమ్మును తీసేయడం వల్ల ఇంటి వాతావరణం మరింత పరిశుభ్రంగా ఉంటుంది. ప్రత్యేకంగా పిల్లులు, కుక్కలు ఉన్న ఇళ్లకు ఇది చాలా ఉపయోగకరం. పెట్ హెయిర్‌ను కూడా సమర్థంగా తొలగిస్తుంది. కార్పెట్ మీదకు వెళ్లినప్పుడు ఆటో కార్పెట్ బూస్ట్ ఫీచర్ ద్వారా సక్షన్ పవర్ ఆటోమేటిక్‌గా పెరుగుతుంది. ధర విషయానికొస్తే అమెజాన్ లోఈ వ్యాక్యూమ్ క్లీనర్ అసలు ధర రూ. 69,999కాగా ఏకంగా 77 శాతం డిస్కౌంట్ తో రూ. 16,400కే లభిస్తోంది. దీంతో పాటు పలు బ్యాంకులకు చెందిన క్రెడిట్ కార్డులతో కొనుగోలు చేస్తే అదనంగా రూ. 1500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు.
వాక్యూమ్‌తో పాటు మాపింగ్ ఫీచర్
ఈ డివైస్‌లో వాక్యూమ్, మాప్ రెండూ ఒకేసారి పనిచేస్తాయి. 2-in-1 వాటర్ ట్యాంక్, డస్ట్ ట్యాంక్ ఉండటం వల్ల ఒకేసారి దుమ్ము తొలగించడంతో పాటు నేలను తుడుస్తుంది. ఇందులో ఉన్న Y-Shape మాపింగ్ సిస్టమ్ మనిషి చేతితో తుడిచినట్లుగా ముందుకు వెనక్కి కదులుతూ ఫ్లోర్‌ను పూర్తిగా శుభ్రం చేస్తుంది. ముఖ్యంగా టైల్ ఫ్లోర్లు, గ్రానైట్, వుడ్ ఫ్లోర్లు వంటి ఉపరితలాలపై మంచి ఫలితాలు ఇస్తుంది.
అన్ని రకాల ఫ్లోర్లకు అనుకూలం
ఈ రోబో వ్యాక్యూమ్ క్లీనర్ హార్డ్ ఫ్లోర్, టైల్స్, గ్రానైట్ ఫ్లోరింగ్, మొజాయిక్ ఫ్లోరింగ్, వుడెన్ ఫ్లోరింగ్, విట్రిఫైడ్ టైల్స్, బాల్కనీ టైల్స్, సిమెంట్ ఫ్లోర్, కార్పెట్స్ వంటి అన్ని రకాల ఫ్లోర్లకు అనుకూలంగా ఉంటుంది. 2-in-1 రోలర్ బ్రష్ వల్ల వివిధ రకాల నేలలపై సమానంగా క్లీన్ అవుతుంది. మూలల దగ్గర, గోడల అంచుల దగ్గర కూడా సైడ్ బ్రష్‌లతో చెత్తను సేకరిస్తుంది.
స్మార్ట్ కంట్రోల్, పెద్ద బ్యాటరీ
ఈ రోబోట్ వాక్యూమ్‌ను మొబైల్ యాప్ ద్వారా నియంత్రించవచ్చు. అలాగే అలెక్సా, గూగుల్ హోమ్ వంటి వాయిస్ కమాండ్స్‌కు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇందులో 5200mAh పెద్ద బ్యాటరీ ఉండటం వల్ల ఒకసారి ఛార్జ్ చేస్తే పెద్ద ఇంటిని కూడా శుభ్రం చేయగలదు. సుమారు 4500 చదరపు అడుగుల వరకు క్లీనింగ్ చేయగల సామర్థ్యం ఉంది. బ్యాటరీ తగ్గినప్పుడు ఇది ఆటోమేటిక్‌గా ఛార్జింగ్ డాక్‌కి వెళ్లి ఛార్జ్ అవుతుంది. మళ్లీ ఛార్జ్ పూర్తయ్యాక ఆగిన చోటు నుంచి క్లీనింగ్ కొనసాగిస్తుంది.

